ఉత్తరాయణం

వెనుకబడిన తెగలు కావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివాసీలు వెనుకబడిన తెగలు కావు. వెనక్కి నెట్టబడిన తెగలు. స్వాతంత్య్రానికి పూర్వం నుండే ప్రధాన స్రవంతికి దూరం చెయ్యబడి ప్రస్తుతకాల వరకు ఏదో ఒక రూపంలో దోపిడీకి గురవుతున్న వీరికి చేయూతనిచ్చి ముందుకు వచ్చేలా సహకరించాలి. వీరికి ‘అ’, ‘ఆ’ ఇవ్వండి చాలు. ఇక్కడ ‘అ’ అంటే అక్షరం, ‘ఆ’ అంటే ఆరోగ్యం, ఆహారం. అక్షరం మీద అనాసక్తి లేకున్నా, చదువు‘కొనే’ స్థోమత లేదు. ఏదో ఒకపేరుతో ప్రభుత్వ పాఠశాలల్ని మూసివేయడమంటే వీరి నుదిటిరాతల్ని సీల్ చేయడమే. జనాభాలో అత్యంత అల్పశాతంలో విద్య, అత్యధిక స్థాయిలో డ్రాపౌట్లు ఉన్నాయంటే ఆ మూలాల్ని పరిశీలించి సరిదిద్దాలి. అంతే కాని ఈ బడులు నిండే పిల్ల లు లేరని బడులు మూయొద్దు. కనీసావసరాలు తీరక, కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్న వీరి ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం సత్వరం చర్యలు తీసుకోవాలి. పౌష్టికాహారలోపం వీరిని పీడిస్తోంది. వీరికోసం ఉన్న చట్టాలు అమలు పరిస్తే చాలు.
- డివిజి శంకరరావు, పార్వతీపురం

శాంతి మార్గమే గొప్పది
సమస్యల సాధనకై ఉద్యమాలు, ఆందోళనలు సహజమే. ఉద్యమాలు లేనిదే చాలా సమస్యలు పరిష్కరింపబడవు. అయితే గాంధీ పుట్టిన దేశం మనది అని గుర్తించుకోవాలి. గాంధీజీ అనుసరించిన అహింసా మార్గపు ఉద్యమాలే మన దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టిందని మరువవద్దు. ప్రస్తుత ఉద్యమాలనూ గాంధీ మార్గం అనుసరించి చేస్తుంటే ఫలితం ఉంటుంది. ప్రజాబలం ఉంటుం ది. కానీ రైళ్ళు, ఆర్టీసీ బస్సులు, ఇంకా ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను నాశనం చేయడం, హింసా మార్గంలోకి వెళ్ళడం సబబుకాదు. ఇది అత్తమీద కోపం దుత్తమీద చూపించడం లాంటిదే. మన కంటిని మనమే పొడుచుకోవడం లాంటిది. ఆ నష్టాన్ని పరోక్షంగా మనమే భరించా ల్సి వస్తుంది. కాబట్టి ఉద్యమాలు శాంతియుత మార్గంలో వినూత్న రీతిలో చేపడితే బాగుంటుంది.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్

ఎవరికి వారు తర్కించుకోవాలి
సంపన్న వర్గాలు గ్యాసు సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపు సమంజసమే. అట్టి వారికి ఒక రూ.133లు పెద్ద మొత్తమేమీ కాదు. అట్లాగే అర్హులు కానివారు కూడ వైట్‌రేషన్ కార్డు మీద సరుకులు తీసుకుంటున్నారు. ఒకళ్ళు కిలో రూ.2 బియ్యా న్ని రూ.10 లకు అమ్ముకుంటున్నారు. స్వంత అపార్టుమెంట్ వుండి, పిల్లలు అమెరికాలో జాబ్స్ చేస్తూ కూడా రేషన్ షాపులో బియ్యంతీసుకునేవారు కూడా ఉన్నారు. తప్పొప్పులు ఎవరికివారు బేరీజు వేసుకోవాలి. మరొకరు చెప్పే మాట కాదు.
- బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ

