ఉత్తరాయణం

ఎట్టకేలకు సముచిత నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ ఆథ్యాత్మిక విలువలు, ప్రాధాన్యతలపై దేశ ప్రజలకు అవగాహన కల్పించేందుకు, ముందు తరాల వారిని ధర్మాచరణ దిశగా నడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారి జయంతిని ప్రపంచవ్యాప్తంగా ఆథ్యాత్మిక దినోత్సవంగా నిర్వహించేందుకు నిర్ణయించడం ముదావహం. భారతదేశంలో హిందూ మతానికి, ఆథ్యాత్మికతకు పరమతాల నుండి తీవ్ర సవాళ్లు ఎదురౌతున్న తరుణంలో 8వ శతాబ్దంలో శ్రీ శంకరాచార్యులవారు ఉద్భవించి, కాలినడకపై దేశవ్యాప్తంగా అద్వైత వ్యాప్తికి కృషిచేసారు. భారతీయులలో భక్తివిశ్వాసాలు, దైవచింతన, ధర్మాచరణ పెంపొందించేందుకు పలు స్తోత్రాలు, కావ్యాలు రచించారు. నేటికీ ప్రపంచవ్యాప్తంగా శ్రీ ఆదిశంకరాచార్యులవారు సాక్షాత్తు ఆ శంకర భగవానుని అవతారమని కొలుస్తూ, ఆయన ప్రతిపాదనించిన అద్వైత సిద్ధాంతాన్ని ఆచరిస్తుంటారు. వాజ్‌పేయి ప్రభుత్వ కాలంనుండి ఆయన జయంతిని ఆధ్యాత్మిక దినోత్సవంగా నిర్వహించాలని శృంగేరిపీఠం కోరుతున్నా రాజకీయ కారణాల దృష్ట్యా ప్రభుత్వం వాటిని బుట్టదాఖలు చేసింది. ఇన్నాళ్లకు ఆ ప్రతిపాదనకు అంగీకారం యిచ్చిన మోదీ ప్రభుత్వానికి అభినందనలు.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం

పేకాట ప్రకటనలు వద్దు
మన భారతీయ నీతి శాస్త్రాలు వివరించిన సప్తవ్యసనాలలో జూదము ఒకటి. ఇందులో చాలా రకాలున్నాయి. పేకాట ఒక రకం మాత్రమే. ఈ జూదంవల్ల కొందరు ఆస్తులను, మరికొందరు ప్రాణాలను- వీరందరూ సమానంగా తమ సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. అందుకే ఈ జూదాన్ని ప్రభుత్వంవారు నిషేధించారు. కానీ ఈ జూదము అంతర్జాలంలో విచ్చలవిడిగా ఆడుతున్నారు. అదే విపరీతం అనుకుంటే ఈమధ్య జరుగుతున్న దారుణం ఏంటంటే అంతర్జాలంలో మీరు పేకాట ఆడండి. అంతులేని డబ్బు గెలవండి అని టీ.విలో అరగంటకి 4సార్లు ప్రకటనల వర్షం కురిపిస్తున్నారు. అదీ పరమ అసభ్యంగా ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ ఆడండి అని. దీనివల్ల టీ.వి చూస్తున్న వారిలో ఎక్కువ శాతం ఉన్న యువత ఈ ఆట ఆడి తమ డబ్బును, సమయాన్ని మాత్రమేకాక వారి భవిష్యత్తును కూడా నాశనం చేసుకుంటారు. దయచేసి ఈ ప్రకటనలను వెంటనే ఆపాలి.
- బి.సిరిసుమ, హైదరాబాద్

నిరుద్యోగులపై దాడి సమంజసం కాదు
1,42,825 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ప్రభుత్వానికి గుర్తుచేయటానికి శాంతియుతంగా నిరసనలు తెలిపితే తప్పా? రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులను కాలరాయటం ప్రభుత్వానికి తగదు. నిరుద్యోగుల మీద దాడి చేయిస్తే ప్రభుత్వానికి ఏమి వస్తుంది? ప్రభుత్వం అపవాదును మూటగట్టుకోవాలనుకుంటుందా? రాష్ట్ర ప్రజలు ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో, ప్రభుత్వం క్రమశిక్షణగా వ్యవహరించాలి. ఏ అపకారం చేయని, నిరుద్యోగుల మీద దాడి చేయడం ఏ సమాజం ఒప్పుకోదు.
- కరల్ల సురేఖమ్మ, కాశేపల్లి

వడ్డీ రేట్లు తగ్గించడం అన్యాయం
పోస్ట్ఫాసు డిపాజిట్ రేట్లను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎవ్వరూ హర్షించరు. 0-25 (పావుశాతం) మేరకు రేట్లను తగ్గించడం ఎంతమాత్రం సమంజసం కాదు. డిపాజిట్ రేట్లను పెంచాల్సింది పోయి తగ్గించడంవల్ల ప్రజలు పొదుపు పట్ల ఆసక్తిని చూపించడం కష్టం. కిసాన్ వికాస్ పత్రాల (కె.వి.పి.)తో పాటు ఐదేళ్ల కాల పరిమితిగల డిపాజిట్లపై వడ్డీని ఏప్రిల్ 1నుంచి ప్రభుత్వం తగ్గించింది. ఇంతటితో ఆగకుండా ప్రతి 3నెలలకొకసారి వడ్డీ రేట్లను సవరిస్త్తామని పేర్కొనడం మరీ దారుణం. ఇప్పటికే పోస్ట్ఫాసుల్లో లావాదేవీలు బాగా తగ్గుతున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు. అంతేకాదు పదవీ విరమణ చేసిన వృద్ధులు, మధ్యతరగతి వారు ఎక్కువగా పోస్టాఫీసుల్లో డిపాజిట్లు చేస్తుంటారు. అంచేత ప్రజల మనోభావాలను గమనంలోకి తీసుకొని వడ్డీరేట్లను యధాతథంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా వుంది.
- వాండ్రంగి కొండలరావు, పొందూరు