ఉత్తరాయణం

గొప్ప రాజనీతిజ్ఞుడు అంబేద్కర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు డాక్ట్టర్ అంబేద్కర్‌ను కేవలం దళితుల నాయ కుడిగా అభివర్ణిస్తున్నారు. గొప్ప దేశభక్తుడు, రాజనీ తిజ్ఞు డు అయన అంబేద్కర్‌ను కేవలం ఒక వర్గానికి చెందిన నాయకుడిగానే చిత్రీకరించడం ఎంతవరకు సమంజసం? ఆయన దళితులకు మాత్రమే కాదు దేశం మొత్తానికి నాయకుడు. ఆయనలోని మేధస్సు అప్పటి వరకు కొన సాగుతున్న హైందవ ధర్మంలో అనేక మార్పులు తీసుకొని రావడానికి దోహదం చేసింది. దేశ నిర్మాణం, జాతీయ ఆలోచనా విధానం ఎంతో విలువైనవి. ఆయన సహచర నాయకులు కేవలం రాజకీయ వేత్తలుగానే మిగిలిపోయా రు. కానీ అంబేద్కర్ అట్లా కాదు. ఆయనలోని గొప్పతనా న్ని కేవలం మనదేశంలో మాత్రమే కాదు సాక్షాత్తు ఐక్యరా జ్య సమితి కూడ గుర్తించింది. మన ప్రధాని చొరవతో మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్య సమితి ఆయన జయంతి ఉత్సవాలను నిర్వహించింది. అందువల్ల ఆయన కేవలం ఒక వర్గానికే కాదు, మొత్తం దేశానికి నాయకుడు.
- డా. టి. హనుమాన్ చౌదరి, సికిందరాబాద్

అవగాహన కల్పించాలి
రోడ్లపై ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వాడటం తప్పనిసరి అనే నిబంధన పాక్షికంగానే అమలవుతోంది. చాలామంది ఈ సూచనలను పాటించడం లేదు. ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే తమ ప్రాణానికే ముప్పు అని చాలామంది భావించకపోవడమో లేక తమ డ్రైవింగ్ మీద మితిమీరిన ఆత్మవిశ్వాసమో తెలియదు. ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్తగా వాహనాలు నడిపినా, ఎన్ని ట్రాఫిక్ నిబంధనలు పాటించినా, అవతలివారి నిర్లక్ష్యం కారణంగానో లేక వెనుకనుండి అతి వేగంగా దూసుకు వచ్చే వాహనాలవల్లనో ప్రమాదాలు జరిగి ప్రాణహాని సంభవించవచ్చు. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. శిరస్త్రాణం తప్పనిసరి అనే నిబంధన ఉన్నా లేకున్నా తమ ప్రాణరక్షణకోసం, తమపై ఆధారపడ్డ కుటుంబాన్ని దృష్టి లో ఉంచుకొని తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ వాడవలసిన ఆవశ్యకతను, లేనిచో కలిగే నష్టాలను పత్రికల ద్వారా, టీ.విలు, రేడియోల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలి. అవగాహన కలిగించాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

షెల్టర్లు నిర్మించాలి
గత ప్రభుత్వాల కాలంలో రాష్ట్ర రవాణా సంస్థవారు బస్టాపుల్లో షెల్టర్లు కట్టించేందుకు ఆ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ, ఉచితంగా కట్టిస్తే వారి వ్యాపార ప్రకటన బోర్డులపై పన్ను మినహాయింపు ఇస్తామనే ఒప్పందం చేసుకున్నారు. అయితే అట్టి ప్రైవేటు సంస్థలవారు ప్రధాన రహదారుల్లో మాత్రమే ఒకటి లేదా రెండు అవసరమున్నచోట నాలుగైదు షెల్టర్లు నిర్మించి మధ్యతరగతి, చిన్న వీధుల్లోని బస్టాపులను అస్సలు పట్టించుకోలేదు. అందువల్ల ప్రధాన నగరాల్లో ఒక షెల్టరు వుండాల్సినచోట 3,4 నిర్మించి డబ్బును వృధా చేసారు. చిన్నమధ్యతరగతి బస్టాపుల్లో నీడ పందిర్లు(షెల్టర్లు) లేక వృద్ధులు, పిల్లలు, వికలాంగులు వానల్లో, ఎండల్లో అష్టకష్టాలు పడుతున్నారు. అందువల్ల తెలంగాణ రాష్ట్ర రోడ్డురవాణా సంస్థవారు ప్రయాణికులు నిలిచే అన్ని బస్టాపుల్లో నీడ పందిర్లు నిర్మించేలా ఆదేశించాలని మన గౌరవనీయ ముఖ్యమంత్రి కె.సి.ఆర్.గారికి మా విన్నపం.
- బెలిదె వీరశంకరు, హైదరాబాద్

