యువ

సరిహద్దులకు వెళ్ళి.. జవాన్లతో ముచ్చటించి...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొమ్మిదేళ్ల బుడతడు సరిహద్దుల్ని సందర్శించాడు. భారత జవాన్లతో స్వయంగా మాట్లాడాడు. దేశ రక్షణకోసం వారు పడుతున్న శ్రమను కళ్లారా వీక్షించాడు. ఎవరికోగాని దక్కని ఈ అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకున్న ఆ చిన్నారి పేరు రవికర్‌రెడ్డి. హైదరాబాద్‌కు చెందిన ఈ కుర్రాడికి చిన్నప్పటినుంచీ తల్లి భారత జవాన్ల గురించీ, వారి త్యాగాల గురించీ కథలు కథలుగా చెప్పేదట. అవన్నీ వింటూ స్ఫూర్తినొందిన రవికర్ సరిహద్దులకు వెళ్లి జవాన్లతో మాట్లాడాలని కలలు గనేవాడు. అతని ఆసక్తిని గమనించిన తల్లి దేశానికి సేవ చేస్తున్న వీర జవాన్లను ఉద్దేశించి బిఎస్‌ఎఫ్‌కు ఓ ఉత్తరం రాయమంటూ సలహా ఇచ్చి, బిఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఇమెయిల్ ఐడీ సంపాదించి ఇచ్చిందట.
వెంటనే రవికర్ జవాన్ల త్యాగ నిరతిని ప్రశంసిస్తూ బిఎస్‌ఎఫ్ కెకె శర్మకు మెయిల్ పంపాడట. నిజానికి తానేమీ జవాబును ఆశించలేదని, అయితే పదిహేను రోజుల తర్వాత నేషనల్ పోలీస్ అకాడెమీ (హైదరాబాద్)నుంచి ఓ జవాన్ మా అడ్రస్ వెతుక్కుంటూ వచ్చాడని రవికర్ చెప్పాడు. సరిహద్దులకు నన్ను తీసుకువెళ్లేందుకు బిఎస్‌ఎఫ్ డిజి ఆదేశాలు జారీ చేశారని, అందులో భాగంగా తాను వచ్చినట్టు ఆ జవాన్ చెప్పాడని రవికర్ అన్నాడు. ఇంకేముంది...మన బుడతడు పెట్టేబేడా సర్దుకుని, తల్లితో కలసి జై సల్మేర్ బయల్దేరాడు. అక్కడ తనను చూసి జవాన్లు ఎంతో ఆశ్చర్య పోయారని, బిఎస్‌ఎఫ్ డిఐజి అమిత్ లోధా తనను మీడియాకు పరిచయం చేశారని ఎంతో సంతోషంగా చెప్పాడు రవికర్. తనకు హిందీ రాకపోవడంతో ఓ ట్రాన్స్‌లేటర్‌ను కూడా ఏర్పాటు చేశారట.
అక్కడి జవాన్లు తనకు జైసల్మేర్‌లోని చారిత్రక ప్రదేశాలను, ఆయుధగారాలను చూపించారని వివరించాడు. జై సల్మేర్‌లో ఎండవేడిమిని తాను భరించలేకపోయానని, అయితే జవాన్లు తన గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పాడు. భారత-పాకిస్తాన్ మధ్య 1971లో యుద్ధం జరిగిన ది బ్యాటిల్ ఆఫ్ లాంగేవాలా ప్రాంతాన్నీ, టన్నోట్ మాత దేవాలయాన్ని రవికర్‌కు బిఎస్‌ఎఫ్ జవాన్లు చూపించారట. పాకిస్తాన్ సరిహద్దులకు కేవలం 150 మీటర్ల దూరంలో ఉండే బాబ్లియాన్, మురార్ ప్రాంతాలను కూడా చూశానన్నాడు రవికర్. మురార్‌లో మన జవాన్లకు తగిన వసతులు కూడా లేవని, తాగేందుకు నీళ్లు కాని, కరెంటు కానీ లేని ప్రాంతంలో వారు సరిహద్దుల రక్షణకోసం అహోరాత్రులూ కష్టపడుతున్నారంటూ జవాన్ల త్యాగనిరతిని శ్లాఘించాడు రవికర్.