ఉత్తరాయణం

గౌరీ లంకేశ్ హత్య అత్యంత హేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫాళీని పాతాళంలో పెట్టినా
వేకువకల్లా వెలుగుమొక్కై ఉద్భవిస్తుంది
అవలీలగా అనంతమై ఉద్యమిస్తుంది
భావాన్ని చురకత్తుల బోనులో చెరబట్టినా
లావాలా మరుక్షణమే ఉబికి వస్తుంది
తానే ఓ ప్రపంచమై ప్రవహిస్తుంది
ఒక గొంతుని మూటగట్టి దిగంతాల దాకా విసిరేసినా
ప్రతిధ్వనిగా మళ్లీ పుట్టి నీ ఇంటిపైనే వాలుతుంది
నీ మత్తుని వదిలించే పిడుగులు కురిపిస్తుంది
మిత్రమా.. నువ్వెంతటి వాడివైనా సరే
స్వేచ్ఛాగానాన్ని ‘మ్యూట్’ చేయలేవు
సకల సంకుచిత సంకెళ్లు తెంచు
మానవుడివై వ్యాపించు
ప్రశ్నించు..ప్రశ్నను భరించు
-డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
ఉచిత పథకాలు వద్దు
కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత వరాలను తెగ గుప్పిస్తున్నాయి. వీటివల్ల కోట్లాది రూపాయలు ఖర్చయి, అంతిమంగా ఆ బరువు ప్రజల నెత్తినే పన్నుల రూపంలో పడుతోంది. ఉచిత విద్యుత్, రుణమాఫీ, సబ్సిడీ బియ్యం, ఉచిత కరెంట్, ఉచితంగా చీరలు, సబ్సిడీ క్యాంటీన్లు ఇలా కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తూ అడగకపోయినా ఉచితంగా అన్నీ ప్రజలకు వడ్డించడంలో రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. గత ప్రభుత్వాలు అమలు చేసిన ప్రజాకర్షక పథకాలు నేడు వికృత రూపం దాలుస్తున్నాయి. పథకాల అమలులో ప్రభుత్వ నిఘా లోపించిన కారణంగా దళారులు, అధికారులు మధ్యలో సగం నిధులను స్వాహా చేస్తున్నారు. విదేశాల్లో అందునా అభివృద్ధి చెందిన దేశాల్లో పరిస్థితి దీనికి భిన్నంగా వుంది. ఉచిత పథకాలతో ప్రజల్లో కష్టపడే గుణం తగ్గిపోతుంది.
-కాయల నాగేంద్ర, హైదరాబాద్
రైలు ప్రమాదాలు తగ్గేదెలా?
వరసగా రైలు ప్రమాదాలు జరగడం, అమాయకులైన ప్రయాణీకులు మరణించడం, గాయపడడం బాధను కలిగిస్తోంది. ఈ ఘోర ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ రైల్వేమంత్రి రాజీనామా చేస్తే ప్రమాదాలు తగ్గుతాయా? అలనాడు లాల్ బహదూర్ శాస్ర్తీ ఓ రైలు ప్రమాదానికి బాధ్యత వహించి రాజీనామా చేసారు. ప్రమాదాలు నివారించబడ్డాయా? ఏ కారణాలవల్ల ప్రమాదాలు జరుగుతున్నాయో అనేక నివేదికలు వెలువడ్డాయి. ట్రాక్ మరమ్మతులు శ్రద్ధగా చేపట్టక పోవడం, సిగ్నలింగ్ వ్యవస్థ లోపాలు, ఉద్యోగుల విధి నిర్వహణను సక్రమంగా చేయకపోవడం వంటివి రైలు ప్రమాదాలకు ముఖ్య కారణాలు. ఈలోపాలను సరిదిద్దే ప్రయత్నాలు చేపట్టాలి. ఇవి చేయకుండా, మంత్రులు రాజీనామాలు చేస్తే పరిస్థితులు చక్కబడవు.
-ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్