గుంటూరు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి సమగ్ర కార్యాచరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి
గుంటూరు, నవంబర్ 20: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల విద్యాభివృద్ధికి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి, సమగ్రమైన కార్యాచరణకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పాఠశాలల విద్యాశాఖ కమిషనర్ కె సంధ్యారాణి అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన జోనల్‌స్థాయి పాఠశాల విద్యాప్రాంతీయ సమీక్షా సమావేశం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన అధికారిణి సంధ్యారాణి మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధికి అధికారులు, ఉపాధ్యాయులు కలిసికట్టుగా కృషిచేసి విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు తీర్చిదిద్దేవిధంగా కృషి చేయాలన్నారు. విద్యారంగంలో గురువుల పాత్ర కీలకమని, అయితే ప్రాథమిక స్థాయిలో ప్రధాన ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం, రా ష్టస్థ్రాయి అధికారుల పాత్ర ప్రధానమైందన్నారు. రాష్ట్రంలో 91 శాఖలకు సంబంధించి ప్రతిశాఖ పనితీరును కేంద్రప్రభుత్వానికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నివేదిక రూపంలో పంపుతుందన్నారు. అందులో విద్యాశాఖకు సంబంధించి 77 అంశాలపై ఆధారపడి పనితీరును అధ్యయనం చేస్తున్నారన్నారు. వాటిలో 62 అంశాలు వార్షిక పనితీరుకు సంబంధించి ఉన్నట్లు తెలిపారు. ప్రతి ఉపాధ్యాయుని పనితీరుపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతుందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న విధానాలకు అనుకూలంగా ఉపాధ్యాయులు పనిచేసి విద్యారంగ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ మాట్లాడు తూ జిల్లాలో ప్రాథమికస్థాయి నుండి ఉన్నతస్థాయి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుకు అధికారులు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా అక్షరాస్యతకు ప్రాధాన్యమిచ్చి ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు. 2015 మార్చిలో జరిగిన పదవ తరగతి పరీక్షల్లో గుంటూరు జిల్లా 4వ స్థానంలో ఉందన్నారు. ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలు 8,10,11 స్థానాల్లో ఉన్నాయన్నారు. అక్షరాస్యత విషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 31వ స్థానంలో ఉందన్నారు. దీనిని అధికారులు గుర్తించి పిల్లలకు ఉపాధ్యాయులచే విద్యాబోధన అందజేసి మొదటిస్థానానికి వచ్చేవిధంగా కృషి చేయాలన్నారు. విద్యారంగ అభివృద్ధికి ప్రాథమిక విద్యే పునాధి అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినీ, విద్యార్థులకు వౌళిక సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తున్న విషయంపై కూడా అధికారులు వివరాలు అందజేయాలన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి కెవి శ్రీనివాసులురెడ్డి తూర్పు గోదావరి జిల్లాలో పనిచేస్తున్న సమయంలో ఓపెన్ ప్రోగ్రెస్ విధానాన్ని రూపొందించడంలో చూపిన చొరవకు జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న సందర్భంగా ఎమ్మెల్సీ రామకృష్ణ అధికారిని సన్మానించారు. విద్యాశాఖలో వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించిన కమిషనర్ సంధ్యారాణిని కూడా ఈ సందర్భంగా సన్మానించారు. రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారి రమేష్‌కుమార్, ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి రామలింగం, మూడు జిల్లాలకు చెందిన ఉప విద్యాశాఖ అధికారులు, సహాయ సంచాలకులు పాల్గొన్నారు.

దొంగ అరెస్ట్:పది మోపెడ్‌ల స్వాధీనం
నరసరావుపేట, నవంబర్ 20: డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో టీవీఎస్ ఎక్స్‌ఎల్ మోపెడ్స్‌ను దొంగిలించిన కనికుట్ల అంకమ్మరావును రూరల్ సిఐ ప్రభాకర్ ఆదేశాల మేరకు ఎస్‌ఐ సురేంద్రబాబు గురువారం సాయంత్రం అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ కె నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం స్థానిక రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పీ కె నాగేశ్వరరావు మాట్లాడుతూ నరసరావుపేట మండలం పాలపాడు గ్రామానికి చెందిన కనికుట్ల అంకమ్మరావు నరసరావుపేట డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో పది టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనాలను దొంగతనం చేశాడని తెలిపారు. ఇతనిపై గతంలో కేసులు ఉన్నాయని, పలుచోట్ల వాహనాలు దొంగతనానికి గురయ్యాయని, దీనికి సంబంధించిన పాత నేరస్థుడు అంకమ్మరావుపై నిఘా ఉంచామని తెలిపారు. అంకమ్మరావు దొంగిలించిన పది వాహనాలను తన గృహంలోనే ఉంచి, విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా తాము దాడిచేసి అంకమ్మరావును పట్టుకున్నామని తెలిపారు. నరసరావుపేట రూరల్ స్టేషన్ పరిధిలో నాలుగు మోపెడ్‌లు, వన్‌టౌన్ పరిధిలో ఒకటి, వినుకొండలో రెండు, కారంపూడిలో రెండు, దుర్గిలో ఒక వాహనాన్ని దొంగతనం చేశాడని తెలిపారు. క్రైం పార్టీబృందం అంకమ్మరావును పట్టుకోవడంలో కీలకపాత్ర వహించిందని తెలిపారు. సిఐ ప్రభాకర్, ఎస్‌ఐ సురేంద్రబాబు క్రైం పార్టీ సభ్యులకు రివార్డులను అందచేస్తామని డిఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు.