ఉత్తరాయణం

సింధు విజయం గర్వకారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరల్డ్ చాంపియన్ షిప్ ఫైనల్ పోటీలో ఓడించిన జపాన్ బ్యాండ్మింటన్ క్రీడాకారిణి నొజొమి ఒకుహరపై ప్రతీకారం తీర్చుకుని కొరియా సూపర్ సిరీస్‌ను కైవశం చేసుకున్న మన సింధు దేశానికి గర్వకారణంగా నిలిచింది. ప్రపంచ చాంపియన్ షిప్‌లో ఓటమితో కుంగిపోకుండా అదే ప్రత్యర్థిపై అద్భుతమైన పోరాట పటిమతో నెగ్గడం స్ఫూర్తిదాయకం. జాతీయ స్థాయిలో తొలిసారిగా కొరియా సూపర్ సిరీస్‌ను నెగ్గిన భారతీయ క్రీడాకారిణిగా ఆమె చరిత్ర సృష్టించడం విశేషం. బ్యాడ్మింటన్ మహిళా విభాగంలో అప్రతిహతంగా దూసుకుపోతున్న చైనా, జపాన్‌లకు దీటైన బదులిస్తున్న సింధు భారతీయ మహిళలకు దిక్సూచి.
-బి.మధుసూదన్ రెడ్డి, కర్నూలు
యువతకు పగ్గాలు ఇవ్వాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్ కమిషన్ ఏర్పాటుకు కసరత్తు చేయడం హర్షించదగ్గ విషయం. కమిషన్ నియామకంలో చైర్మన్ సహా సభ్యులుగా సమర్థవంతమైన దళిత సామాజిక వర్గానికి చెందిన విద్యావంతులైన యువతకు అవకాశం కల్పించాలి. సమాజంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉన్నత విద్య అభ్యసించిన యువత ఉద్యోగాలవైపు చూడకుండా సామాజిక సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వస్తున్నారు. అలాంటి సమర్ధులు, విద్యావంతులైనవారికి ఎస్‌సి కమిషన్‌లో అవకాశం ఇవ్వాలి. అప్పుడే నిజమైన దళితులకు మేలు జరుగుతుంది. వారి కష్టాలు ఏమిటో తెలుసుకుని పరిష్కరించే అవకాశం వారికి ఇచ్చినట్లు అవుతుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితుల సంక్షేమం కోసం ఎన్నో చర్యలు తీసుకున్న ప్రభుత్వం ఎస్‌సి కమిషన్ ఏర్పాటులోనూ రోల్‌మోడల్‌గా వ్యవహరించాలి.
-గుండమల్ల సతీష్‌కుమార్, సంస్థాన్ నారాయణపూర్
అడగని వరాలు ఎందుకు?
అడగనిదే అమ్మైనా పెట్టదని సామెత. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలు కోరకుండానే ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ వరాలు కురిపిస్తున్నారు. సమర్థ పాలన కోరుకునే ప్రజలు అది అందితే అందలం ఎక్కిస్తారని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్, నితీశ్‌కుమార్, మాణిక్ సర్కార్‌లు నిరూపించారు. ప్రజాకర్షక పథకాలు లేదా తాయిలాలు మనతో పోలిస్తే వారు పెద్దగా పట్టించుకున్నది లేదు. వైఎస్ సర్కారు ఎన్ని ప్రజాకర్షక పథకాలు తెచ్చినా అధికారం కోల్పోయినమాట గుర్తుంచుకోవాలి. ప్రజలను బద్ధకస్తులుగా సోమరులుగా తయారు చేసేవి, రాష్ట్ర ప్రభుత్వాన్ని రుణాల ఊబిలో కూరుకుపోయేలే చేసే పథకాలను అమలు చేయడంవల్ల ఉపయోగం లేదు. తాత్కాలిక లబ్ది తప్ప దీర్ఘకాలంలో ఇది చేటు చేస్తుంది. అవినీతి లేని సమర్థ పాలన, చక్కటి విద్య, నైపుణ్యాల మెరుగు, మేలైన వైద్యం పేదలకు అందుబాటులో ఉండేలా చూస్తే చంద్రబాబు ప్రభుత్వానికి శ్రీరామరక్ష. మనజేబు కొట్టి మనకు భోజనం పెట్టిన చందాన ప్రజాకర్షక పథకాలు అమలు చేస్తే ఆశించిన ప్రయోజనం దక్కుతుందనుకుంటే భ్రమే.
-తిరుమలశెట్టి సాంబశివరావు, నరసరావుపేట