ఉత్తరాయణం

సినిమాల్లో పెరుగుతున్న అశ్లీలత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి సినిమాల్లో అర్ధనగ్న నటనలకు, అశ్లీలతలకు పీఠం వేసుకుని ఉంటున్నాయి. నగర, పుర ప్రాంతాల్లో అర్ధనగ్న నృత్యాలకు, రేవు పార్టీలకు కొదవే లేదు. కానీ పల్లెల్లో గానీ, పట్టణాల్లోగానీ ఏదైనా పండుగ జరిగిందంటే సినిమాలననుకరించి డ్యాన్సులు, అర్ధనగ్న నృత్యాలు వేసే వెర్రిమొర్రి వేషాలు చూసిన వెంటనే పోలీసులు వారిపై చర్యలు తీసుకొంటున్నారు. నేటి సమాజం వెర్రితలలు వేయడానికి ముఖ్య కారణం సినిమా ప్రభావమే. ఒక సినిమా నటి బికినీతో రెచ్చిపోతూ వుంటే పట్టని ప్రభుత్వం, సెన్సార్ బోర్డు, ఏదైనా పండుగల్లో కేవలం పండుగల్లో భాగంగా ఆనందించే వారిపై చర్యలు తీసుకోవడం హేయం. ఒక దర్శక మహానుభావుడు ఏకంగా సెన్సార్ బోర్డు వద్దన్నాడు. మహిళా సంఘాలకు అశ్లీల సినిమాలు పట్టవు. కుటుంబ సమేతంగా చూసే సినిమాలు రావడం లేదు. ఇవేం పట్టనట్టు ఉండి ప్రభుత్వం, రక్షక భటులు కేవలం పండుగల మీద చర్యలు తీసుకోవడమేనా లేక సినిమాల్లో అశ్లీలతపై, రేవు పార్టీలు, క్లబ్బులపై కూడా కొరడా ఝుళిపిస్తారా.. దీనిపై ప్రభుత్వం స్పందిస్తే ఉచితంగా ఉంటుంది.
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్నం

ఎక్కువమందికి అవకాశం ఇవ్వాలి
ఐ.పి.ఎల్. క్రికెట్ టోర్నీ మొత్తం గమనిస్తే ఎంతోమంది నూతన భారత ప్రతిభావంతులైన క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ, ఫీల్డింగ్‌లోనూ తమ ప్రతిభ చాటుకున్నారు. ఇక రాబోయే అంతర్జాతీయ పోటీలకు భారత జట్టును ఎంపిక చేసేటప్పుడు వీలైనంత ఎక్కువ ప్రతిభావంతులకు అవకాశం యివ్వాలి. విదేశీ పర్యటనల్లో భాగంగా పెద్దపెద్ద జట్లతో ఆడాల్సి వచ్చినప్పుడు అనుభవంగల సీనియర్లకు అవకాశం ఇవ్వాలి. బలహీన టీమ్‌లతో ఆడడాల్సి వచ్చినప్పుడు సీనియర్లకు విశ్రాంతినిచ్చి ప్రతిభావంతులైన జూనియర్లకు అవకాశం యివ్వాలి. అలాగే స్వదేశంలో జరిగే మ్యాచ్‌ల్లో ఆడే ప్రాంతాన్నిబట్టి అక్కడి స్థానికులైన ప్రతిభావంతులకు అవకాశం ఇవ్వాలి. సిరీస్ గెలిచాక ప్రాధాన్యత లేని ఇతర మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చినప్పుడు రిజర్వు ఆటగాళ్లందరికీ అవకాశం ఇవ్వాలి. ఇలా చేయడంవల్ల ఎక్కువమంది ఆటగాళ్ళకు అవకాశం వస్తుంది.
- ఎస్. శ్రీనివాసరాజు, వనస్థలిపురం

పదవీ విరమణ వయస్సును పెంచాలి
రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు పదవీ విరమణ వయస్సును 58 నుండి 60 ఏళ్ళకు పెంచాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సానుకూలంగా ఉన్నట్లు లేదు. అందరికీ కాకున్నా తక్కువ సర్వీస్ అనగా 25 ఏళ్ళు అంతకు తక్కువ సంవత్సరాలు ఉద్యోగంలో ఉన్న వారికి రెండేళ్ళు వయో పరిమితి పెంచితే ఉత్తమం. చిన్న వయసులో ఉద్యోగంలో చేరిన వారు 58 ఏళ్ళ నాటికి అన్ని బాధ్యతలు పూర్తిచేసుకొని ఉంటారు. కానీ 30 నుండి 35 సం.ల మధ్య వయసులో ఉద్యోగం సంపాదించిన వారు కుటుంబ బాధ్యతల నిర్వహణలో సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారు ఉద్యోగ విరమణ వయోపరిమితి 60 సంవత్సరాలుగా ఉండాలని కోరకోవటంలో అసమంజసమేమీ లేదు. ఉద్యోగ సంఘాల నాయకులు తక్షణమే ముఖ్యమంత్రిగారిని కలిసి దీని విషయమై చర్చించాలి. ఉద్యోగులందరికీ కాకున్నా కనీసం ఆలస్యంగా ఉద్యోగాలు పొందిన వారికోసమైనా పదవీ విరమణను 60 ఏళ్ళకు పెంచాలి. ఈ ప్రత్యామ్నాయ విధానంవల్ల కొందరికైనా న్యాయం జరుగును. నిరుద్యోగుల కోణంలో కూడా దీనిపై వ్యతిరేకత ఉండకపోవచ్చు.
- గోదూరు అశోక్, కరీంనగర్

కరవు భత్యం విడుదల చేయాలి
దేశానికైనా రాష్ట్రానికైనా కుటుంబానికైనా ఆర్థిక స్థితిగతులు సమతుల్యానికి మెరుగుదలకు ప్రణాళిక, బడ్జెట్ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకోవడమేగాక అత్యంత ఆవశ్యకం అనేది జగమెరిగిన సత్యం. కానీ, విశ్రాంత ఉద్యోగుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరువు భృతులను సకాలంలో విడుదల చేయకపోవడం దారు ణం. కావున ఆం.ప్ర. ముఖ్యమంత్రి వి శ్రాంతి ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని, గత సంవత్సరం జులై నుం డి, ఈ సంవత్సరం జనవరి నుండి రావలసిన కరువు భృతులను వెంటనే విడుదల చేయవలసిందిగా అర్ధిస్తున్నాం
- ఆశం సుధాకరరావు, గూడలి

అధ్వాన్న ‘ప్యారిస్’
ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన తెనాలి ఇప్పుడు ఇరుకు రోడ్డులు, మురుగునీటి సమస్యలు, ట్రాఫిక్ పాటించని జనాభా, బ్రిడ్జిలు కూలిపోతున్నా పట్టించుకోని అధికార యంత్రాంగం, రోడ్డుమీదే ఎండు చేపలు అమ్ముతున్నా పట్టించుకోని పోలీసులు లాంటి సమస్యలతో ఆంధ్ర ప్యారిస్ నేడు అధ్వాన్న ప్యారిస్‌గా మారింది.
- శ్రీనివాసరెడ్డి, తెనాలి