ఉత్తరాయణం

పెట్టుబడులకోసం టూర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ నుండి విడిపోయిన తర్వాత ఆదాయం లేక నవ్యాంధ్ర రాష్ట్రం సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం పెట్టుబడులకోసమంటూ విదేశాల్లో పర్యటించడం ఒకింత ఆశ్చర్యకరమే. ఆయన సింగపూర్ అనేకసార్లు సందర్శించారు. ఇక అమెరికా, జపాన్, చైనా, ఇగ్లాండ్, స్విట్జర్లాండ్ ఇక ఇప్పుడు కజకిస్థాన్ పర్యటన. కజకిస్థాన్ దేశ జనాభా మొత్తం కోటి డెబ్బయ్యేడు లక్షలు మాత్రమే. అంటే ఆంధ్రప్రదేశ్‌లో మూడోవంతు కంటె కొంచెం ఎక్కువ పరిమాణం. మరి అంత చిన్నదేశంలో, ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా అభివృద్ధి చేయగల స్థాయిలో అంటే అంతటి పెద్ద సంఖ్యలో పరిశ్రమలున్నాయా? దీనికంటె అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఐటి రంగంలో పెట్టుబడులు పెట్టిన తెలుగువారిలో స్ఫూర్తి నింపవచ్చుకదా? నిజానికి చైనా నాయకులు నింపిన దేశభక్తి స్ఫూర్తితో ఆ దేశ ప్రజలు కష్టించి నేడు ఈ స్థాయికి అభివృద్ధి చేశారన్న సంగతి గుర్తుంచుకోవాలి.
-డాక్టర్ హనుమాన్ చౌదరి, సికిందరాబాద్

శుభస్య శీఘ్రం
ఆంధ్ర ప్రభుత్వం ఇంత తొందరగా రాజధాని నిర్మాణానికి సిబ్బంది తరలింపునకు సిద్ధపడటాన్ని విమర్శిస్తున్నారు. పదేళ్ల గడువుంది కదా అంటున్నారు. తెలంగాణ న్యాయాధికార్లు ఇప్పటికప్పుడు హైకోర్టు విభజించాలంటూ చేస్తున్న ఆందోళనను గమనిస్తున్నారు కదా. సస్పెన్షన్లు, మూకుమ్మడి సెలవులు-ఆంధ్రుల పట్ల ద్వేషం చూపుతున్నారు కదా. వ్యాపారులు కూడా ఆంధ్ర నుంచి పాలు, పళ్లు, కొబ్బరి బోండాలు నిషేధించి ఖరీదు ఎక్కువైనా బెంగళూరునుంచి తెప్పించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పదేళ్ల గడువు అంటూ చూరు పట్టుకొని వేలాడటం విజ్ఞతా? శుభస్య శీఘ్రం అనిపించడం లేదా?
- శుభ, కాకినాడ

తొందరపాటు నిర్ణయాలు తగదు
మన ప్రభుత్వాల తొందరపాటు నిర్ణయాల వల్ల ప్రజలు విపరీతంగా ఇబ్బందులు పడుతున్నారు. రైతుల రుణమాఫీకి సంబంధించి రెండవ విడత పత్రాలు ఇచ్చామని చెబుతున్నారు. కాని గ్రామంలో 500 మంది వుంటే వంద, రెండువందల మందికి మాత్రమే వచ్చాయి. మిగిలినవారు అయోమయంలో పడ్డారు. వచ్చిన రైతులు బ్యాంకులకు డబ్బు తీసుకొనడానికి వెళితే ఇంకా డబ్బు జమకాలేదని చెబుతున్నారు. మంత్రివర్యులేమో మూడువేల కోట్లు పైబడి రుణాలకింద బ్యాంకుల్లో జమ చేశామని చెబుతున్నారు. ఉత్తిత్తి హామీలు, ఇవ్వడం వల్ల ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉంటుందేమో కాని, ప్రజల పాట్లు వర్ణనాతీతం. ఇకనైనా హమీలు, గడువులు ఇచ్చేటప్పుడు కార్యక్రమాలన్నీ పూర్తి అయినట్టు నిరూపణ చేసికొని ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది. కచ్చితంగా తేదీ ప్రకటించి ఆదే రోజు నిర్ణయాలు అమలు చేయాలి. అనవసరంగా ప్రజలను ఇక్కట్లపాలు చేయవద్దు.
-ఈశ్వర్, ప్రొద్దుటూరు, కడపజిల్లా

ఫోటోలపై ప్రాంతాలు ముద్రించండి
జంటనగరాల్లో వానవల్ల సంభవించిన బీభత్స దృశ్యాలను, పౌరుల కడగండ్లను చూపే ఛాయా చిత్రాలను వేస్తున్నారు. సదరు ఫోటోలలలోని దృశ్యాలు ఏ ప్రాంతానికి సంబంధించినవో కూడా పేర్కొంటే బాగుంటుంది. ఆయా ప్రాంతాలవారికి కొంత ఉపశమనకరంగా ఉండగలదు. ప్రాంతాలపేర్లు వేయకపోతే ఎవరి ప్రాంతాలను వారే ఫోటోలను బట్టి గుర్తించలేరంటే నమ్మండి.
-నున్నా మధుసూదనరావు, హైదరాబాద్