ఉత్తరాయణం

తమిళ రాజకీయ నాటకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళనాడులో జయలలిత మరణం తరువాత మొదలైన రాజకీయ డ్రామా ఎడతెగని మలుపులతో రక్తికట్టిస్తూ సాగుతోంది. ప్రేక్షకులకు వినోదం, అక్కడ ప్రజలకు విషాదం కావాల్సినంత అందిస్తూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ బిగ్‌బాస్ తరహా రియాలిటీ షోలో ఓడిపోతున్నది మాత్రం పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే. మొదట మూడు గ్రూపులు, తర్వాత రెండు గ్రూపులుగా ఏర్పడ్డ దాయాదులకు నడుమ నిష్పక్షపాతంగా ఉండాల్సిన స్పీకర్ ఒక గ్రూపుని అనర్హులుగా మార్చేశారు ఒక్క కలం పోటుతో. వాళ్లేమైనా విప్ ఉల్లంఘించి, రాజ్యాంగం పదో షెడ్యూల్ ప్రకారం అనర్హులయ్యారా అంటే అదీ లేదు. వాళ్ల మనసులో అనుకున్నారట.. ఈ ముఖ్యమంత్రి మీద విశ్వాసం లేదని, అంతే న్యాయస్థానం ఏమంటుందో చూడాలి మరి. గతంలో కర్ణాటక విషయంలో సుప్రీంకోర్టు ఈ తరహా అనర్హతని ఒప్పుకోలేదు. పాపం, డిఎంకె, కాంగ్రెస్, కమల్‌హసన్ ఎంత మొత్తుకున్నా ఈ బిగ్ బాస్ షో స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తుంది. ఎవరెన్ని ఓట్సేనా, ఎవరెంత గోలపెట్టినా షో విన్నర్ ఎవరన్నది ముందుగానే డిసైడ్ అయిపోయినట్టుంది.
-డి.వి.జి.శంకర రావు, పార్వతీపురం
చేనేత కార్మికులను ఆదుకోండి
ఆంధ్రప్రదేశ్‌లో చేనేత కార్మికులు ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొంటున్నారు. ఎంతో నమ్మకంగా దాచుకున్న సొమ్మును అగ్రిగోల్డ్ ఫైనాన్స్ సంస్థ చెల్లించకపోవడం, వివాదాల్లో మునిగిపోవడంతో బాధతో మగ్గంపైనే ఓ చేనేత కార్మికుడు ప్రాణాలు వదిలాడు. గుంటూరు జిల్లా భట్టిప్రోలులో ఈ సంఘటన జరిగింది. ఈ స్థితికి కారకులు ఎవరు? ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి చేనేత కార్మికులకు చేతినిండా పనికల్పించే కార్యక్రమాలు చేపట్టాలి. దగాకోరు ఫైనాన్స్ సంస్థల ఆటకట్టించాలి.
-అడపా రామకృష్ణ, విశాఖపట్నం
నాణ్యత లేని చీరలు
తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు నాణ్యత లేకపోవడం వివాదంగా మారింది. ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఒక చీరకు 224 రూపాయలు ఖర్చుపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ పంపిణి చేసిన చీరలు వంద రూపాయల లోపు ఉంటాయన్నది విమర్శ. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఆదుకునేందుకు ఈ పథకం పెట్టారని చెప్పారు. కానీ వేరే రాష్ట్రాల నుంచి పాలిస్టర్ తరహా చీరలను తెప్పించారు. ఈ పథకం సక్రమంగా అమలు చేస్తే ఉభయతారకం.
-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట