ఉత్తరాయణం

కూరలకు రంగులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మామిడి పళ్ళు, అరటి పళ్ళు, యాపిల్స్ మొదలైన వాటిని కృత్రిమ విషపు రసాయనాలలో కలిపి రంగుమార్చి వ్యాపారం చేసుకునే అవినీతిమంతుల బాగోతం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. కాయగూరలను కూడా రసాయనిక ద్రావకాలలో కడిగితే అవి నవ నవలాడుతూ అప్పుడే కోసినట్లు అనిపిస్తాయి. అసలే కాయగూరల మొక్కలకు చీడపట్టకుండా చల్లే మందులవల్ల అవి పెరిగేటప్పుడే విష పూరితవౌతున్నాయి. ఇప్పుడే కలరింగ్‌తో మరింత కలుషితమైపోతే రోగాలు రాకుండా ఉంటాయా? రెండు తెలుగు రాష్ట్రాల్లో జీవిత పరిమాణం చాలా తక్కువవుతున్నది ఓ రిపోర్టు. సినిమా హాళ్ళకంటే ఆసుపత్రులు బాగా రద్దీగా ఉంటున్నాయి. రోగాలు తగ్గకపోయినా ఆస్తులు కరిగిపోతున్నాయి. శుభ్రత లోపించడంవల్ల కొన్ని మిఠాయి దుకాణాలను మూయించిన ప్రభుత్వం కల్తీరాయుళ్ళను గుర్తించి కఠిన శిక్షలు వేయాలి.
-ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్

హద్దుమీరవద్దు
అనేక వేడుకలు, ఉత్సవాల సందర్భంగా పెద్దఎత్తున బీభత్సాన్ని సృష్టిస్తూ బాణాసంచా కాల్చడం పరిపాటి అయింది. తీవ్రమైన శబ్దకాలుష్యాన్ని సృష్టిస్తూ హార్ట్‌పేషెంట్లను, విశ్రాంతి తీసుకుంటున్న పసిపిల్లలు,. వృద్ధులను ఇబ్బంది పెట్టడమేగాక భారీగా ధన వ్యయం, వాతావరణ కాలుష్యం, పర్యావరణానికి హాని కలుగుతాయి. సంబరాలు అవసరమే. అవి భవిష్యత్‌లో మధుర జ్ఞాపకాలుగా మిగులుతాయి. అయితే పరిమితికి లోబడి, ఇతరులను ఇబ్బంది పెట్టకుండా జరుపుకుంటే అందరికీ మంచిది కానీ పరిధులు దాటితే ఊహించని అగ్నిప్రమాదాలు సంభవించి, ఆస్తి నష్టమో, ప్రాణనష్టమో జరిగితే ఆ తరువాత విచారించినా లాభం లేదు. మన వేడుకలు, వినోదాలు, సంబరాలు అందరి మంచికోరి జరుపుకుంటే మరీ మంచిది.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

ఎన్‌కౌంటర్ చట్టవిరుద్ధం
తాడిత పీడిత బీద బిక్కి గిరిజన ఆదివాసులుగా గోండు జాతులను ఆర్థికంగా సామాజికంగా ఎదుగుటకు వారి బాగోగులకోసం పోరాట పంథా ఎన్నుకొని నిరంకుశ పాలకులు చేసే నయవంచనలు ఎండగట్టుట కొరకు తన స్వంత కుటుంబాలు, తల్లిదండ్రులను భార్యపిల్లల బాగోగులు త్యాగంచేసి ఆదివాసుల కష్టాలు తీర్చుటకు నిత్యం అలుపెరగని పోరాటం చేసే విప్లవ పోరాట యోధులను బూటకపు ఎన్‌కౌంటర్లు చేయటం చట్టవిరుద్ధం.
- అర్వపల్లి ఉపేందర్ ముదిరాజ్, కేసముద్రం