ఉత్తరాయణం

పెరుగుతున్న యాచకుల సంఖ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ నగరంలో బిచ్చగాళ్ల బెడద ఇటీవలి కాలం లో బాగా ఎక్కువయ్యింది. 2014 గణాంకాలతో పోలిస్తే వీరి సంఖ్య 30 శాతం పెరిగింది. ఒకప్పుడు కడుపు నింపుకోవడానికి మొదలైన భిక్షాటన నేడు ఆదా య వనరుగా మారింది. పొట్టకూటికోసం యాచన చేసే వృద్ధుల జాబితాలో యువతీయువకులు కూడా చేరిపోతున్నారు. రకరకాల కారణాలు, క్రొత్త వేషాలతో భిక్షాటనకు దిగుతున్నా రు. నిత్యం రద్దీగా వుండే బెంజిసర్కిల్, లబ్బీపేట, బీసెంట్‌రోడ్, రైల్వేస్టేషన్, లెనిన్ సెంటర్, బస్టాండ్ ప్రాంతాలలో సంచరిస్తూ ప్రజలను ఇబ్బందిపెడుతున్నారు. కొందరు ఘరానా వ్యక్తులు బిచ్చగాళ్ళతో యూనియన్లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. వీరు ప్రజల చుట్టూ తిరుగుతూ చిల్లర వేస్తే తప్ప వదలడం లేదు. నిత్యం రద్దీగా వుండే కూడళ్లలో వాహనాలకు అడ్డంపడుతూ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారు. వీరివల్ల ప్రయాణికులు, పాదచారులు, వాహన చోదకులు నానా ఇబ్బందులు పడుతున్నారు.వీరందికీ కౌన్సిలింగ్ నిర్వహించి వృద్ధులను వృద్ధాశ్రమాలకు తరలించి, యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించితే వీరికే కాకుండా మొత్తం సమాజానికి మేలుచేసినవారవుతారు.
- సి.సాయిమనస్విత, విజయవాడ

పాఠశాలల్లో ‘యోగా’ ప్రవేశపెట్టాలి
ప్రపంచవ్యాప్తంగా ‘యోగా’కు పెరుగుతున్న ప్రాధాన్యత దృష్ట్యా అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో యోగా కోర్సులను ప్రవేశపెట్టేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యం, విలువలతో కూడిన యోగావల్లనే సాధ్యమవుతుంది. కేంద్ర ప్రభుత్వం ‘యోగా’ అంశంపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కోర్సులను ప్రవేశపెడితే అవసరమైన నిధులను పొందేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయి. ఈ కోర్సులను బోధించేందుకు పార్ట్‌టైమ్ విధానంలో అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులను నియమించుకోవచ్చు. యోగాలో ఆంధ్ర విశ్వవిద్యాలయం, బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం, మరికొన్ని విద్యాసంస్థలు డిప్లమో, సర్ట్ఫికెట్ కోర్సులు నిర్వహిస్తున్నాయి. ఎందరో అభ్యర్థులు శిక్షణ పొంది ఉన్నారు. అంచేత ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో యోగా కోర్సులను ప్రవేశపెట్టాలి. అవసరమైన సిలబస్‌ను రూపొందించి కార్యాచరణకు శ్రీకారం చుట్టాలి.
- వి.కొండలరావు, పొందూరు

ఆంధ్ర పట్ల ఎందుకింత అలసత్వం?
అడ్డగోలు విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించడంలో, విభజన చట్టంలోని వివిధ హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర అలసత్వం ప్రదర్శించడం దురదృష్టకరం. పోలవరంకు జాతీయ హోదా, విశాఖకు రైల్వేజోన్, పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల ఊసే ప్రభుత్వం ఎత్తడం లేదు. ఇటీవలి కాలంలో తుఫానులు, కరువు, దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రకటించిన సాయం ఇంతవరకు విడుదల చేయలేదు. విభజన నాటికి ఇరవైవేల కోట్ల లోటు బడ్జెట్‌తో వున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారిపోతుంటే ఆదుకోవాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం బాధాకరం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో కూడా రాష్ట్ర పాలకులు ఘోరంగా విఫలమయ్యారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. అయిదేళ్ళలో రాజధాని నిర్మాణం పూర్తవవల్సి వుండగా నిధులు విడుదల విషయంలో కేంద్రం తీవ్ర జాప్యం చేస్తోంది. ఆంధ్ర విషయంలో కేంద్ర పాలకులు చెప్పేదొకటి చేసేది మరొకటిగా ఉంటోంది. అమలుకు నోచని హామీలు ఎన్ని ఇచ్చినా ప్రయోజనం శూన్యం. కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రంలో వౌలిక వసతులు, రాజధాని నిర్మాణం, ఇతరత్రా అభివృద్ధి పనులకు పెద్ద మొత్తంలో నిధులు అవ సరం. కేంద్రం ఇప్పటికైనా కళ్లు తెరవాలి.
- ఎం.కనకదుర్గ, తెనాలి

ఒక్క తాటిపై హిందువులు
1) భరతమాతకు బిడ్డలై వరలుచుండి
శత్రువులకు సాయమ్ముసల్పబూని
దేశభక్తిని విడనాడి తీవ్రమైన
నినదములు చేయతగునయ్య నీచులట్లు
2) స్వేచ్చకలదంచు వాగుట సిగ్గుచేటు
అట్టివారికి వంతగా నరచువారు
కోలుపోయి విచక్షణల్ కుజనులౌచు
మంచిపై చెడ్డ గెలువంగ నెంచెనిపుడు
3) విశ్వవిద్యాలయాలలో వింతయనగ
విద్యనేర్చుట విడచింతాముద్యమాల
బాట పట్టుట చూడగా భరతమందు
రాజకీయాలు చొరబడి రాక్షసముగ
4) దేశమును చీల్చుశక్తులు తెగువతోడ
నంత మొందింప హిందువుల్ పంతమూని
ఒక్క పథమున నడువగా ఉగ్రవాద
మద్దతిచ్చెడు వారెల్ల మరుగుపడరె!
- కరణం రాజేశ్వరరావు, హిందూపురం