ఉత్తరాయణం

కెమెరాలు ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దొంగతనాలుకాని, మానభంగాలు కాని, దుస్సంఘటనలు కాని, దోపిడీలు కాని ఇంకా ఏ చర్యలైనా అరికట్టాలన్నా, కట్టుదిట్టం చేయాలన్నా రైళ్ళల్లో, బస్సులలో ఇంకా ఇతర వాహనాల్లో కెమెరాలు ఏర్పాటుచేస్తే అందరికీ రక్షణగా సదుపాయంగా వుంటుంది. కెమెరాల సహాయంతో పోలీసుశాఖవారు ఎంతో చాకచక్యంతో నిఘావేసి సగం పైగా నేరాలను అరికట్టారు. వారికి అభినందనలు. ఇలాంటి చర్యలు జరుగకుండా ముందు ముందు ప్రజలను కాపాడతారని ఆశిస్తున్నాం. సాధ్యమైనంత త్వరలో కెమెరాలు ఏర్పాట్లు ఇంకా జరగాలని విజ్ఞప్తి.
- చోడవరపు నాగేశ్వరరావు, హైదరాబాద్

ఆ వెబ్‌సైట్ పై చర్యలు తీసుకోవాలి
ఒక అమెరికన్ ఈకామర్స్ వెబ్‌సైట్ ఇంట్లోకి వచ్చేముందు వినియోగించే డోర్‌మ్యాట్స్‌లపై దేవతామూర్తుల చిత్రాలు ముద్రించి అమ్మకానికి వుంచడం చూసిన ప్రతీ హిందువు రక్తం ఆవేశంతో మరిగిపోయింది. ఆ చిత్రాలను వెంటనే తొలగించాలని రెండు లక్షల మంది ఆ కంపెనీకి వివిధ ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా సైట్‌ల ద్వారా విజ్ఞప్తి చేసినా ఆ కంపెనీ వాటిని తొలగించకపోవడంపై ప్రభుత్వం తక్షణం స్పందించాలి. గత నెలలో క్రీస్తు, ఖురాన్, మసీద్ చిత్రాలతో ముద్రించిన చిత్రాలపై వెల్లువెత్తిన ఆ నిరసన కారణంగా 24 గంటలలో ఆ చిత్రాలను తొలగించిన వెబ్‌సైట్ హిందువుల మనోభావాలను పట్టించుకోక పోవడం దారుణం. హిందువులకు సహనాం ఎక్కువే కాని హైందవ సంప్రదాయం, హిందుత్వంను కించపరచే విధంగా చేసే చర్యలను సహించడం మాతృభూమిని, మాతృమూర్తిని అగౌరవ పరచడమే! ఆ ఈ కామర్స్ కంపెనీని వెంటనే బహిష్కరిస్తే దెబ్బకు దిగివస్తారు.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం

ఎప్పుడు పూర్తవుతుంది
తాత్కాలిక ఎపి రాజధాని పూర్తయిందా, అవుతుందా, అయిపోయిందా? ఎప్పుడవుతుంది.. ఎవరికీ తెలియదు. ఉద్యోగులను అడిగితే పైకి బ్రహ్మాండం, సొంతూరు వచ్చామని మోసము మాటలే .. చంద్రబాబుకి లోలోపల శాపనార్థాలే. పది సంవత్సరాలు హైదరాబాద్‌లో ఉండి నెమ్మది నెమ్మదిగా నెట్టుకోవాల్సిపోయి, ఏంటీ తొందర. 2019కా. అదీ జరిగేటట్లు లేదు. రోడ్డుమీద ఎవర్ని అడిగినా చంద్రబాబుని తిట్టనివాడు లేడు. మీడియా కూడా వారి వారి రకరకాల కారణాల వల్ల వాస్తవాలు రాయడం లేదు. జరుగుతున్నది మాత్రం దోపిడీ రాజధాని. ఇది అందరి మాట..
- డి.యం.రాజు, విజయవాడ

న్యాయం కాదు
అసలు విభజనే న్యాయం కాదు. విచక్షణాజ్ఞానం లేని రాజకీయ చదరంగంలో అమాయక ప్రజలు అన్యాయంగా బలైపోయారు. ఒక కుటుంబం విడిపోవాలంటేనే.. ఎన్నో సాధక బాధకాలు.. మంచి చెడులు నిర్ణయించి, పది మంది పెద్దల సమక్షంలో ఏ సమస్యా లేకుండా సానుకూలంగా విడిపోతారు. అలాంటిది 60 ఏళ్ళు అందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి వున్న ప్రజలను నిర్ధాక్షిణ్యంగా విడగొట్టారు. అక్కడ జరిగిన పరిణామాలు జ్ఞానం వున్న విజ్ఞానవంతులక్కూడ అంతుచిక్కలేదు. అదో రాజకీయ రాక్షసానందపు చీకటి రోజులు. విభజన ఇరిగింది. 10 ఏళ్ళూ కల్సి వుండొచ్చన్నది అక్షర సత్యం. అదంతా గాలికొదిలేసి అటు.. నాయకులు ఆడే డ్రామా ఓ వైపు.. ఇప్పుడు కొత్తగా న్యాయవాదులు చేస్తున్న రచ్చ ఓ వైపు.. న్యాయం చేసే న్యాయవాదులు అన్యాయంగా రోడ్డున పడటం న్యాయం కాదు. సమస్యకు పరిష్కారం సమస్య కాదు. శాంతియుతంగా పరిష్కరించుకొంటే అందరికీ మంచిది. న్యాయవాదులు ఓ క్షణం ఆలోచించండి!
- కురువ శ్రీనివాసులు, హైదరాబాద్

కామన్ సివిల్ కోడ్ సాధ్యమయ్యేనా?
‘వన్ నేషన్- వన్ లా’ చేస్తామని బి.జె.పి. 2014 ఎన్నికల్లో వాగ్దానం చేసింది. ఇప్పుడు దానికి అంకురార్పణ చేస్తున్నారు. బాగానే వుంది. ఈ పని రాజ్యాంగ నిర్మాణ సమయంలోనే జరిగి ఉంటే ఇంకా బాగుండేది. కొంతమంది ముస్లిం స్ర్తిలు (మూడుసార్లు అంటే విడాకులు ఇచ్చే) తలాక్‌ను తొలగించాలని వివాహ వ్యవస్థను పటిష్ట పరచాలని కోరుకుంటున్నారు. చట్టం ముందు అందరూ సమానమేనన్న సూక్తి స్వాతంత్య్రం సిద్ధించినప్పటినుండి అమలు కాకపోవడం పెద్ద దోషం. దేశాన్ని హిందూ రాష్ట్రంగా మారుస్తున్నారనే అవకాశం వుంది. ఏమైనా ఒకే చట్టం చేస్తే ఇదొక గొప్ప విజయం కాగలదు.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్