ఉత్తరాయణం

భాషా పండితుల సమస్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దశాబ్దాలు గడుస్తున్నా భాషా పండితుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. హైస్కూళ్ళలో 6 నుండి 10 తరగతులు చెప్పడానికి తెలుగు, హిందీ మినహా అన్ని సబ్జెక్టులకూ స్కూల్ అసిస్టెంట్‌లను కేటాయించారు. కాని మాతృభాష తెలుగు జాతీయ భాష హిందీల వరకూ వచ్చేసరికి అవే 6 నుండి 10 తరగతులు బోధించడానికి స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్‌లుగా విభజించి రెండు పోస్టుల వారితో సమాన పనిని చేయిస్తున్నారు. మరి లాంగ్వేజ్ పండిట్లకు ఎస్జీటీలకంటె తక్కువ వేతనం ఇస్తూ 10వ తరగతి వరకూ బోధింపజేస్తున్నారు. భాషా పండితులలో వారికి సంబంధమున్న సబ్జెక్టులో మంచి విషయ నైపుణ్యం, భాషా నైపుణ్యం, వ్యాకరణ పరిజ్ఞానం ఉంది. భాషా పండితులలో కవులు, కళాకారులు ఎంతోమంది ఉన్నారు. కానీ వారి సబ్జెక్టుకు సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్‌కు వచ్చేసరికి ఎస్జీటీలుగా పనిచేస్తున్న సైన్సు, సోషల్ తదితర సబ్జెక్టుల వారికి కేవలం ఎం.ఎ. (తెలుగు/ హిందీ) చేసినంత మాత్రానికే తెలుగు లేదా హిందీ స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఇస్తే విద్యార్థులకు న్యాయం జరుగుతుందా? స్కూల్ అసిస్టెంట్ (్భషలు) ప్రమోషన్ ఇచ్చిన ప్రతిసారీ 90 శాతానికి పైనా సోషల్, సైన్స్ ప్రధానంగా బిఎడ్ చేసిన ఎస్జీటీలే ఎక్కువగా ప్రమోషన్ తీసుకుంటున్నారు. భాషా పండితులు మాత్రం రెండు లేదా మూడు దశాబ్దాలకు పైగా పదోన్నతి లేక ఒకే కేడర్‌లో పనిచేస్తున్నారు. హైస్కూల్‌లలో భాషా పండిట్ పోస్టులను రద్దుచేసి భాషా పండితులకు ఎస్.ఎలుగా పదోన్నతి ఇవ్వాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్

ఎవరికీ ఆదర్శం కాని వ్యక్తి
ప్రొఫెసర్ కోదండరామ్, దశాబ్దానికి పైగా అకాడమిక్ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. విద్యాయేతర కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారు. విద్యార్ధులను ఉద్యమాల బాట పట్టించారు. విదేశీ భావజాలం కలిగిన పార్టీలతో సంబంధాలు కలిగివున్నారనుకోవాల్సి వస్తున్నది. సదరు పార్టీలు ఉద్యమాలకు, ప్రచారాలకు పరిమితమై తమ వర్గం వారిని యూనివర్సిటీల్లోకి చొప్పిస్తున్నాయ. ప్రత్యేక తెలంగాణ సాధనకోసం జరిపిన ఉద్యమంలో భాగంగా ఏర్పడిన జాయంట్ యాక్షన్ కమిటీ (జెఎసి)లో చురుగ్గా పాల్గొన్నారు. మరి తెలంగాణ ఏర్పడి రెండేళ్లు ముగిసిపోయంది. అయనప్పటికీ ఇంకా ఆయన జెఎసి కన్వీనర్‌గా కొనసాగుతూనే ఉన్నారు. ఆయన ఉస్మాని యా యూనివర్సిటీలో తన విధులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే కాకుండా పూర్తిగా ఉద్యమ కార్య కలాపాల్లో పాల్గొన్నారు. చూస్తుంటే ఆయనకు ఇదొక అలవాటుగా మారిందిలా ఉంది. ప్రస్తుతం ఆయన్ను కమ్యూనిస్టు పార్టీలు తప్ప మిగిలిన రాజకీయ పార్టీలు తిరస్కరిసు తన్నాయ. మరి లెఫ్ట్ పార్టీలకు ప్రజల్లో పలుకుబడి లేదు. విశ్వవిద్యాలయంలో విధులు నిర్వర్తించకుండా, జీతం తీసుకుంటున్న ఆయన దేశంలో ఏ విద్యార్థికి లేదా ఏ వ్యక్తికి ఆదర్శం కాబోరు.
- డాక్టర్ టి. హనుమాన్ చౌదరి, సికింద్రాబాద్

కుక్కలను నిర్మూలించండి
రాష్ట్రంలో వందల కిలోల బరువుగల దిమ్మలతో ఎడ్లుతో లాగిస్తున్నారు. వీటికి పందేలు నిర్వహించి ప్రసా ర సాధనాల ద్వారా విపరీతమైన ప్రచారం చేయబడుతోంది. సంక్రాంతి పండుగ వేళల్లో ఇంట్లో పెంచుకునేన కోళ్ళతో పందేలు జరుపుకుంటే పోలీసుస్టేషన్లో ఊచలు లెట్టపెట్టిస్తున్నారు. వేల, లక్షల కోళ్ళు, మేకలను రోజూ మాంసం విక్రయించే వారిపై ఎటువంటి చర్యలు లేవు.రోజూ వందలాది మంది మనుషులను కాట్లువేసి ఆసుపత్రి పాల్చేస్తున్న కుక్కలను నియంత్రించేందుకు ఎటువంటి చర్యలు లేవు. కుక్కలు చేస్తున్నఆగడాలపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కోడై కూస్తున్నా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. పుట్టిన బిడ్డలను ఆసుపత్రిలోనే నోట కరచి పెట్టి బయటకు తెచ్చి చంపుకు తింటున్న సంఘటనలు జరుగుతున్నా పాలకులకు చీమకుట్టినట్లైనా లేదు. కావున కుక్కలను సంహరించేందుకు ఉత్తర్వులివ్వవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
- యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం

రెండేళ్ళ పాలన
అవినీతి తనకు అంటకుండా మన్మోహన్‌సింగ్ మాదిరిగా పవిత్రంగా రెండేళ్ళ పాలనా సమయాన్ని సమర్ధవంతంగా నిర్వహించారు ప్రధాని మోది. అనేక దేశాలు పర్యటించి భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపజేసారు. వీరి మంత్రివర్గ సభ్యులు మీద కూడా ఏ అవినీతి ఆరోపణలు లేకపోవడం మంచి పరిణామం. మిగిలిన పదవీ కాలంలో కాశ్మీర్ సరిహద్దు సమస్యను పరిష్కరించి, ఆర్టికల్ 370 ను రద్దు చేయగలరని ఆశిద్దాం.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్