ఉత్తరాయణం

ఉగాది ఓ వేదాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ ఉగాదీ!
సంక్రాంతితో సంలీనమై
రమణీయ విరాజితమై
జనావళి గుండెలపై
మానవతా సందేశాల్ని
రంగరించే నీ దృక్పథం
ఎందరికి తెలుసు?
నీ రాగపూర్ణ హృదయాప్యాయతల
ఆరాటం అర్థమయ్యేదెవరికి?
బతికినంతకాలం
ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ
సహజ సౌందర్యంతో
పువ్వుల్లా కాయల్లా
ఉద్వేగ వివశత్వంతో
జీవన గమ్యం చేరుకోమని
హెచ్చరించేదెవరు?
ఓ ఉగాదీ!
సిసలైన ప్రేమతత్వాన్ని
బోధించే వేదాంతి
నువ్వుకాక మరింకెవరు?

- జి.నరసింహమూర్తి, 8977987266

దయానిధి

విరబోసుకున్న కురులతో
సిగ్గుల నిగ్గుల్ని గాలికొదిలేసి
అరకొర దుస్తుల్తో
సిగ్గుల ముగ్గులు వదన వాకిలిలో
తీర్చిదిద్దకుండా
ఆరబోతల నజరానాలందిస్తూ
తెరల మీద కనబడటానికి
సెలబ్రిటీ ముద్దుగుమ్మలకి
వాళ్లననుకరిస్తున్న ముద్దుపట్టిలకి
అభ్యంతరం లేకపోవచ్చేమోగాని
దిగంబర కోయిలకెంత సిగ్గో!
గుబురు గదినుండి బయటికి రాకుండానే
రాగాల విందులు అందిస్తోంది
మరుపు మడుగులో మునిగిపోతామేమోనని
గుర్తుచేయడానికన్నట్లు
వారం రోజుల ముందునుండే
ద్వర్ధి కావ్యం వినిపిస్తున్నట్లు
ఒకవేపు రమ్మని ఆహ్వానం ఉగాదికీ
వచ్చేస్తోంది సిద్ధంకండని మనకీ
అనిపించేలా కుహూకుహూ అంటోంది.
చైత్రలక్ష్మి ఎలా వస్తుందో తెలీదుగాని
ఉదయం కళ్లుతెరిచేసరికి
ఒకే అతివ
అనేక రూపాల్లో గోచరించినట్టు
ఉగాది కూడా అనేక ఆకారాల్లో
కవుల కళ్లకు కనబడ్డానికి
కోయిలల గీతాల స్వాగతాలతో సిద్ధం
ఉగాది కవులకో వరం
అనాదిగా ప్రకృతి ప్రియత్వం
మా కవులకే స్వంతం
పాడు కాలంలో
ఏ అత్యాచారానికీ గురికాకుండా
ఒంటినిండా ఉడుపులు ధరించి
సురక్షితంగా ఏ తెంచిన ఉవిద ఉగాది
ఇది మన తెలుగువాళ్లది.
మన మహాలక్ష్మి ఉగాది
కనులకు, మనసుకు
ఆహ్లాదాన్ని పంచే ఆడది
అందరికీ శుభాలు తెచ్చే దయానిధి.

- మాధవీ సనారా 9440103134

ప్లాస్టిక్‌ను నిషేధించాలి

ప్రధానమంత్రి ప్రారంభించిన స్వచ్ఛ్భారత్ కార్యక్రమం బాగుంది. కానీ చాలామంది ప్రజలు తమ రోజువారి కార్యక్రమాల్లో పాటించడం తక్కువగా ఉంటుంది. ఈమధ్య వేములవాడ, మేడారం, కొమురవెల్లి లాంటి జాతర్లలో ప్లాస్టిక్ నిషేధం గూర్చి సామాజిక మాధ్యమాలు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో బాగానే ప్రచారం చేశాయి. కానీ జాతర్లలో (మేడారం) ప్లాస్టిక్ విపరీతంగా నిండిపోయి దుర్గంధంగా తయారైంది. వ్యక్తిగతంగా ప్లాస్టిక్‌ను వాడకుండా ఉండటమే ధ్యేయం కావాలి. అదే విధంగా ప్రభుత్వాలు కూడా ప్లాస్టిక్ కవర్స్ తయారీ పరిశ్రమల స్థానంలో జ్యూట్, సహజ సంచుల తయారీ నెలకొల్పాలి. లేకపోతే కాలుష్యం పెరిగి భూగోళం వేడెక్కడం, నీటి నిలువలు తగ్గడం జరుగుతున్నది. ఇప్పుడే ఎండలు ఈ విధంగా వుంటే మేలో బయటికే వెళ్ళలేని పరిస్థితిగా ఉంటుంది. దానంతటికి ఒక్కటే మార్గం. ప్లాస్టిక్‌ను నిషేధించడం, మొక్కలు పెంచడం. ఇంతకీ ప్లాస్టిక్ ఎందుకు ఇంత ప్రమాదకరమైనదంటే, భూమిలో కలిసిపోదు. ఎంతకాలమైనా అదేవిధంగా ఉండిపోతుంది. దీనివల్ల చెత్త బాగా పేరుకొని పోయ పలు రోగాలకు కారణమవుతుంది.

- కొత్తపల్లి పోషన్న, ములుగు