ఉత్తరాయణం

గౌరీ లంకేశ్ హత్య అమానుషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ పాత్రికేయురాలు, సామాజికవేత్త గౌరీ లంకేశ్‌పై బెంగళూరులో కొందరు దుండగులు కాల్పులు జరిపి చంపడం అమానుషం. కన్నడ పత్రికకు ఎడిటర్‌గా పనిచేస్తూ, ప్రజా సమస్యలను, అవినీతి, అక్రమాలను వెలికితీస్తూ గౌరీ లంకేశ్ తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. మొన్న కల్బుర్గీ, నిన్న పన్సారే, దబోల్కర్, నేడు గౌరీ లంకేశ్. ప్రజాస్వామ్య దేశంలో జర్నలిస్టులకు రక్షణ లేదా? పత్రికా విలేఖరులు పాలకులను ప్రశ్నించకూడదా? ప్రశ్నించే జర్నలిస్టులను చంపేయడం ఎంతవరకు సమంజసం? 1980 సంవత్సరంలో పత్రికను ప్రారంభించి ఎలాంటి ప్రకటనలు లేకుండా దాన్ని నడిపిస్తూ, అవినీతిపరులు, రాజకీయ నాయకులు, కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా కథనాలు రాస్తూ తన తండ్రి వారసత్వాన్ని పుణికితెచ్చుకుని ధైర్యవంతురాలుగా గౌరీ లంకేశ్ అందరి ఆదరాభిమానాలను చూరగొన్నారు. దేశంలో నానాటికీ పెరిగిపోతున్న అసహనానికి ఆమె హత్యే నిదర్శనం. ఇది భావ ప్రకటన స్వేచ్ఛపై జరిపిన అకృత్యం. గౌరీ లంకేశ్‌ను హత్యచేసిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలి. ఈ హత్యను కుల మతాలకతీతంగా అందరూ ముక్తకంఠంతో ఖండించాల్సిందే. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరుగకుండా ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకురావాలి.
-కామడి సతీష్‌రెడ్డి, జడలపేట
జలసిరి హారతి
జలజల పారే గోదారమ్మకు మంగళహారతులిద్దాము
బిరబిర సాగే కృష్ణమ్మకు ప్రవాహ పరిమితి పెంచేద్దాము
కళకళలాడే కావేరమ్మకు పూర్వవైభవం తెచ్చేద్దాము
సరసర సాగే సకల నదులను
సవ్యంగా సాగే పని చూద్దాము
మిలమిల మెరిసే జలాశయాలను
మనమంతా స్వాగతిద్దాము
ధనధన నిండిన చెరువులు ప్రతి గ్రామాన
కొలువుండేలా చేద్దాము
హలహల ‘ఎత్తిపోతల’ను గట్టిగ పట్టి
జలముల వినిమయమే చేద్దాము
టకటక ఇంకుడు గుంతలు తవ్వి
భూగర్భ జలాలను నిలిపేద్దాము
జయజయ నాదం ప్రతిధ్వనించగ
జలసిరి కేతనమెగరేద్దాము
శుభశుభ శుభమంటూ సంకల్పిద్దాము
చిత్తశుద్ధితో పనిచేద్దాము
హరహర హరోంహర చంద్రన్న కార్యదీక్ష
సఫలం కావాలని ఆశిద్దాం
సిరిసిరి మువ్వల సవ్వడి చేసే
జలనిధులను ఆకాంక్షిద్దాము
భళభళ తెలుగు నేలపై కరువును తరిమి
సస్యశ్యామలం చేద్దాము
-చావలి శేషాద్రి సోమయాజులు, సాలూరు