ఉత్తరాయణం

నవ్యాంధ్రకు ఇబ్బందులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి రాజకీయ నాయకుల మాటలు కోటలు దాటుతుంటే చేతులు పీటలైనా ఎక్కడంలేదని సామెత. మన రాష్ట్రంలో పారిశ్రామిక పురోగతిని చూస్తే అదే గుర్తుకు వస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి పరిస్థితి వేరు. ప్రస్తుతం కొత్త నవ్యాంధ్ర ఎదుర్కొంటున్న సమస్యలు వేరు. రాష్ట్ర విభజన అనంతరం గత రెండు సంవత్సరాలుగా సర్కార్ చేస్తున్న ప్రకటనలను చూస్తే పరుగులు పెట్టవలసిన పురోగతి ఎంత నత్తనడకన నడుస్తున్నది అర్ధమవుతున్నది. హైదరాబాద్ రాజధానిగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రానికి పరిశ్రమల కొరత ఉండేది కాదు. ఎన్నో జాతీయ అంతర్జాతీయ పరిశ్రమలు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో అభివృద్ధి చెందడంతో ఆదా యం బాగా వచ్చేది. కానీ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత ఆ భారీ పరిశ్రమలన్నీ తెలంగాణా ప్రాంతానికే చెందటంతో ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పుడు ఆ కొరత అధికంగా ఏర్పడింది. ఆ కొరత అధిగమించాలంటే ఓనమాల నుంచి అక్షరాలు దిద్దక తప్పదు.
- వులాపు బాలకేశవులు, గిద్దలూరు

ప్రతిపక్షాలు ఉద్యమించాలి
ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైంది. కెసిఆర్ ఒంటెద్దు పోకడలను ఎదుర్కొనేందుకు తద్వారా ప్రజల మన్ననలను చూరగొలుగుతారు. గతంలో లాగా కమ్యూనిస్టులు ఉద్యమించక పోవటం వల్ల ఉద్యమాలు సక్రమంగా నిర్వహించకపోవటంవల్ల ప్రజాస్వామ్యాన్ని చూరగొనలేకపోతున్నారు. అందువల్ల అన్ని ఎలక్షన్లు అయిపోయాయి. ఇప్పుడు పన్నులను పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తుంది. ఇంటి పన్ను, విద్యుత్, ఆర్.టి.సి, ఇతరత్రా వాటిపై చూస్తోంది. దీనికి ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ పార్టీ సైతం నూతన నాయకత్వాన్ని ఏర్పరచుకొని యువ నాయకత్వంలో ముందుకు సాగాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇదే సరైన సమయం.
- అయినం రఘురామారావు, ఖమ్మం

గ్రంథాలయాలు విస్తరించాలి
మంచి పుస్తకాన్ని మించిన మిత్రుడు ఉండడు. అటువంటి మంచి కథా, విజ్ఞాన, ఆరోగ్య తదితర పుస్తకాలు ఉండేచోటు, దిన, వార, మాస పత్రికలు క్రమం తప్పకుండా వచ్చే చోటు గ్రంథాలయం. అలాంటి గ్రంథాలయాలు పట్టణ, మండల కేంద్రాలకే పరిమితం అయ్యాయి. నేడు మారుమూల పల్లెటూరి ప్రజలు కూడా అక్షరాస్యతలో ముందుంటున్నారు. ప్రతి పల్లెటూరిలోను గ్రంథాలయాన్ని స్థాపిస్తే ఎంతో బాగుంటుంది కదా! ఎంతోమందికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎంతోమందికి ఉపాధి లభిస్తుంది.
- ఎస్. శ్రీనివాసరాజు, హైదరాబాద్

ఉమ్మడి పరీక్ష సబబే
ఆంధ్రప్రదేశ్‌లో విశ్వవిద్యాలయాల అసిస్టెంటు ప్రొఫెసర్ల నియామకానికి ఉమ్మడి రాతపరీక్షను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం సముచితంగా ఉంది. ఇప్పటివరకు అసిస్టెంటు ప్రొఫెసర్ల నియామకాలు విశ్వవిద్యాలయ స్థాయిలో నిర్వహించారు. ఈ పోస్టుల భర్తీలో ఎన్నో అక్రమాలు, ఆశ్రీత పక్షపాతం, బంధుప్రీతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కొందరు ఉపకులపతులు, రిజిష్ట్రార్లు, విభాగాధిపతులు చక్రం తిప్పి తమ అభ్యర్థులనే నియమించుకునేవారు. ఈ అన్యాయాలను చెక్ పెట్టే దిశలో ఉమ్మడి పరీక్ష విధానాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం ముందుకు పోవడం స్వాగత పరిణామం. రాష్ట్రంలోని 14 విశ్వవిద్యాలయాల్లో మొత్తం 1385 పోస్టులను భర్తీచేయాల్సి ఉంది. ఇందులో అసిస్టెంటు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లతోపాటు ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వం ఈమేరకు నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలి.
- వాండ్రంగి కొండలరావు, పొందూరు

స్మార్ట్ సిటీగా నిజామాబాద్
వరంగల్‌కు అతి సమీపంలోనే కరీంనగర్ కాదు స్మార్ట్ సిటీ కరీంనగర్‌కు చేరువలోనే హైదరాబాద్, సికిందరాబాద్, వరంగల్ అనే సిటీలున్నందున ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని అభివృద్ధికి ఆవల ఆమడ దూరంలోనున్న ఆదిలాబాద్ లేదా నిజామాబాద్‌లను స్మార్ట్ సిటీలుగా ప్రకటించాలి.
- జి.వి.రమణ, వరంగల్