ఉత్తరాయణం

అసాంఘిక కార్యకలాపాల జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ నగరంలో ఆర్.కె.బీచ్ నుండి భీమిలి వరకు గల సముద్ర ప్రాంతం రాత్రిళ్లు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతోంది. మందు బాబులు మద్యం సేవించడం, మహిళలపై వేధింపులకు దిగడం చేస్తున్నారు. మద్యం మత్తులో తీర ప్రాంతం వెంట కార్లు, బైకులు ఓవర్ స్పీడుతో నడుపుతూ ఇతర వాహన చోదకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఋషికొండ- భీమిలి రోడ్డుపై వ్యభిచార కార్యకలాపాలు యధేచ్ఛగా జరుగుతున్నాయి. మెరైన్ పోలీసుల గస్తీ లోపించిన కారణంగా సముద్రంలోకి యువతీ యువకులు స్నానానికి వెళ్లి గల్లంతౌతున్నారు. చిన్నపిల్లలు సైతం సముద్ర కెరటాలకు బలైపోతున్నారు. కైలాసగిరిపై హైటెక్ వ్యభిచారం నిర్విఘ్నంగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం

అత్యాశ పనికిరాదు
మహానాడు సభలో చంద్రబాబుగారు ‘ఎన్నో ప్రజోపకార్యక్రమాలు చేపట్టాము. 2050 కల్లా ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే నెంబర్ ఒన్‌గా వుంటుందన్నారు’. ఆశ ఉండవచ్చు, అత్యాశ పనికిరాదు. 2050 నాటి రాజకీయ పరిస్థితులు ఇప్పుడు చెప్పటం సాధ్యమా? రెండు సంవత్సరాల క్రింద ఇచ్చిన రుణ మాఫీ, డ్వాక్రా మహిళల రుణాలు రద్దు, ఇంటింటికి ఉద్యోగం, నిరుద్యోగ భృతి, ధరల అదుపు మొదలైన హామీలు ఒక్కటి కూడా నూరు శాతం నెరవేర్చలేదు. పదీ పరక రైతులకు ఇచ్చి సరిపెట్టారు. ఇటువంటి హామీలు ప్రతిసారి ప్రజలు నమ్ముతారా! ఒక్కసారి ప్రజలను మోసంచేయవచ్చు. ఈ సంవత్సరం సాగునీరు, త్రాగునీరు లేక ప్రజలు, రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది స క్రమంగా వర్షాలు పడకపోతే వలసలు పెరిగి, రైతులు శ్రామికులుగా మారుతారు. ఇటువంటి సమయంలో అట్టహాసంగా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మహానాడులో మీకుమీరు పొగుడుకుంటే సామాన్యులకు ఒరిగేదేముంది. తెలుగుతమ్ముళ్ల అరాచకాలు మితిమీరిపోతున్నాయి. ప్రజల సమస్యలపై ముఖ్యంగా రైతులకు రుణాలు, విత్తనాలు, సబ్సిడీలు ఇచ్చి వ్యవసాయ రంగాన్ని రక్షించే చర్యలుతీసుకుంటే మంచిది. రైతులకు ప్రభుత్వం వెన్నుద న్నుగా నిలవాలి. వ్యవసాయం పట్ల వారిలో నెలకొన్న విముఖతను పోగొట్టాలి. వ్యవసాయాన్ని లాభ సాటిగా మలచాలి.
- ఈశ్వర్, ప్రొద్దుటూరు

గల్లంతైన తెలుగు పేర్లు
తెలుగువారు మదరాసీలు కారు, వారికి ఓ ప్రత్యేకమైన జాతి, విశిష్టమైన భాష ఉందని ప్రపంచానికి తెలియజేసిన మహనీయుడు నందమూరి తారక రామారావుగారన్న నిజం జగద్విఖ్యాతమే. వారి హయాంలోనే ‘ప్రయా ణ ప్రాంగణం’, ‘కనకదుర్గమ్మ వారథి’ మరియు ‘బహిర్భూమి’ వంటి తెలుగు పేర్లెన్నో వాడుకలోకొచ్చాయి. అది గత చరిత్ర. ఆ తెలుగు వైభవం కూడా వారితోనే ముగిసిపోయిందంటే ఆశ్చర్యపడవలసిందేమీ లేదు.
ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం (ఎ.పి) రెండు ముక్కలయిన తర్వాత ఒక భాగం తెలంగాణాగానే ఉండిపోగా మిగిలిన తెలుగు రాష్ట్రం ఆనాటి (మునుపటి) ‘ఆంధ్ర’గానో, గత ఉద్యమంలో బాగా వార్తల్లోకొచ్చిన ‘సీమాంధ్ర’గానో ఆవిర్భవించకుండా ‘ఆంధ్రప్రదేశ్’గానే స్థిరపడిపోవడమే తెలుగువారి దౌర్భాగ్యం. ఇది తెలుగు భాష తిరోగమనానికి మొదటి మెట్టు తప్ప మరేం కాదు.
ఇప్పుడు నవ్యాంధ్ర (మాధ్యమంవారు పెట్టిన పేరు) రాజధాని అమరావతిలో ఎన్‌టిఆర్ క్యాంటినొకటి ప్రారంభమైనట్టు వార్త. ఇదే ఆ మహానుభావుడి పాలనలో అయ్యుంటే ‘కృష్ణమ్మ ఫలహార కేంద్రం’ అని, ‘దుర్గమ్మ భోజనశాల’ అనీ తెలుగు పేర్లు బయటకొచ్చేవి. వారం రోజుల్లో జనం ఆ పేర్లకు అలవాటుపడిపోయేవారు. ఆ విధంగా తెలుగు రాష్ట్రంలో తెలుగు నిలిచి ఉండేది.
ఎన్‌టిర్ వారసుడిగా, తెదేపా అధినేతగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రిగారికి స్వభాష గురించి ఆలోచన రాకపోవడం నిజంగా రామారావుగారి దురదృష్టం కాదా? ఆలోచించండి!
-గురజాల విజయకుమార్, సికింద్రాబాద్

దౌత్య విజయం
ఎన్‌ఎస్‌జి- అణు సరఫరాల కూటమిలో మనకు సభ్యత్వానికి నలుబది ఏడు దేశాలు మద్దతు కూడగట్టడం- చైనా ఏకాకిగా మిగిలిపోవడం యావత్ ప్రపంచం గుర్తించేలా చేయగలగడమే. వర్తమాన భారత జాతి నేతృత్వానికి దఖలుపడిన దౌత్య విజయం.1962లో ఐక్యరాజ్యసమితిలో చైనాకు సభ్యత్వ కల్పనకు అహరహం కృషిచేసిన కాంగ్రెస్ పార్టీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు కృతజ్ఞతను వెంటనే చెప్పుకుంది ఆ దేశం మన భూభాగాన్ని దుర్మార్గంగా ఆక్రమించిచడం ద్వారా. 1962ను ఎందుకు జ్ఞాపకం చేసుకోవలసి వచ్చిందంటే- తగదునమ్మా అని కాంగ్రెస్ ప్రతినిధి ఆనంద్ శర్మ నేడు యన్‌ఎస్‌జి సభ్యత్వం విషయంలో మోదీ ప్రభుత్వ దౌత్యనీతిని తక్కువ చేసి మాట్లాడే సాహసం చేసినందుకు!
-వి.ఆర్.ఆర్.ఎ.రాజు, హైదరాబాద్