యువ

హ్యాండ్స్ ఫ్రీ స్మార్ట్ఫోన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేతిలో స్మార్ట్ఫోన్ ఉంటే, ప్రపంచం మీ కళ్ల ముందున్నట్టే. స్మార్ట్ఫోన్‌తో చేయలేనిదంటూ లేదు. అయితే చీటికీ మాటికీ స్మార్ట్ఫోన్ ఆపరేట్ చేయడం చిరాకనుకునే వారికోసం ఇప్పుడు వేరబుల్ స్మార్ట్ఫోన్ హ్యాండ్స్ ఫ్రీ గాడ్జెట్ ఒకటి మార్కెట్లోకి వచ్చింది. దీని పేరు పిన్ వేరబుల్ స్మార్ట్ఫోన్ హ్యాండ్స్ ఫ్రీ డివైస్. పేరులోనే ఉన్నట్టు ఈ పరికరం మనవెంట ఉంటే స్మార్ట్ఫోన్‌ను జేబులోంచి తీయక్కర్లేదు. ఈ డివైస్‌ను జేబుకు తగిలించుకోవచ్చు. అలాగే దీంతోపాటు వచ్చే ఇయర్‌బడ్‌ను చెవిలో తగిలించుకుంటే చాలు..ఇక ఇన్‌కమింగ్ కాల్స్, కాలర్ ఐడీ చెకింగ్, మెసేజ్‌లు పంపడం వంటివన్నీ స్మార్ట్ఫోన్‌ను బయటకు తీయకుండానే చేసేయొచ్చు. ఇందులో ఉండే బిల్టిన్ స్పీకర్‌ఫోన్‌లో మాట్లాడొచ్చు లేదా మ్యూజిక్ వినొచ్చు. నేరుగా సెల్ఫీలు తీసుకునేందుకు ఈ డివైస్‌లో ఓ రిమోట్ షట్టర్ బటన్ కూడా ఉండటం మరో విశేషం.