ఉత్తరాయణం

అడవుల పెంపకం చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వృక్ష సంపద, అడవులు, సరైన కొండవాలు, గాలి లేకపోతే వర్షాలు పడవు. ఇది సామాన్యంగా బుద్ధెరిగిన ఎవరైనా చెబుతారు. ప్రభుత్వాల నిర్వాకం, పది వృక్షాలు కొట్టి, వంద మొక్కలు నాటు అన్నట్లు ఉంది. పది వృక్షాలు పోతున్నాయ కాని, ఐదు వృక్షాలు కూడ పెరగడంలేదు. నాటిన మొక్కల సంరక్షణను పట్టించుకోకపోతే, అవి పెరగడం కష్టం కదా. అందువల్ల ప్రభుత్వం మీన మేషా లు మాని సక్రమంగా అడవుల పెంపకానికి పూనుకోవాలి.
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్టణం.

అందరి ఓట్లు కీలకమే
ఇటీవలి అసోం ఎన్నికల్లో భాజపా విజయానికి ‘‘ముస్లింలకు ప్రకటించిన సంక్షేమ పథకాలే కారణం’’ అని కేంద్ర మంత్రి నజ్మాహెప్తుల్లా ప్రకటించారు. అంటే ఎక్కడైనా ముస్లిం ఓట్లే కీలకం అని, వారికి ఎప్పటి కప్పుడు ఏవేవో పథకాలు ప్రకటిస్తూనే ఉండాలని వారు చెప్పకనే చెప్పారు. అన్ని మతాలవారు ఓట్లు వేసినప్పుడు ‘‘ముస్లింలపరంగానే విజయాన్ని ఆపాదించుకోవడం’’ విపరీతంగా ఉంది. పైగా ఈ ముస్లింలలో చాలామంది బంగ్లాదేశ్ నుండి చొరబాట్ల ద్వారా వచ్చినవారే.
- నున్నా మధుసూదనరావు, హైదరాబాద్

స్టడీ మెటీరియల్ పంపాలి
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ మొదటి, రెండవ, మూడవ సంవత్సరాల కోర్సులకు ఫీజులు చెల్లించినప్పటికీ, విద్యార్థులకు కోర్సు మెటీరియల్ పంపించకపోవడం వల్ల విద్యార్థులు పరీక్షలు ఎలా రాయాలన్న ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా విశ్వవిద్యాలయం వారు అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపించాలని కోరుతున్నాం.
-కూర్మాచలం వెంకటేశ్వర్లు, కరీంనగర్

చెట్లను నరకవద్దు
ఎన్ని మొక్కలు నాటినా, ఎన్ని కోట్లు ఖర్చు చేసినా మొక్కలు ఎదిగే బాధ్యత, మొక్కలు ఎండకుండా, పాడ వకుండా ఎవరు బాధ్యత వహిస్తారు? అసలు పచ్చదనం నాశనానికి కారకులెవరు? ముఖ్యంగా ట్రాన్స్‌కో అధికారు లు కారణం. వారి వ్యవహారశైలి వల్లనే పచ్చని చెట్లు నాశనం అవుతున్నాయ. కరెంటు స్తంభం పక్కన చెట్లు ఉంటే పూర్తిగా కిందివరకు కొట్టేస్తున్నారు. కరెంటు వైరుపై మీద కొమ్మలు పడితే కొద్దిగా కత్తిరించాలి. అలా కాకుండా చెట్టును సమూలంగా నరికివేస్తున్నారు. కరెంటు స్తంభం ఎత్తు పెంచాలి. వైరుకు కొమ్మలకు మధ్య గార్డింగ్ వైరు వేయాలి. ఇకపోతే ఇళ్ల యజమానులు వాళ్ల ఇంటిముందు చెట్ల నీడ ఉండకూడదని చెట్లను నరికివేస్తున్నారు. గణేష్, దుర్గ పూజలకు భారీ విగ్రహాలను తెస్తున్నప్పుడు, తిరిగి వెళుతున్నప్పుడు చెట్లను కొట్టేస్తున్నారు. చిన్న విగ్రహా లను అంటే 5-6 అడుగుల లోపే వాళ్లు పూజలో ఉంచాలి. ఇక షామియానాలు వేసేవారు, కేబుల్ టీవీ, ఇంటర్‌నెట్ కనెక్షన్లు ఇచ్చేవారు కూడా చెట్లకు కొట్టివేస్తున్నారు. ఇలాగ జరిగితే పర్యావరణం బాగుపడుతుందా? చెట్ల నాశనం వాతావరణానికి చెరుపు చేస్తుంది. నిజంగా ప్రభుత్వానికి పర్యావరణంపై శ్రద్ధ ఉంటే, చెట్లు కొట్టడం, మాని వేయాలి.
- వి. బాపిరాజు, సికిందరాబాద్

మరిన్ని రైళ్లను నడపాలి
నిరుడు గోదావరి పుష్కరాలకు ఎన్ని స్పెషల్ రైళ్లను వేసినా అన్నీ విపరీతమైన జనంతో ప్రయాణం అతిదుర్ల భమైంది. రిజర్వేషన్లు చేయంచుకున్నవారు కూడా తమ బెర్తులపై కూర్చోలేని స్థితి నెలకొంది. స్ర్తీలు, వృద్ధులు అనే మాట ఏమిటి అందరూ నరకం చూశారు. ఆగస్టు నెలలో జరిగే కృష్ణ పుష్కరాలకు అదనపు రైళ్లను ఎక్కువగా నడపాలి. అనధికార ప్రయాణికులను రిజర్వేషను కోచ్ లలో ఎక్కనివ్వకుండా నిరోధించాలి. రైలు బోగీలలో పోలీసు దళాలను నియమించాలి. మరిన్ని అదనపు రైళ్లను నడపాలి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వీటిని నడపాలి కాని, ఏదో మొక్కుబడిగా నడపకూడదు. నడిపే ప్రత్యేక రైళ్లను సకాలంలో గమ్యం చేరేలా చూడాలి. అసలు ప్రత్యేకరైళ్లను పట్టించుకోవడం లేదు. అవి గమ్యం చేరాల్సిన సమయానికి, చేరే సమయానికి అసలు పొంతనే ఉండటం లేదు.
-ఎన్. రామలక్ష్మి, సికిందరాబాద్

దారితప్పుతున్న పిల్లలు
తల్లిదండ్రులు ఎంతో ముద్దుమురిపాలతో పెంచుకున్న పిల్లలు యుక్తవయస్సు వచ్చేసరికి దారితప్పుతున్నారు. దీనికి మన విద్యావ్యవస్థ కారణం. కాలేజీలలో చేరగానే రకరకాల అలవాట్లున్న కొత్తవారితో పరిచయాలు ఏర్పడి మొహమాటంతో లేని అలవాట్లకు లోనవుతున్నారు. దీనివలన మత్తు పదార్థాలు తీసుకోవడం, పబ్‌లకు వెళ్లడం చేస్తున్నారు. అగ్నికి ఆజ్యంతోడైనట్లు కొన్ని చెత్త సినిమాలు ఉండనే ఉన్నాయి. తల్లిదండ్రులకీ విషయాలు తెలిసేసరికి చేయిజారే స్థితిలో ఉంటోంది వ్యవహారం. ఇంటిదగ్గర తల్లిదండ్రులు, బడిలో ఉపాధ్యాయులు బాధ్యత వహించాలి. దీనివలన కొంతలో కొంతైనా ప్రయోజనముంటుంది. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో పరిపాలన మెరుగవ్వాలి.
- వులాపు బాలకేశవులు, గిద్దలూరు