ఉత్తరాయణం

స్ఫూర్తిప్రదాత మోక్షగుండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుప్రసిద్ధ ఇంజనీర్, పాలనాదక్షుడు మోక్షగుండం విశే్వశ్వరయ్య ఆధునిక ఇంజనీర్లకు స్ఫూర్తిప్రదాత. ఆయన జయంతి సెప్టెంబర్ 15ను ఇంజనీర్స్ డేగా పరిగణిస్తున్నారు. ఆధునిక ఇంజనీరింగ్ రంగంలో ప్రతి ఒక్కరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన సమయం ఇది. ఆయన ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఎన్నో ప్రాజెక్టులు దేశవిదేశాల్లో ఇప్పటికీ సాక్షీభూతంగా ఉన్నాయి. లక్షలాది ఎకరాలకు నీరందించే ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన చేసిన కృషి అపారం.
-కామిడి సతీష్‌రెడ్డి, పరకాల
ప్రైవేటీకరణ తగదు
ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటీకరించడం ఎంతమాత్రం సమంజసం కాదు. ఏవేవో సాకులు చూపి సర్కారు పాఠశాలలను ప్రభుత్వ, ప్రైవేటు పద్ధతిలో నిర్వహించడంవల్ల నష్టమే జరుగుతుంది. ప్రభుత్వ విద్యాసంస్థలను ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించాలన్న నీతిఅయోగ్ నివేదికను కేంద్రప్రభుత్వం అమలు చేయకూడదు. ఆ సూచనను పాటిస్తే బడుగువర్గాల పిల్లలు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉంది. అందరికీ విద్య ఎండమావి అవుతుంది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిందని, ఫలితాలు ఆశాజనకంగా లేవన్న సాకుతో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదు. ఫలితాల సాధనకు చక్కటి ప్రణాళిక అమలు చేయాలి తప్ప అసలుకే మోసం చేసే నిర్ణయాలు సరికాదు.
-వాండ్రంగి కొండలరావు, పొందూరు
ఆ పోస్టర్ అభ్యంతరకరం
ఇటీవల విడుదలై విజయవంతమైన అర్జున రెడ్డి సినిమా ప్రచారంలో భాగంగా వేసిన ముద్దు సీన్‌తోకూడిన పోస్టర్ వివాదాస్పదమైంది. రాజకీయాలు పక్కనబెడితే అలాంటి పోస్టర్లు అభ్యంతరకరమే. సినిమా విజయవంతమైనంత మాత్రాన అసభ్యతకు పట్టం గట్టినట్లు కాదు. పోస్టర్లు, ట్రెయిలర్లు వంటివాటిని చిన్నపిల్లలకు కూడా చూస్తారు. వారి మనసులు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. కాస్తంత రహస్యంగా ఉండాల్సిన వ్యవహారాలను ఇలా బహిరంగపరచడం సరికాదు.
-బండి రామకృష్ణ, అత్తిలి
కాంగ్రెస్ విమర్శ సరికాదు
కేంద్ర మంత్రివర్గణ విస్తరణ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ క్లబ్ అంటూ కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారీ ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నందుకు అధికార పక్షాన్ని విమర్శించాలన్న దృష్టితో విమర్శించినట్లుంది. మోదీ ప్రభుత్వం కొత్తలో అద్వానీని నిర్లక్ష్యం చేశారంటూ మోదీకి పెద్దల్ని గౌరవించడం తెలీదని రాహుల్ విరుచుకుపడ్డాడు. ఇప్పుడేమే ఆ పార్టీ నేతలు మోదీ మంత్రివర్గాన్ని సీనియర్ సిటిజన్స్ క్లబ్ అని ఎద్దేవా చేశారు. ఆమాటకొస్తే సోనియా సీయనర్ సిటిజన్ కాదా? మరి ఆమె ఎందుకు పార్టీ అధ్యక్ష స్థానంలో ఉన్నట్లు?
-మరుదకాశి, కడప
పాఠం నేర్పిన ఎన్నికలు
రాజకీయ నేతలకు నంద్యాల, కాకినాడలలో జరిగిన ఎన్నికలు గుణపాఠం చెప్పాయి. అడ్డుఅదుపూ లేకుండా నోరు పారేసుకునేవాళ్లని ప్రజలు హర్షించరన్నది ఓటర్లు స్పష్టంగా తమ తీర్పుతో చెప్పారు. కేంద్రంలో రాహుల్‌గాంధి, దిగ్విజయ్‌సింగ్, రాహుల్ కూడా అరిచిఅరిచి నవ్వులపాలైనారు. డిగ్గీరాజా మూలకు నెట్టివేయబడ్డాడు. రాహుల్ విదేశీ పర్యటనలతో కాలక్షేపం చేయాల్సి వస్తోంది. రాజకీయ నాయకులకు ఉండాల్సిన లక్షణాలు ఆ నాయకులకు లేవు. మన రాష్ట్రంలో జగన్, రోజావంటివారిదీ అదే పరిస్థితి.
-సదా ప్రసాద్, గొడారిగుంట (తూ.గో)
లౌకికవాదం అంటే ఇదేనా?
వామపక్ష జర్నలిస్ట్ గౌరి లంకేశ్‌ని దుండగులు హతమార్చగా కేరళ ముఖ్యమంత్రి వెంటనే హంతకుణ్ణి పట్టుకుని దండించాలని ట్వీట్ చేశాడు. ఆయన రాష్ట్రంలోనే ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు హత్యకు గురి అవుతూంటే ఆయన కిమ్మనలేదు. గౌరి హత్యపట్ల లౌకికవాదులు గగ్గోలు మొదలుపెట్టారు. హత్య కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో జరిగిందికానీ అదే భాజాప పాలిత రాష్ట్రంలో అయితే మరింత రచ్చ చేసేవారు.
-శాంతిసమీర, వాకలపూడి