విజయవాడ

ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 15: ఏపీఎస్ ఆర్టీసీలో నష్టాల పేరుతో బస్సులు తొలగింపు కారణంగా ఏడాది కిందట తొలగించిన కాంట్రాక్టు కండక్టర్లు 300,డ్రైవర్లు 650 మందిని వెంటనే విధుల్లోకి తీసుకుని వారందరినీ వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ యాజమాన్యానికి లేఖ ఇచ్చామని ఎపీఎస్ ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు, ప్రధాన కార్యదర్శి కే పద్మాకర్, అదనపు ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీలో గతంలో ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ గుర్తింపు కాలంలో ఇచ్చిన సమ్మె నోటీసుపై ప్రభుత్వం స్పందించి 2013, డిసెంబర్ 31 నాటికి సంస్థలో రెగ్యులర్ ఉద్యోగాల ఖాళీల్లో నియమించబడి ఉన్న 9,920 మంది కండక్టర్లను, 14,657 మంది డ్రైవర్లను మొత్తం 24,577 మందిని రెగ్యులర్ టైమ్ స్కేల్‌లో నియమించాలని ప్రభుత్వం జీవోను 2014,జనవరి 1న ఆదేశాలు ఇచ్చినప్పటికీ 2012, డిసెంబర్ 31 వరకు నియమించబడి ఉన్న 17,272 మంది కాంట్రాక్టు కండక్టర్, డ్రైవర్లను దశలవారీగా క్రమబద్ధీకరించి మిగిలిన వారిని రెగ్యులర్ చేయలేదు. వారిని ఉన్న ఉద్యోగాల నుండి తొలగించి వారి జీవితాలను రోడ్డున పడేశారని, తొలగించిన 950 మంది కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే తీసుకోవాలని విజ్ఞప్తి చేయగా యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని ఇయు నాయకులు పలిశెట్టి దామోదరరావు తెలిపారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు అందిరితో కలిసి 2013, ఆగస్టు 13 నుండి 2013, అక్టోబర్ 11వరకు జరిగిన నిరవధిక సమ్మెలో ఆర్టీసీలో పని చేస్తున్న 55,340 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 8,735మంది కాంట్రాక్టు కండక్టర్లు, డ్రైవర్లు ఈ సమ్మెలో పాల్గొనగా సమ్మె విరమణ సందర్భంగా ఈ సమ్మె కాలానికి స్పెషల్ క్యాజువల్ లీవును ఇస్తామని రాతపూర్వకంగా ఇచ్చిన హామీని అమలు చేయలేదని, మరలా ప్రస్తుత ప్రభుత్వం కూడా మరొక జీవో ఇచ్చి అమలు చేయమన్నా 60 రోజుల స్పెషల్ క్యాజువల్ లీవు ఇవ్వకుండా జాప్యం చేయడం తగదని యాజమాన్యానికి లేఖ ఇచ్చామని త్వరలోనే సమ్మె కాలం 60 రోజులకు స్పెషల్ క్యాజువల్ లీవు ఇస్తామని సానుకూలంగా స్పందించాలని ఇయు రాష్ట్ర నాయకులు కే పద్మాకర్, పలిశెట్టి దామోదరరావు తెలిపారు. దీని వలన ప్రస్తుతం రిటైర్ అయిన ఉద్యోగులకు రూ. 50 కోట్లు అవసరం అవుతుందని, ఇంకా సర్వీసులో ఉన్న ఉద్యోగులకు లీవు కార్డులో నమోదు చేసి వారు రిటైర్ అయినప్పుడు చెల్లించేందుకు మరో రూ. 270 కోట్లు అవుతుందని యాజమాన్యం తెలిపినట్లు వారు తెలిపారు.