ఉత్తరాయణం

అవగాహన పెంచుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణా పుష్కరాల సందర్భంగా వివిధ సంస్థలు విడుదల చేసిన పుష్కర సాహిత్యాన్ని భక్తులు అవపోసన పట్టాలి. పుష్కరాలకు లక్షలాది మంది హాజరై పితృదేవ తలకు పిండ ప్రదానాలు జరపడం సర్వసాధారణమే. అయతే పుష్కర ప్రాధాన్యతను, కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని దేవాలయాలు, అలాగే సంస్కృతీ సంప్రదా యాలను కళ్లకు కట్టినట్టు వివరించే పుస్తకాలు ఎన్నో అందుబాటులోకి తెచ్చారు. కేవలం ఘాట్లలో స్నానాలకే పరిమితం కాకుండా అందుబాటు ధరలకు లభించే పుస్తకాలను చదివితే అలౌకికమైన ఆనందం కలుగు తుం ది. భక్తులు ఈ విషయం గమనించాలి.
- వాండ్రంగి కొండలరావు, పొందూరు

కొత్త జిల్లాల గందరగోళం
తెలంగాణ ప్రభుత్వం దసరా నుండి ఏర్పాటు చేయ బోయే కొత్త జిల్లాలకు కసరత్తు పూర్తి అయోమయంగా కనిపిస్తోంది. జిల్లాల సంఖ్య విషయంలో, సరిహద్దుల విషయంలో ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లోపించి మొత్తం ప్రక్రియే గంరగోళంగా మారిపోయనట్టు తోస్తున్నది. ఇంకా చెప్పాలంటే కనీసం గ్రామ పంచాయతీకి కూడా తగని ఓ మోస్తరు పెద్దపట్టణాలన్నీ జిల్లా కేంద్రాలుగా చేసేసి రాజకీయ నిరుద్యోగులతో వాటిని నింపేయాలని యోచిస్తున్నట్టుగా అనుమానం కలుగుతోంది. నివేది కల న్నీ కలెక్టర్లూ, రెవెన్యూ డివిజన్ల అధికారులే తయారు చేసి నా వాటివెనక మంత్రుల మాటలకే, రాజకీయ వత్తిళ్లకే ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిసిపోతోంది. కొత్త జిల్లాలంటే కొత్త చిక్కులు తెచ్చిపెట్టకూడదు. ఈ కోణంలో ఆలోచించి చూస్తే నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి జిల్లా, కరీన గర్‌లో సిరిసిల్ల జిల్లా ప్రజలకు గుదిబండలుగా మారే ప్రమాదముంది. అదెలాగంటే, ఒకవేళ కామారెడ్డి జిల్లా ఏర్పాటు చేస్తే జుక్కల్, పిట్లం, బీర్పూర్ వంటి మం డలాలకు అది శరాఘాతంగా మారుతుంది. వారికి ప్రస్తుత జిల్లా కేంద్రం 50 నుంచి 60 కిలోమీటర్ల దూరం లో ఉండగా, కామారెడ్డి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకవేళ నిజామాబాద్‌ను విడదీయాలనుకుంటే కామారెడ్డి కాకుండా బాన్స్‌వాడ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలి.
- సిహెచ్. సుధాకర్, హైదరాబాద్

చార్జీల భారం
ఆర్టీసీ ఆర్డినరీ బస్సు చార్జీలు రైలు చార్జీలకంటె మూడు రెట్లు ఎక్కువగాను, ఎక్స్ ప్రెస్ చార్జీలు ఇంకా ఎక్కువగాను ఉన్నాయ. ఇంతలేసి రేట్లు ఉంటే బస్సులలో ఎవరు ప్రయాణిస్తారు? రైలు రూటు లేని కొద్ది మార్గాలలో తప్ప. చార్జీలు తగ్గిస్తే ప్రజలు రైలెక్కకుండా బస్సులలో నిండుగా ఎక్కుతారు. ఆర్టీసీకి గిట్టుబాటు అవుతుంది. రద్దీ లేని రూట్లలో మినీ బస్సులను పెట్టవచ్చు. నిరర్ధకంగా ఉన్న మండల డిపో భవనాలను అమ్మివేయాలి. కనుక చార్జీలు తగ్గించండి.
- గోపాలుని శ్రీరామమూర్తి, వినుకొండ

సర్టిఫికెట్ల జారీలో జాప్యం
తెలంగాణ రాష్ట్రంలో లేట్ బర్త్ సర్టిఫికెట్ల జారీకి రెండు నుంచి మూడు నెలలు పడుతోంది. కొన్ని ఎమ్మార్వో కార్యాలయాల్లో ఈ సర్టిఫికెట్లు ఒక మూలన పడి ఉంటున్నాయ. పైరవీలు చేసుకున్న వారికే సర్టిఫికెట్లు అందుతున్నాయ. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సత్వరే స్పందించి చర్యలు తీసుకోవాలి.
-కొలిపాక శ్రీనివాస్, బెల్లంపల్లి

చేనేత పరిశ్రమను ఆదుకోవాలి
వ్యవసాయం తర్వాత లక్షలాది మందికి జీవనాధా రమైన చేనేత పరిశ్రమ నేడు కొనవూపిరితో ఉంది. ప్రస్తు తం వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత చేనేత రంగానికి ఇవ్వకపోవడం దారుణం. కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాల నిర్లక్ష్యానికి గురై చేనేత పరిశ్రమ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వ విధానాలు చేనేత పాలిట పరణ శాసనాలుగా మారుతున్నాయ. చేనేత పరిశ్రమను పరిరక్షించాలి.

1- పున్న అంజయ్య, నల్లగొండ
కాశ్మీరీ పండిట్లను ఆదుకోవాలి
లక్షల మంది కాశ్మీర్ పండితులు ఇతర ప్రాంతాలలో నివసిస్తున్నారు. వారి కోసం కేంద్రం చొరవ తీసుకొని ఒకేచోట మొదట 1000 గృహాలు నిర్మించాలి. ఎక్కువ జన సంఖ్య ఉన్నట్లయితే కాశ్మీర్ పండితులకు బలం చేకూరుతుంది. నేడు వారు తమ స్వస్థలాలకు వెళ్లలేక, స్వదేశం లోనే కాందిశీక జీవనాన్ని గడుపుతున్నారు. వారిని ఆదు కోవాలి
- అందా వెంకట సుబ్బన్న, మైదుకూరు