ట్రాఫిక్ ఇబ్బందులు
గుంటూరు జిల్లా దుగ్గిరాల-తెనాలి ప్రధాన రహదారిపై తరచుగా ట్రాఫిక్ స్తంభించి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్ ఇటీవలి కాలంలో భారీగా పెరగడం, రోడ్డు సగం ఆక్రమణలకు గురవడం కారణంగా భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. పాత లాకు నుండి కొత్తలాకు వరకు ఉన్న సుమారు 1కి.మీ. రోడ్డు పూర్తిగా వాహనాలతో నిండిపోతుండడంవలన ట్రాఫిక్ క్లియర్ అవడానికి 2-3 గంటలు పడుతోంది. గజానికి ఒక గుంత కావడంవలన ముఖ్యంగా వర్షాకాలంలో ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. కొన్ని భవంతులవారు మెట్లను రోడ్డుపైకి నిర్మాణం చేసినా, చిన్నాచితకా వ్యాపారులు తోపుడుబళ్లతో సగం రోడ్డు ఆక్రమించేసినా పట్టించుకునే వారే లేరు.
ఎం.కనకదుర్గ, తెనాలి

పాస్ పుస్తకాల రద్దు తగదు
గ్రామాధికార వ్యవస్థకు ఆయువుపట్టు పట్టాదారు పా సు పుస్తకం 1981వ సంవత్సరం నుండి ఆవిర్భవించింది. ఆ పుస్తకంలో విశదంగా పట్టాదారుని పేరు, పట్టా నెం బరు, సర్వే నెంబరు, పూర్తి విస్తీర్ణం, అ.విస్తీర్ణం, శిస్తు మొదలైన అంశాలతో కూడ రైతునకు ఎంతో ప్రయోజనకారిగా ఉండేది. ఈ పాసుపుస్తకాలని రద్దు చేయడం రైతునకు ఎంతో దురదృష్టకరం! ప్రభుత్వం మారినపుడు వారి ఆడంబరంకోసం రైతుకు ఏదో మేలుచేసినట్లు వివిధ రకాలుగా పాసు పుస్తకాలు సృష్టించి రెవెన్యూ విధానానికి అపశృతి కలిగించడం సమంజసం కాదు.
- కోవూరు వెంకటేశ్వరప్రసాదరావు, కందుకూరు

ఆలోచించి అడుగేయాలి
గుజరాత్‌లో వద్దనుకున్న అణువిద్యుత్ శ్రీకాకుళంవద్ద పెట్టాలా? భోగాపురం (విజయనగరం జిల్లా)లో ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా విమానాశ్రయం ఎందుకు? ప్రజలకు మంచిచెడుల గూర్చి తెలియజెప్పి తర్వాతే ఆ నిర్మాణాలు మొదలుపెడితే బాగుంటుంది. నెలకొల్పిన ఫార్మాసిటీలు, ఫ్యాక్టరీలు ప్రజల బ్రతుకుల్లో సరైన వెలుగులు నింపుతున్నాయా? ప్రజలకి సరైన అవగాహన కల్పించాకనే ముందుకెళ్ళాలి. సోలార్ విద్యుత్‌లు చాలవా? అశోక్‌గారికి విశాఖ విమానాశ్రయం దూరమని భోగాపురంలో విమానాశ్రయం పెట్టాలా? ప్రభుత్వాలు ఆలోచించి ముందుకెళ్ళాలి.
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్నం