ఉత్తరాయణం

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెట్టి కార్మికులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికైన ఎమ్మెల్యేలనుంచి రూ.100 స్టాంప్ పేపరుపై ఒక అఫిడ విట్ తీసుకోవాలని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఆదేశించడం విచిత్రం. ప్రతి ఎమ్మెల్యే తన అఫిడవిట్‌లో, తాను పార్టీ విప్‌ను ధిక్కరించబోనని, వేరే పార్టీలోకి ఫిరాయంచబోనని, కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు విధేయులపై ఉంటానని పేర్కొనాలని సోనియా శాసించిందట. ఇంతకంటె భయానకమైన విషయం మరోటుంటుందా? గల్ఫ్ దేశాల్లో, భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో మనం వెట్టి చాకిరి చేసేవారి గురించి వింటుంటాం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ తీసుకున్న నిర్ణయం ద్వారా పార్టీ ఎమ్మెల్యేలను వెట్టి చాకిరీ చేసే వారికంటె కడహీనంగా పరిగణించినట్లయంది. కాంగ్రెస్ కార్యకర్తలు, గాంధీని నిరంతరం పొగిడే భట్రాజుల్లా మారిపోయారంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటుండేవారు. ఇది తప్ప మరో నాణ్యతైన లక్షణం లేని వారు దేశాన్ని పాలించడానికి అనర్హులు.
-హనుమాన్ చౌదరి, సికిందరాబాద్

దిశానిర్దేశం లభించని యువత
ర్యాంకులు, పెర్సంటేజీల సాధనే ధ్యేయంగా సాగుతున్న మన విద్యావిధానం వలన యువతకు సరైన దిశానిర్దేశం లభించక నైతిక విలువలు, మానవతా సంబంధాలు, కుటుంబ విలువలు, ప్రేమానురాగాలు వంటి అత్యున్నత విలువలకు దూరవౌతున్నారు. తల్లిదండ్రులు కూడా జీవితంలో సనాతన, భారతీయ ఆచార వ్యవహారాలు, సత్సంప్రదాయాలను తాము పాటించక, తమ పిల్లలకు కూడా నేర్పడంలేదు. విదేశీ సంస్కృతిని అనుకరించమని తల్లిదండ్రులు, మీడియా ప్రోత్సాహం అందించడం మున్ముందు ఒక సామాజిక సమస్యగా రూపుదిద్దుకోనుంది. పిల్లలను తీర్చిదిద్దే బాధ్యత మొదటగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై వుంది. దైవంపట్ల భక్తి, దేశం పట్ల ప్రేమ, సమాజం పట్ల బాధ్యత, భారతీయ ఆచార వ్యవహారాలపై గౌరవం, నీతినియమాలు, ధర్మాచరణ, నైతికతను అనుసరించడం, సంపూర్ణ వ్యక్తిత్వవికాసం సాధించడం నేర్పించాలి.

- సి.ప్రతాప్, శ్రీకాకుళం
గుంటూరు ఆసుపత్రిలో అవినీతి
గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో (జి.జి. హెచ్)లో అవినీతి విలయతాండవం చేస్తోంది. టెస్టులకు కాంపౌండర్లు, టెక్నిషియన్లు అనధికారంగా భారీగా వసూలుచేస్తున్నారు. ఉచితంగా మందులు పంపిణీ చేసే కౌంటర్లలో గంటలతరబడి నిల్చున్నా మందులు లభ్యంకావడంలేదు. ఆపరేషన్ థియేటర్లు, వార్డులో బెడ్‌ల, మార్చురీలు, నర్సింగ్ సేవలు ఇలా ప్రతీ అంశంలో భారీగా లంచాలకు పాల్పడుతున్నారు. మహిళలకు ప్రసవం అయ్యాక వెయ్యి రూపాయలు చేతిలో పెట్టందే బిడ్డను చూపించడం లేదు. డబ్బు ఇచ్చుకోలేని పేదవారిని పశువులకంటే హీనంగా చూస్తున్నారు. ఆపరేషన్లుచేసి ఐసియునుండి తీసుకువచ్చి నేరుగా నేలపై పడుకోబెట్టేస్తున్నారు. ఇలాంటి ఆసుపత్రులలో వైద్యం చేయించుకునేకంటే ఇల్లు, ఒళ్లు తాకట్టుపెట్టి అయినాసరే బయట ప్రైవేట్ క్లీనిక్‌లలో చేరడమే ఉత్తమమన్న అభిప్రాయం గుంటూరు జిల్లా వాసులకు కలుగుతోంది. ఆసుపత్రిలో వివిధ విభాగాలలో సిసిటివి కెమెరాలు ఏర్పాటుచేసి నిఘా వ్యవస్థను మరింత కట్టుదిట్టంచేయాల్సిన అవసరం వుంది.
- ఎం.కనకదుర్గ, తెనాలి

నైట్ వాచ్‌మెన్‌లను నియమించాలి
చాలా ప్రభుత్వ పాఠశాలల్లో నైట్‌వాచ్‌మన్ పోస్టులు లేకపోవడంవల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పాఠశాలల్లో రికార్డులు, సర్వీసు పుస్తకాలు, కంప్యూటర్లు, తదితరమైన విలువైన సామగ్రి ఉంటాయి. వాటి రక్షణకు గ్యారంటీ లేదు. కొన్ని పాఠశాలల్లో అయితే సరైన కాంపౌండ్ వాల్ లేక కొంతమంది రాత్రివేళల్లో పాఠశాల ఆవరణలోకి ప్రవేశించి, దానినే పానశాలగా మారుస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వంవారు అన్ని పాఠశాలల్లోనూ నైట్‌వాచ్‌మన్ పోస్టులు సృష్టించి వాటిని తక్షణమే భర్తీచేయాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్

మరికొన్ని నోట్లు ముద్రించాలి
కేంద్ర ప్రభుత్వం వ్యాపారస్తులకు అనుకూలం కోసం రూ. 5వేలు మరియు రూ. 10వేల నోట్లు ముద్రించాలి. అట్లా ముద్రించటం వల్ల వ్యాపారస్తులకు మంచి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం 5వేలు మరియు 10వేల రూపాయల నోట్లు ముద్రించాలని మా కోరిక.
- ఎం.రాజు, తాడిపత్రి