ఉత్తరాయణం

ఉపాధ్యాయులకు వేసవి విధులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకనాడు ఉపాధ్యాయులను తమ బిడ్డలను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దేవారి వారిగా ఎంతో గౌరవభావంతో మెలిగేవారు. తమ పిల్లలు ఉద్యోగాల్లో ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి ఉపాధ్యాయులే పునాది అని భావించేవారు. అలాగే టీచర్లు కూడా అంకిత భావంతో విద్యార్థులను తమ సంతానంగా భావించి చదువు నేర్పేవారు. బెత్తానికి పనిచెప్పి శిక్షించినా తల్లిదండ్రులు ఏమీ అనేవారు కాదు. ఎందుకంటే తల్లిదండ్రులు తమ బిడ్డల అభ్యున్నతిని ఆశించేవారు. విద్యార్థులు శ్రద్ధతో చదివి ఉన్నతోద్యోగాలకు ఎంపికయ్యేవారు. కాని ఈనాటి టీచర్లను ప్రభుత్వం మల్టీపర్పస్ కలాపాలకు ఉపయోగించుకోవడంతో విద్య అడుగంటిపోతోంది. ఎన్నికలు, జనాభాలెక్కలు, ఆధార్‌కార్డులు, తుఫాన్లు, అధికారులు, అనధికారుల సమీక్షలు వారికి పరిపాటైపోయాయి. ఇప్పుడు కొత్త షెడ్యూలు అమల్లోకి వచ్చింది. వేసవి సెలవుల్లో మధ్యాహ్నభోజనాలు ఏర్పాటుకు టీచర్లు హాజరుకావాలన్నదే ఈ నిబంధన. టీచర్ల పరిస్థితి చూసి జాలిపడాల్సి వస్తోంది.
- బొడ్డపాటి రాజేశ్వరమూర్తి, చిలకలపూడి

పేరుకు మాత్రమే అగ్రవర్ణం
పేరుకుమాత్రమే అగ్రవర్ణంగా చెలామణి అవుతూ అన్నివిధాల అణచివేతకి గురవుతున్న బ్రాహ్మణుల గురించి పోరాడే ఒక్క నాయకుడు కూడా దేశంలో లేడు. ప్రతిభ ఉండి కూడా ఉద్యోగాలు లేక పూటగడవడం కూడా కష్టంగా ఉన్న బ్రాహ్మణులను ఆదుకునే నాధుడు లేడు కానీ, వీరిని తిట్టిపోయడానికి మాత్రం అనేక స్వతంత్ర సంస్థల నాయకులు పోటీపడుతున్నారు. అలా అయితేనే ఓట్లు పడతాయని వీరి నమ్మకం. దశాబ్దాలుగా రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తూ, రాజకీయంగా, ఉద్యోగాలపరంగా అన్ని విధాల దూసుకుపోతున్న దళితులకు ఇంకా ఏదో అన్యాయం జరిగిపోతోందని బ్రాహ్మణులను తిట్టిపోస్తున్న కాంగ్రెస్, కమ్యూనిస్టులు కళ్లు ఉండి కూడా చూడలేని ధృతరాష్ట్రులు. బ్రాహ్మణ వర్గానికి ఒక్క మంత్రి పదవీ దక్కలేదు. ఆఖరికి ఎమ్మెల్యేల కూడా ఒకరో, ఇద్దరో తప్ప లేరు. ఆత్మహత్య చేసుకున్న దళిత విద్యార్థి కోసం పోరాటాలు చేస్తున్న పార్టీలు, ఆ స్థానంలో ఒక బ్రాహ్మణ విద్యార్థి ఉంటే జాతీయస్థాయి నాయకుడు కాదుకదా, గల్లీస్థాయి కార్యకర్తలైనా పట్టించుకోరు.
- సి.హెచ్. మల్లేశ్వరరావు, కాకరపర్రు, ప.గోజిల్లా

కుప్పంలో అన్ని రైళ్లూ ఆపాలి
ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆసెంబ్లీ నియోజకవర్గం, ఆయన సొంత వూరు, ద్రవిడ విశ్వవిద్యాలయం, ఇతర కాలేజీలు, వ్యాపార సంస్థలు కలిగిన చిత్తూరు జిల్లాలోని కుప్పంలో అన్ని రైళ్లు ఆగడం లేదు. చెన్నై-బెంగళూరు మధ్య నడిచే బృందావన్ ఎక్స్‌ప్రెస్‌లో గతంలో ఎసి ఛైర్‌కార్ ఉండేది. ఈ రైలు కుప్పంలో ఆగుతుంది. ఈమధ్య పై రెండు రాజధానుల మధ్య పూర్తి ఏసి డబుల్ డెక్కర్ రైలును ప్రవేశపెట్టిన తర్వాత, బృందావన్ ఎక్స్‌ప్రెస్‌లో ఎసికోచ్‌ను తొలగించారు. ఇక డబుల్ డెక్కర్ రైలు కుప్పంలో ఆగదు. అందువల్ల కొన్ని రైళ్లు మాత్రమే ఆగుతున్న కుప్పంలో అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలపాలి. రైల్వేస్టేషన్‌ను ఆధునీకరించాలి.
-ఎన్. రామలక్ష్మి, సికిందరాబాద్