ఉత్తరాయణం

వృద్ధులకు సదుపాయం కల్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొరుగు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జన్మదిన కానుకగా వృద్ధులకు సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వీలు కల్పించబడింది. సీనియర్ సిటిజన్స్ ఫోరమ్ ఎన్ని విజ్ఞప్తులు చేసినా రాష్ట్ర రోడ్డు రవాణా బస్సుల్లో రాయితీ లేదు ఇప్పటివరకు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. రైల్వే శాఖ కొన్ని రాయితీలు ఇవ్వడం లేదా? వృద్ధులకు సదుపాయాలు కల్పించండి.
- బి.ఆర్.సి. మూర్తి, విజయవాడ

నిరాశ మిగిల్చిన నిర్ణయం
ఉత్తరాంధ్ర ప్రజల పాలిట సంజీవనిగా భావింపబడుతున్న విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్ (విమ్స్)ను అటానమస్ ఆస్పత్రిల జాబితానుండి తొలగిం చి వైద్య విద్యాశాఖ పరిధిలోనికి తీసుకువస్తూ రాష్ట్ర ప్రభు త్వం ఉత్తర్వులు జారీచెయ్యడం బాధాకరం. హైదరాబాద్‌లోని నిమ్స్ స్థాయిలో స్వతంత్ర ప్రతిపత్తి సంస్థగా అభివృద్ధి చేసేందుకు 2007లో దీనికి శంకుస్థాపన జరిగింది. తొలుత 50 కోట్లతో భవనాల నిర్మాణం జరిగినా తర్వాత ప్రభుత్వాలు ఆశించిన స్థాయిలో నిధులు మంజూరు చెయ్యకపోవడంవలన ఆస్పత్రి నిర్మాణం పూర్తికాలేదు. 8 సూపర్‌స్పెషాలిటీ విభాగాల కోసం నిర్దేశించిన ఒక్క పరికరం కూడా ఇంతవరకు రాలేదు. గతంలో ప్రభుత్వం 2015 డిసెంబరుకల్లా ఆస్పత్రిని పూర్తిస్థాయిలో ప్రారంభిస్తానని వాగ్దానం చేసింది. ఇప్పుడు యు-టర్న్ తీసుకొని సంస్థ ఏర్పాటు లక్ష్యాన్ని నీరుగారుస్తున్నది. డి.ఎం.ఇ పరిధిలో కలిపేసింది. ఇందువలన నిధులు సాధారణ స్థాయి లో వచ్చి ఎయిమ్స్ నిమ్స్ తరహాలో తీర్చిదిద్దేందుకు, అత్యాధునిక వైద్య సౌకర్యాల కల్పనకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. ఈ నిర్ణయం ఉత్తరాంధ్ర ప్రజలకు తీవ్ర నిరాశ మిగిల్చింది.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం

అర్ధం లేని సవాళ్లు
పాలక పక్షం, ప్రతిపక్షాలు అయిన దానికి, కాని దానికీ సవాళ్లు రువ్వుకోవడం సహజమే! ఆ సవాళ్లను పార్టీలే కాదు, ప్రజలూ పట్టించుకోరు. పట్టించుకోరని తెలిసినా వాళ్లు సవాళ్లు రువ్వుకోవడం విడ్డూరమే. ఈమధ్య మరో రకం సవాళ్లు వినిపిస్తున్నాయి. నువ్వు రాజీనామా చెయ్యి. ప్రజలవద్దకు పోదాం ఈసారి ఎవరు గెలుస్తారో చూద్దాం అంటున్నారు. సవాలు రువ్వినవాడు ఎన్నికల ఖర్చు భరిస్తాడా? అది ప్రజల మీదే పడుతుంది. అసెంబ్లీ రద్దుచేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించమని జగన్ సవాల్ చేయడం కేవలం బాధ్యతా రాహిత్యమే. వీళ్ల సరదా తీర్చడానికి కోట్ల ప్రజాధనం వెచ్చించాలా? అమూల్య సమయం వృధా చేయాలా? ఇలాంటి సవాళ్లు విని ప్రజలు నవ్వుకుంటారన్న జ్ఞానం వీరికి ఉండదా?
- స్నేహమాధురి, పెద్దాపురం

పింఛనర్లను పట్టించుకోండి
రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు ప్రధానంగా మూడు సమస్యలు అపరిష్కృతంగా చాలాకాలం నుండి వున్నాయి. మొదటిది హెల్త్‌కార్డులు జారీచేశారు గానీ కార్పొరేట్ హాస్పిటల్స్ నగదు రహిత వైద్యం అందించడం లేదు. అలాగే ఔట్‌పేషెంట్ సర్వీసు, పరీక్షలు చేయడం లేదు. రెండవది 10వ పే కమిటీ కొత్త వేతనాలు పెన్షన్‌దార్లకు 2-6-2014 నుండి ఫిబ్రవరి 15 వరకు పెరిగిన పెన్షన్ బకాయిలు చెల్లించవలసి వున్నది. మూడవది తెలంగాణా ఇంక్రిమెంట్ స్థానే పెన్షనర్లకు ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. ఎందువల్లనంటే తెలంగాణా రాష్ట్ర ఉద్యమానికి ఆనాడు సర్వీసులో వుండి నేడు పదవీ విరమణ చేసిన నేటి పెన్షనర్లు ముఖ్యభూమిక పోషించారు. మొన్నటి ఉద్యమంలో కూడా పెన్షనర్లుకూడా మిగతా ఉద్యమకారులవలే ప్రత్యేక రాష్ట్రంకోసం పాల్గొన్న విషయం తెలిసిందే. కావున ముఖ్యమంత్రి చొరవ తీసుకొని విశ్రాంత ఉద్యోగుల పైన తెలిపిన సమస్యలు పరిష్కరిస్తారని గంపెడాశతో ఎదురు చూస్తున్నారు.
- గర్నెపూడి వెంకటరత్నాకరరావు, హనుమకొండ

మార్పు సాధ్యమా?
కుటుంబాల్లోని అపోహల్ని తొలగించడానికి ‘బతుకు జట్కాబండి’, ‘అందమైన జీవితం’ లాంటి కార్యక్రమాలు తోడ్పడతాయనుకోవడం ఆశావహృ దృక్పథమే తప్ప నిజం కాదు. ఎవరెన్ని చెప్పినా అపోహలు, అనుమానాలు పెనుభూతాల్లా పెరుగుతాయి తప్ప తరగవు.అయినా డబ్బు ఖర్టుపెట్టి చానల్‌కు వెళ్లి సమస్య రాష్టమ్రంతా చాటుకోవాలని అందరూ చూస్తుండగా కౌన్సిలర్ల మందలింపులు, సలహాలు వింటూ కూచోవాలని ఎవరూ అనుకోరు. ఓ గంట కార్యక్రమంలో నలుగురూ నాలుగు మాటలు చెప్పేస్తే మనుషులు మారిపోతారా? సీరియస్‌గా తీసుకోనక్కరలేదు.
- సత్య, కరప