ఉత్తరాయణం

కుటిల రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర విభజన తర్వాత అండగా నేను వున్నాను, అధైర్య పడకండి! తల్లిని చంపి బిడ్డను బ్రతికించారు. తల్లిని నేను తిరిగి బ్రతికిస్తాను! అంటూ భారీ సెంటిమెంట్ డైలాగులు చెప్పిన ప్రధాని నరేంద్రమోదీ అధికారం చేపట్టాక రాష్ట్ర ప్రజల సెంటిమెంట్లతో ఆడుకుంటున్నారు. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ అవసరం లేదు కనుక కాన్పు తర్వాత తల్లిని రోడ్డుపై పడేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతకంతకూ ప్రమాదకరంగా తయారౌతోంది. సొంత ఆదాయ వనరులు అంతంత మాత్రం కావడంతో ఆర్థిక అవసరాలకోసం బహిరంగ మార్కెట్ ఋణాలపై ఆధారపడవల్సి వస్తోంది. ఈ ఏడాది రూ.24 కోట్లకు పైగా ఋణం తీసుకోనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత ఈ ఋణభారం పన్నుల రూపంలో పడేది రాష్ట్ర ప్రజలపైనే! సినిమా డైలాగులు చెప్పి తర్వాత రాష్ట్రాన్ని అనాధ శవంగా రోడ్డుకీడ్చేసిన కుటిల రాజకీయం వల్లనే రాష్ట్రానికి ఈ పరిస్థితి దాపురించింది. ఆర్థిక లోటు వున్న ఇతర రాష్ట్రాలకు ఋణ మినహాయింపు ఇచ్చిన కేంద్రం మన రాష్ట్రానికి మినహాయింపు ఎందుకు ఇవ్వలేదు?
- ఎం.కనకదుర్గ, తెనాలి

ఆడంబరాలకు తరుణం కాదు
ముఖ్యమంత్రి కల్వకుంట్ల వారు హైదరాబాద్‌లో తక్షణ అవసరాలైన పనులకు డబ్బు కేటాయించి సత్వరం పనులు ప్రారంభింపచేసి నగరాన్ని పునరుద్ధరించాలి. పట్టణంలోని మురుగునీరు, వర్షపునీరు సాఫీగా ప్రవహించేటట్లు డ్రైనేజి వ్యవస్థను ఆధునీకరించి అభివృద్ధిచేయాలి. చెత్తకుప్పలు రోడ్లమీద లేకుండా వెంట వెంటనే ఎత్తి శుభ్రంగా ఉంచాలి. మూసీనదిలో మురుగునీరు కలువకుండా తగిన చర్యలు చేపట్టాలి. మూసీనదిలోని ప్రైవేటు, ప్రభుత్వ అక్రమ కట్టడాలను తొలగించాలి. హుస్సేన్‌సాగర్ మొదలైన జలాశయాలు కలుషితం కాకుండా కాపాడాలి. కాలం తీరిన ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు రోడ్లపై తిరుగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. పట్టణ వైశాల్యం, జనాభాననుసరించి స్ర్తిపురుషులకు మూత్రశాలలు, మరుగుదొడ్లు ఆధునిక పద్ధతిలో నిర్మించి పరిశుభ్రంగా ఉంచేవిధంగా చూడాలి. మహానగర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనేక వేల ఎకరాల భూమి ప్రైవేటు, ప్రభుత్వం వారిది ఉన్నది. అట్టి భూమిలో అవసరమున్న భవనాలను రెండు మూడు అంతస్తులవి నిర్మించాలి. ఆకాశహర్మ్యాలను నిర్మించడం 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని నిర్మించడం ఉపసంహరించుకోవాలి. ప్రభుత్వ (ప్రజల) డబ్బును విచ్చలవిడిగా ఖర్చుచేసి ఆడంబరాలు చేయాల్సిన తరుణం కాదు.
- బి.సత్యప్రకాశ్, సూర్యాపేట

తనదైన ముద్ర వేసిన ప్రధాని
33 వేల కిలోమీటర్లు, నలభై గంటలపాటు విమానప్రయాణం చేసి ఐదు రోజుల్లో మూడు ఖండాలలో అయిదు దేశాలలో పర్యటించి దేశ ప్రతిష్టను దిగంతాలకు వ్యాపింపజేసిన భారత ప్రధాని నరేంద్రమోదీ విదేశీ వ్యవహారాలలో స్వాతంత్రం తర్వాత తనదైన ముద్ర వేసుకున్న ప్రధానిగా నిలిచారు. ఆప్ఘన్‌తో స్నేహ సంబంధాలను పునరుద్ధరించి, స్విట్జర్లాండ్, మెక్సికో దేశాలతో ఐక్యరాజ్యసమితిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం కోసం మద్దతు సాధించి, అమెరికాతో వాణిజ్య సంబంధాలు పటిష్టపరచి, దాదాపుగా అయిదువేల కోట్ల విదేశీ పెట్టుబడులకు హామీ పొంది దిగ్విజయంగా తిరిగి వచ్చిన మోదీ నాయకత్వానికి జోహార్లు. అమెరికన్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి చేసిన ప్రసంగం ఆ దేశపు చట్ట సభల సభ్యులనేకాక ఆ ప్రసంగాన్ని వీక్షించిన వారందరిని మంత్రముగ్ధుల్ని చేసింది. ఇరు దేశాల దీర్ఘకాలిక బంధవ్యానికి పునాదులు గట్టి పడ్డాయి.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం