ఉత్తరాయణం

ప్రభుత్వమే నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా నిజాం సంస్థానాన్ని విలీనం చేయకుండా తన పరిథిలోని ప్రజలపై రజాకార్లతో దాడులు చేయించి అమానుషానికి పాల్పడ్డాడు. ప్రజల మానప్రాణాలకు ముప్పు ఏర్పడింది. ఎందరినో హతమార్చారు. పరమతసహనం చూపని నిజాం నికృష్ట పాలననుంచి ఎట్టకేలకు 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ విముక్తమైంది. ఇప్పుడు స్వరాష్ట్రంలో సొంత పాలన సాగుతున్న దశలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించడం సముచితం.
-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట
ఇంగ్లీషు మంచిదే కానీ...
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం చిన్న తరగతుల నుంచి ఇంగ్లీష్ బోధించే దిశగా చర్యలు తీసుకోవడం మంచిదే. అయితే బలవంతంగా ఇంగ్లీషు భాషను రుద్దడం సరికాదు. తెలుగును గౌరవిస్తూనే ఆంగ్లవిద్యా బోధన అవసరం. ఇంగ్లీషు మీడియం బడులవల్ల పేద విద్యార్థులకు మేలు జరుగుతుంది. పెద్దమొత్తంలో ఉండే ఫీజులు చెల్లించలేని వారికి ప్రభుత్వ ఇంగ్లీషు మీడియం పాఠశాలలే దిక్కు.
-శశిధర్, విశాఖపట్నం
పాత్రికేయులకు రక్షణ ఏదీ?
సమాజంలో అన్యాయాలను, అక్రమాలను నిలదీసే జర్నలిస్టులను పొట్టనపెట్టుకునే ప్రక్రియ అప్రతిహతంగా కొనసాగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధాకరం. ఈ ఏడాది ఇంతవరకు ఎనిమిది మంది పాత్రికేయులను దుండగులు పొట్టనపెట్టుకున్నారు. తమకు నచ్చని భావాలు వ్యక్తం చేస్తున్నారనో లేక తమ అక్రమాలు బయటపెడుతున్నారనో పాత్రికేయులపై దాడులకు పాల్పడుతున్నారు. బెంగళూరులో జర్నలిస్ట్ గౌరి హత్య అలాంటిదే. కర్నాటక, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో జర్నలిస్టులపై దాడులు పెరగడం బాధాకరం.
-ఎం.కనకదుర్గ, తెనాలి
రఘువీరా మాటలు నమ్మలేం
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు వాగ్దాన కర్ణుడిగా మారిపోయారు. అధికారంలో ఉండగా రాష్ట్ర విభజన చేసిన సోనియా ఇప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చేస్తారని రఘువీరా చెప్పడం హాస్యాస్పదం. కాపుల రిజర్వేషన్ల విషయంలో ఆయన వాదన సరికాదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు ఇస్తుందని చెప్పడం ఎవరిని నమ్మించడానికి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదెప్పుడో ఎవరు చెప్పగలరుకనుక. నంద్యాల ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కి వచ్చిన ఓట్లు 1400 లోపే. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో 17 డివిజన్లలో పోటీ చేసినా ఒక్కటీ గెలవలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్‌నుంచి వచ్చే హామీలను ఎలా నమ్మగలం.
-మైథిలి, సర్పవరం
విశాఖలో శాంతికి విఘాతం
ప్రశాంతంగా ఉండే విశాఖ నగరంలో శాంతిభద్రతలకు ఇటీవలి కాలంలో విఘాతం ఏర్పడుతోంది. నగరం అభివృద్ధి చెందుతున్న కొద్దీ నేరాల సంఖ్య పెరుగుతోంది. ప్రేమోన్మాదుల దాడులు, అపహరణలు, రౌడీల బెదిరింపులు ఇటీవలి కాలంలో ఇక్కడ ఎక్కువైనాయి. షీటీమ్స్ వల్ల మహిళల భద్రతకు భరోసా లభిస్తుంది. కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాట్లు, గస్తీ ముమ్మరం చేయడం వంటి చర్యలు ఇప్పుడు అవసరం.
-సి.ప్రతాప్, శ్రీకాకుళం