పకోడి పొట్లాలతో ప్రమాదం!
ప్లాస్టిక్ కవర్లలో వేడి వేడి ఆహార పదార్థాల నిలువ ఉంచితే ఆరోగ్యానికి ముప్పు అని ఏనాడో రుజువైంది. అయితే పత్రికల కాగితాలతో పొట్లాలు కట్టబడిన పకోడీలు, బజ్జీలు తినటం కూడా ప్రమాదకరమేనంటున్నారు. ఎందుకంటే అక్షరాలు అచ్చులు సీసంతో చేస్తారట. అంటే ముద్రణకు వాడిన సిరాతోపాటు స్వల్పంగానైనా సీసం అక్షరాలలో చేరుతుందన్నమాట. కాబట్టి సీసం కూడా తినుబండారాలకు అంటుకుని ‘లోపలికి’చేరి అనారోగ్యం (సుదీర్ఘకాలంలో) కలిగించే అవకాశం ఉంది. కాబట్టి పత్రికల కాగితాలలో కట్టబడినవి ఏవీ కూడా తినకపోవటం మంచిది.
- నున్నా మధుసూదనరావు, హైదరాబాద్

అనైక్యతే బలహీనత
హిందూ మతంలో వున్న అనైక్యత ఇంకే మతంలోనూ లేదని ఘంటాపధంగా చెప్పవచ్చు. దీనికి ఒక చక్కని ఉదాహరణ టి.వి. ఛానెళ్లలో పురాణాతిహాసాలు, ఉపనిషత్తులు, వేదవాఙ్మయాలపై ప్రవచనకారుల ఉపన్యాసాలు. వేద విజ్ఞానాన్ని సరిగ్గా అధ్యయనం చెయ్యకుండా మిడిమిడి జ్ఞానంతో టివిల ముందు కూర్చొని వంకర భాష్యా లు చెబుతున్నారు. ప్రసంగాలలో ఇతర ప్రవచనకారులను విమర్శించడం, వారి సిద్ధాంతాలలో తప్పులను వెదకడం, వారి భాష్యాలకు వ్యతిరేకంగా మాట్లాడడం చేస్తుండడం వలన ఈ ప్రసంగాలను వినే సామాన్య భక్తజనం గందరగోళానికి గురవుతున్నారు. ఇటీవల శిరిడీసాయి తరుఫున ఎవ్వరూ యివ్వని వకాల్తా పుచ్చుకొని ఒక ఆధ్యాత్మికవేత్త ఇతర హిందూ గురువులను తీవ్రంగా విమర్శించడం, వారి వ్యాఖ్యానాలు, సిద్ధాంతాలపై బురదజల్లడం చేసారు. వీటివలన హిందువులలో గందరగోళం పెరుగుతోంది. వీరి అనైక్యతా సెక్యూలరిస్టులమని చెప్పుకునే అన్యమతస్థులకు బలం. ఆధ్యాత్మిక గురువులు, ప్రవచనకారులు ఇటువంటి విపరీతపు పోకడలకు స్వస్తిచెప్పి హిందూ సమాజంలో ఐక్యత వర్ధిల్లేందుకు కృషిచేయాలి.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం

విచక్షణ కోల్పోరాదు
రాజకీయ నాయకులు కొందరు చట్టసభల్లోను, సమావేశాల్లోను ఛానెల్స్‌లోను తమ ప్రత్యర్థులను విచక్షణా జ్ఞానం లేకుండా హెచ్చరించడం విమర్శించడం అభ్యంతరకరం. ప్రజలకు దిశానిర్దేశం వారి సత్ప్రవర్తన ద్వారా చేయవలసిన నాయకులు ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడుతూ వార్తల్లో ఎక్కి వాక్ స్వాతంత్య్రాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. పార్టీ తమ సభ్యులకు క్రమశిక్షణా తరగతులు సభల్లో గాని బయట గాని మాట్లాడగూడని పదాల విషయంలో తర్ఫీదునివ్వాలి. ఏవేవో అసందర్భ సంచలన ప్రకటనలు చేసి దేశ ప్రతిష్ఠను బజారుకీడ్చడం మంచిది కాదు. అసందర్భ ప్రేలాపనల వల్ల చీప్ పాపులారిటీ రావచ్చునేమో కాని, గౌరవం మాత్రం దక్కదు.
- జి.వి.రత్నాకరరావు, సికిందరాబాద్