జాతీయ వార్తలు

ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూదిల్లి:ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన విధించారు. ఈ మేరకు కేంద్రమంత్రివర్గ సిఫారసుపై రాష్టప్రతి ప్రణభ్‌ముఖర్జి ఆమోదముద్ర వేశారు. ఉత్తరాఖండ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దిరోజులుగా సమస్యలు ఎదుర్కొంటోంది. ముఖ్యమంత్రి హరీష్‌రావత్ వైఖరి నచ్చని 9మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో అక్కడ రాజకీయ అనిశ్ఛితి నెలకొంది. ఆ ఎమ్మెల్యేలను ఫిరాయింపుచట్టం ప్రకారం అనర్హులుగా ప్రకటించేందుకు స్పీకర్ నిర్ణయించడం, బిజెపి మద్దతుతో ఇదంతా జరుగుతోందని కాంగ్రెస్ ఆరోపించడం, తమపై చర్య తీసుకోవద్దని తిరుగుబాటు ఎమ్మెల్యేల వినతిని హైకోర్టు తోసిపుచ్చడం వంటి పరిణామాల నేపథ్యంలో అక్కడ రాజకీయ అనిశ్ఛితి నెలకొంది. ఈ నేపథ్యంలో శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి రాష్టప్రతి పాలన విధించారు.