ఉత్తరాయణం

పంచ గ్రామాల సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం పరిసర ప్రాంతాల్లో ఐదు గ్రామాల్లో అనేక మంది స్థలాలు కొన్నవారు ఉన్నారు. పూర్వం ఇప్పుడు చంద్రబాబునాయుడుగారు ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి దాటవేస్తున్నారు. ఈ గ్రామాలు కాక దగ్గర గ్రామాల్లో స్థలాలున్నవారు వారి స్థలం అమ్ముకోలేక కొత్తగా స్థలం కొనుక్కోలేక బాధపడుతున్నవారు ఉన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చొరవ చూపి ఆ పంచగ్రామాల సమస్య పరిష్కరిస్తే ఆ గ్రామాల వారికి, చుట్టుపక్కల వారికి సమస్యలు తొలుగుతాయి.
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్నం

కఠినంగా శిక్షించాలి
కాదేదీ కల్తీకనర్హం. తినే ఆహార పదార్థాలు అవీ ఇవీ అని ఏదీ లేదు. సర్వం కల్తీమయమే కావడం మానవుని క్రూరత్వాన్ని తెలియజేస్తుంది. ఆఖరికి మన ప్రాణాలను నిలబెట్టే అన్నానికి మూలమైన బియ్యమూ ప్లాస్టిక్ మయం కావడం సహించరానిది. విష పూరితమైన ప్లాస్టిక్ బియ్యం మానవుని ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుందో వేరే చెప్పాలా? ఇలా కృత్రిమ విష పూరితమైన ప్లాస్టిక్ బియ్యాన్ని తోటి మానవుల ఆరోగ్యానికి హాని అని కూడా ఆలోచించకుండా అమ్మజూపే కిరాతకులను కఠినంగా శిక్షించాలి. నిత్యం దాడులు నిర్వహించి అమ్మే బియ్యాన్ని పరీక్షించాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్

కల్వకుంట్ల వారి గొప్పలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న దేశంలోకెల్లా ఎత్తయిన జండాను, సంజీవయ్యపార్కులో 303 అడుగల ఎత్తయిన జాతీయ జండాను నిర్మించుటకు ప్రభుత్వం 1.96 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ జండాను నిర్మించే బాధ్యతను కోల్‌కతాకు చెందిన స్కిప్పర్ కంపెనీకి అప్పగించింది. ముఖ్యమంత్రి కల్వకుంట్లవారు తన మనసులోనికి ఏది వస్తే దానిని చేయడానికి స్వంత నిర్ణయం తీసుకొంటారు. దానికోసం ప్రభుత్వ (ప్రజల) డబ్బు కోట్లకొలది రూపాయలు దుబారా ఖర్చుచేస్తున్నారు. అంత పెద్ద జండాను నిర్మించవలసిన అవసరమేమున్నది? దానివలన ప్రయోజనమేమిటి? ప్రజాధనాన్ని ఈ విధంగా విచ్చలవిడిగా విచక్షణా రహితంగా ఖర్చుచేయడం పెద్ద నేరం. రాష్ట్రంలో ఎన్నో రకాల ప్రజోపయోగ పనులకు డబ్బు లేదంటూ వాయిదాలు వేస్తూ, ఈ విధంగా ఖర్చుచేయడం ఏమాత్రం సమంజసం కాదు..
- బి.సత్యప్రకాశ్, సూర్యాపేట

బెల్టు షాపుల నియంత్రణ ఏది?
అధికారంలోకి రాగానే బెల్టు షాపులు తొలగిస్తామన్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ హామీని తుంగలోనికి తొక్కి వీధి వీధికి బెల్టు షాపులను ఏర్పాటుచేసినా పట్టించుకోవడం లేదు. రాత్రయ్యేసరికి నగరాల, గ్రామాలనే తేడా లేకుండా ప్రజలు మద్యం సీసాలతో సహజీవనం చేస్తూ మత్తులో ఊగుతున్నారు. హఐవేలపై మద్యం దుకాణాలు బాగా ఎక్కువైపోవడంతో డ్రైవర్లు ఫుల్‌గా లాగించి వాహనాలు యమస్పీడుతో నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇక టీషాపులు, రెస్టారెంట్లు, దాబాలు, రెస్ట్‌హౌస్‌లలో భోజనంతోపాటు మద్యం, మగువ యధేచ్ఛగా దొరుకుతోంది. హైవేలపై జరిగే ప్రమాదాలలో 90 శాతం స్పీడ్ డ్రైవింగ్, మందు సేవించడంవలనే జరుగుతున్నాయని జాతీయ రహదారి భద్రతా సమాఖ్య తేల్చి చెబుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదో ఆ భగవంతునికే ఎరుక!
- ఎం.కనకదుర్గ, తెనాలి

బాపూజీ కలలు నిజం కావాలంటే..?
ప్రగతికి పల్లెసీమలు పట్టుకొమ్మలు. నేటి భారతదేశంలో గ్రామాలు ఎంత అధ్వాన్నస్థితిలో వున్నాయో ఊహించలేని స్థితి. బాపూజీ గ్రామ సీమల అభివృద్ధికి ఎన్నో పథకాలు సూచనలు ఇచ్చాడు. కానీ అవి అమలులో లేవు. ముఖ్యంగా కుటీర పరిశ్రమలు, ఖద్దరు దుస్తులు ధరించుట విదేశీ వస్తు బహిష్కరణ బాపూజీ సిద్ధాంతాలు. బాపూజీ సుమార్గకిరణం ఏర్పాటుచేసి గ్రామసీమలు అభివృద్ధిచేయుట ఎంతో ఆవశ్యకత కలిగివున్నది. వ్యవసాయ రంగం పాడిపరిశ్రమ అభివృద్ధికి ఇతోధిక సేవలు అందించి గ్రామసీమల పటిష్టతను అభివృద్ధిపరచాలి. నిరక్షరాస్యులకు అక్షరాస్యులని చేయుట ముఖ్యమైన విషయం. స్వచ్ఛ్భారత్ యందు ప్రధానమంత్రి మోదీగారు ‘బాపూజీ సుమార్గకిరణం’ విధానం అమలుపరిచి ప్రయోజనాలు చేకూర్చాలి.
- కోవూరు వెంకటేశ్వరప్రసాదరావు, కందుకూరు

హోదా అక్కరలేదా?
ఏరుదాటేవరకు ఓడుమల్లన్న ఏరుదాటిన తర్వాత బోడిమల్లన్న అన్న చందంగా ఉంది కేంద్ర ప్రభుత్వం స్థితి. కేంద్రమంత్రి తెగేసి శేషాంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అక్కరలేదని నిర్ధారించారు. ఇక వారు ఏ ముఖం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాగలరు. ఇకనైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళ్ళుతెరిచి రాబోయే ఎన్నికల్లో ప్రస్తుత ప్రభుత్వానికి గుణపాఠం నేర్పగలరని ప్రజలకి వినతి.
- పిఎస్ రావు, విశాఖపట్నం