ఉత్తరాయణం

సమర్థులకు పట్టం కట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వేరువేరు సమాచార కమిషన్లకు ప్రధాన సమాచార కమిషనర్లను ఆరు వారాల్లో నియమించాల్సిందిగా ఫోరం ఫర్ గుడ్ గవర్నన్స్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో హైకోర్టు ఆదేశించి, వివరాల్ని దాఖలు చేయాలని సెప్టెంబర్ 21వ తేదీకి తదుపరి వాయిదా వేసింది. ఈ సందర్భంలో గతంలో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిపారని నలుగురు సమాచార కమిషనర్లని సుప్రీంకోర్టు తొలగించిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన సమాచార కమిషనర్లుగా, సమాచార కమిషనర్లుగా సామాజిక సేవకులు, జర్నలిస్టులు, సమాచార హక్కు చట్ట కార్యకర్తల్ని, సమర్ధుల్ని పారదర్శకంగా ఎంపిక చేసి నియమించాల్సి వుంది. ఈ అంశంలో ఇరు ముఖ్యమంత్రులు సమర్థులతో నియామకాలు జరపాలని ప్రజలు కొరుకుంటున్నారు.
- టి.సురేశ్‌కుమార్, మందరాడ
ప్రజాధనం వృథా
ప్రతి చిన్న సమస్యకు నానా రభస చేసి లోక్‌సభ, రాజ్యసభలు జరగకుండా అడ్డుకుంటున్నవి విపక్షాలు. అందువల్ల లక్షలాది ప్రజాధనం వృధా కావడమే కాక ప్రజలకు మేలు చేసే బిల్లులు ఆగిపోతున్నాయి. ఇదోరకం బ్లాక్‌మెయిలింగ్. రాజ్యాంగ ఉల్లంఘన కూడా. రాష్టప్రతి రాజ్యాంగ పరిరక్షకుడు కాబట్టి ఆయనే చొరవ తీసుకుని ఎంపీలను దారిలో పెట్టాలి. లేదా ఏదైనా ఎన్‌జివో రాజ్యాంగాన్ని ఉల్లంఘించేవారిపై కేసు పెడితే బాగుంటుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడిచినా ఎంపీలకు సభా మర్యాద తెలియకపోవడం స్పీకర్లు వారిని అదుపులో పెట్టలేకపోవడం సిగ్గుచేటు.
- శాండో ప్రచండ్, కాకినాడ
స్వయం ప్రతిపత్తి కల్పించాలి
జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలోని ఆకాశవాణి (ఎఐఆర్) రిలే కేంద్రానికి స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. విశాఖపట్నంలో స్వయం ప్రతిపత్తిగల కేంద్రం వున్నప్పటికీ ప్రసారాలు శ్రీకాకుళం ప్రాంతాలకు సరిగా వినపడడంలేదు. గందరగోళంగా పరిణమిస్తోంది. ప్రస్తుతం శ్రీకాకుళం ఎఐఆర్ కేంద్రానికి విజయవాడ నంచి కార్యక్రమాలు రిలే అవుతున్నాయి. ఈ దుస్థితిని దూరం చేసేందుకు శ్రీకాకుళం ఎఐఆర్ రిలేకేంద్రానికి స్వయం ప్రతిపత్తి కల్పించాలి. విప్లవ రచయితలు, కళాకారులకు ఎంతో లాభం చేకూరుతుంది. ఉత్తరాంధ్ర ఎంపీలు కృషి చేయాలి.
-వాండ్రంగి కొండలరావు, పొందూరు
ఆటకున్న విలువ చదువుకు లేదా?
స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో దేశీయంగానో, అంతర్జాతీయంగానో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థలు కోట్లలో నజరానాలు, భూములు ఇవ్వడమే కాకుండా చదువుతో నిమిత్తం లేకుండా పెద్ద సంస్థల్లో ఉన్నత శ్రేణి ఉద్యోగాల్లో నియమిస్తున్నారు. నటులను పార్లమెంటు మెంబర్లుగా చేసినా సభలకు వెళ్లనట్టే వీరు కూడా ఉద్యోగాలు చేయరు. ప్రతిభ చూపేవారు ఒక్క ఆటలలోనే కాదు ఎంతో ఉన్నత చదువులు చదివిన వారు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇటువంటి వారి ప్రత్యేకతలను ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు సంపాదించి మరుగున పడ్డవారికి తగ్గ ఉద్యోగాలు ఇస్తే దేశప్రగతికి తోడ్పడినట్టు అవుతుంది. చురుగ్గా పనిచేసే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ విషయంపై దృష్టి పెట్టాలని మనవి.
- ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్