ఉత్తరాయణం

బాన్స్‌వాడ జిల్లా చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రజలకోసమో, రాజకీయ ప్రయోజనాలకోసమో అర్థం కావడంలేదు. ఎందుకంటే అవసరం ఉన్నా లేకున్నా, కాస్త కంటికి నదరుగా కనిపి స్తున్న ప్రతి పట్టణాన్ని జిల్లా చేయాలని ప్రయత్నించడమే ఇందుకు నిరద్శనం. నిజానకి పది జిల్లాల్లో కొత్త జిల్లాలు విభజన అయదారు అదనపు జిల్లాలుగా పెంచితే సరిపోతుంది. జిల్లాలు విభజన అనేది పరిపాలనా సౌల భ్యం కోసమే తప్ప మరో ప్రయోజనాన్ని ప్రతిఫలిం చకూడదు. ఉదాహరణకు ప్రస్తుతం ఉన్న జిల్లా కేంద్రం సుదూరంగా ఉన్నా, జనాభా అధికంగా ఉన్నా అధికా రులకు పనిభారం తగ్గచేందుకు కూడా కొత్త జిల్లాగా విభజించవచ్చు. అంతేకాని అక్కర ఉన్నా లేకున్నా ప్రతి జిల్లాను రెండుగా చీల్చడం అనవసర ప్రక్రియే తప్ప ఒరిగిందేమీ ఉండదు. ఇంకా వివరంగా చెప్పుకోవాలటే నిజామాబాద్‌లో కామారెడ్డి జిల్లా ఏర్పాటు, కరీంనగర్‌లో సిరిసిల్ల ఏర్పాటు శుద్ధ దండగ. ఎందుకంటె కామారెడ్డి జిల్లా కేంద్రానికి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. అంతగా నిజామాబాద్ జిల్లాను విడ దీయాలనుకుంటే, బాన్స్‌వాడ జిల్లాను ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల ప్రాంతాలైన జుక్కల్, పిట్లం, ఎల్లారెడ్డి, నిజాంసాగర్ వాసులకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ దిశగా స్థానిక శాసనసభ్యుడు, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్ ప్రత్యేక శ్రద్ధ వహించి బాన్స్ వాడ జిల్లా ఏర్పాటు చేస్తే ఉభయతారకంగా ఉంటుంది.
-కె. గంగాధర్, బాన్స్‌వాడ

మద్యాన్ని అరికట్టాలి
తెలుగు రాష్ట్రాలలో గత రెండు సంవత్సరాలలో అధిక నేరాలు మద్యం మత్తులో జరిగాయన్న జాతీయ నేర గణాంకాల బ్యూరలో నివేదిక రెండు ప్రభుత్వాలకు కనువిప్పు తేవాలి. నేరాల సంఖ్యలో యు.పి, బీహార్ తర్వాత తెలుగు రాష్ట్రాలు స్థానం సంపాదించుకోవడం తెలుగుజాతికి తీరని అప్రదిష్ట. మహిళలపై అత్యాచారాల విషయంలో తెలుగు రాష్ట్రాలు ప్రథమస్థానాన్ని అలంకరించాయి. నేరస్థులకు చట్టాల పట్ల భయం లేకపోవడం, రాజకీయ జోక్యం, దర్యాప్తు సంస్థల నిర్లక్ష్యం కారణంగా సకాలంలో శిక్షలు పడకపోవడం నేరాల సంఖ్య పెరగడానికి ముఖ్య కారణాలు. మద్యం దుకాణాలు విశృంఖలంగా పెరిగిపోయి గడపగడపకు తేలికగా మద్యం సరఫరా చేసే దుస్థితి మన తెలుగు రాష్ట్రాలలో నెలకొనడం దురదృష్టకరం. వీటి సమయపాలనలో కూడా అడ్డూ ఆపూ లేకుండా పోతోంది. మద్యాన్ని ఆదాయ వనరులుగా చూసే ప్రభుత్వాల వైఖరి తక్షణం మారాలి!
- సి.ప్రతాప్, శ్రీకాకుళం

రామగుండాన్ని మరచారెందుకు?
కరీంనగర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న జగిత్యాలను 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిరిసిల్లను జిల్లాలుగా చేస్తామంటున్నారు. జగిత్యాల, మంచిర్యాల, సిద్దిపేట జిల్లాలుగా చేయాలన్న ప్రతిపాదన బహుకాలం నుంచి ఉన్నదే కాని సిరిసిల్లను జిల్లాగా చేయడమన్నది తాజా ప్రతిపాదన. అయతే అందుకు సంతోషమే. కాని దగ్గరి దగ్గరే జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలను ఏర్పాటు చేస్తామంటున్నారే తప్ప, అన్ని హంగులు ఉన్న పారిశ్రా మిక వాడ ప్రాంతమైన రామగుండాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది. ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలించాలి.
- కూర్మాచలం వెంకటేశ్వర్లు, కరీంనగర్

మొక్కల పెంపకంపై అశ్రద్ధ
పాఠశాలలకు మొక్కల పంపిణీ తరచూ జరుగుతుంటుంది. అయితే ఎన్ని పాఠశాలలు వాటిని శ్రద్ధగా పెంచుతున్నారనేది ప్రశ్న. కొన్ని పాఠశాలల్లో మూణ్ణాళ్ళ ముచ్చట అవుతున్నది. కొన్ని పాఠశాలల వారు వాటిని శ్రద్ధగా పెంచుతున్నారు. బాధ్యతా లోపమో లేక బయటి వ్యక్తుల దుర్మార్గమో మొక్కల పెంపకం అనేది జరగడం లేదు. ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకంపై శ్రద్ధ వహించడం అవసరం. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఈ దఫా అన్ని పాఠశాలలకు, ప్రభుత్వ కార్యాలయాలకు మొక్కల పంపిణీ చేయాలి. తప్పనిసరిగా వాటి పర్యవేక్షణ, పెంపకం బాధ్యతలు వారికి అప్పజెప్పాలి.

- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్
వలసలకు ప్రోత్సాహం
రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు తమ కొడుకులను వారసులను ప్రమోట్ చేయడంకోసం గ్రామస్థాయి నుండి పై స్థాయి వరకు (ఎం.ఎల్.ఏ., ఎం.ఎల్.సి, జిల్లా పరిషత్) నాయకులను వారి వారి పార్టీలలోకి తాయిలాల ఎర చూపో, నయానో భయానో తమవైపు తిప్పుకుంటున్నారు. భవిష్యత్తులో బంధువులవల్ల వారి వారసులకు ఆటంకం రాకుండా ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలో చేర్చుకుని జాగ్రత్త వహిస్తున్నారు. వారికి అనుకూలమైన పదవులు, కాంట్రాక్టుల వంటివి అప్పగిస్తున్నారు. అంతేకాని అభివృద్ధి చూసి వలసలు వస్తున్నారన్నది వట్టిమాట.
- అయినం రఘురామారావుగౌడ్, ఖమ్మం