ఉత్తరాయణం

కోవింద్‌కు మద్దతు సబబే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధికార ఎన్డీఏ కూటమి రాష్టప్రతి అభ్యర్థిగా బీహార్ గవర్నర్‌గా పనిచేస్తున్న బిజెపి సీనియర్ నేత కోవింద్‌ని ప్రతిపాదించిన లగాయతు ప్రతిపక్షాల ఐక్యత ప్రమాదంలో పడింది. చట్టసభల్లో ఆధిక్యత కారణంగా ఎటూ అధికారిక అభ్యర్థి నెగ్గడం ముందే ఖాయమైంది. అయితే ప్రతిపాదించబడ్డ అభ్యర్థి వివాదరహితుడు, సామాన్య దళిత నేపథ్యం కలిగి ఉండడమన్నది అధికారపక్షానికి అదనపు అర్హతగా తయారైంది. బిజెపి భావజాలాన్ని పూర్తిగా వ్యతిరేకించే పార్టీలు మినహా అంశాలవారీగా, అవకాశాల వారీగా, పరిస్థితుల ప్రాబల్యం కారణంగా ఒడ్డుకి ఆవల వైపు వున్న పార్టీలు పునరాలోచనలో పడ్డాయి. ఎలాగూ గెలవడం ఖాయమనుకున్న వారికే తమ మద్దతు ప్రకటించేస్తే నష్టమేమిటన్న ధోరణి వైపే మొగ్గు చూపిస్తున్నాయి. ఆ ధోరణికి పరాకాష్ఠ నేడు జెడీయు తరఫున నితీష్‌కుమార్ కూడా అధికారిక అభ్యర్థికి మద్దతు ప్రకటించడం. అదే దోవలో నిన్న బిజు జనతాదళ్ నడిచింది.వైఎస్సార్ పార్టీ, తెలంగాణ రాష్టస్రమితి ఆ విషయంలో ముందుగానే స్పష్టతతో ఉన్నాయి కాబట్టి చెప్పుకోవాల్సింది లేదు. అయతే నితీష్‌కుమార్ సంగతి వేరు. తరువాత జరగబఱోయే సాధారణ ఎన్నికల్లో మోడీకి, బిజెపికి ఎదురొడ్డే విపక్షాల ఉమ్మడి అభ్యర్థుల జాబితాలో ఆయనదొక పేరు. ఇప్పడు ఆయన గొంతులో మారిన పల్లవి, అధికార కూటమిపై ముందు ముందు ఆయన చూపబోయే సాఫ్ట్ ధోరణికి సూచీ కావచ్చు. ప్రతిపక్షాలు తమ ఐక్యతా గళాన్ని సవరించుకోవాల్సిన అగత్యం ఏర్పడిందనడానికి ఇదో ముందుస్తు ప్రమాద సూచిక. రాష్టప్రతి అభ్యర్థిని ఉమ్మడిగా బలపరచడం ఓ మంచి సంప్రదాయమైనా, వాస్తవంలో తమ ఐక్యతకు ఏర్పడుతున్న పగుళ్లను గుర్తించడం కూడా అత్యవసరమే.
- డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
రైతుకు ఆధారం గోసంతతి
గోవుల అమ్మకాలపై కొన్ని విధి విధినాలను కేంద్రం ప్రకటించగానే సిపిఐ నేత నారాయణ ఇదంతా ‘హిందూత్వ అజెండా’ అని రంకెలేస్తూ చేపలు, కోళ్లు, మేకల వధను ఎందుకు నిషేధించలేదని నిలదీయడం తగదు. మన దేశానికి గ్రామాలు ఆయువుపట్టు. రైతులు వ్యవసాయం చేసేందుకు గోసంతతి పశువులు అవసరం. పిల్లల ఎదుగుదలకు ఆవుపాలు కావాలి. అందుకే మహాత్మాగాంధీ సహా ఎందరో విజ్ఞులు భారత ఆర్థిక వ్యవస్థకు మూలాధారం గోవు అన్నారు. అలాంటి గోవును మనం సంరక్షించుకోవాలి. కోళ్లు, చేపలూ పాలు ఇవ్వవు. మేకలు, గొర్రెలు పొలాలు దున్నవు. ఆర్థిక వ్యవస్థకు ఇవి అంతగా ఉపకరించవు.
- జ్ఞానబుద్ధ, సిద్ధార్థనగర్
ఇగిరిపోని గంధం సినారె
‘జాతస్యమరణం ధృవం‘ అన్నది సత్యమైనా కొందరి మరణాన్ని త్వరగా జీర్ణించుకోలేము. కర్పూర వసంతరాయలు, విశ్వంభరలను తెలుగు వినువీధులకు విస్తరించపచేసి జ్ఞానపీఠాన్ని అధిరోహించి, భారత ప్రభుత్వంచే పద్మశ్రీ గౌరవాన్ని పొందిన సి.నారాయణరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా, అధ్యాపకునిగా, ఆచార్యునిగా తెలుగు భాషకు తనవంతు కృషి చేసి ప్రశంసలు పొంది నటసార్వభౌమఎన్టీఆర్‌ను ఓ సభలో తన మృధు మధుర వాగ్ధాటితో ఆకర్షించి , ఆ మహానటుని సొంత సినిమాలో ‘నన్ను దోచుకుందువటే’ అన్న పల్లవితో తొలిపాటకు ప్రాణంపోసి చిరంజీవిని చేసి, ఆ తదుపరి అనేక వందల భావగర్భితమైన పాటలతో పగలే వెనె్నలలు కురిపించి, ఇగిరిపోని గంథాన్ని తెలుగు చిత్ర సీమకందించి ఈ జగత్తులో జీవించినంత కాలం కలానికి విశ్రాంతినివ్వక తన కవితా స్రవంతిని ప్రవహింపచేసి ఇక చాలనుకున్నారో ఆకాశవీధిలో ఓ ధృవనక్షత్రంలా వెలగడానికి తరలిపోయారు సినారె.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్