Others

వేదమూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్ర్తిలకు స్వేచ్ఛను ఇవ్వలేదని చాలామంది ఆరోపణలు చేస్తూ వుంటారు. విద్యార్థుల పాఠశాల చదువుల్లో, ఐఎఎస్ అభ్యర్థులకు, ఇతర ఉద్యోగార్థులకు నిర్వహించే పరీక్షల్లో ఉండే చరిత్రలో కూడా ఇదే వాదన కన్పిస్తుంది. ఇక తమను తాము సంఘ సంస్కర్తలమనీ, అభ్యుదయవాదులమనీ చెప్పుకొనే కొందరు కుహనా మేధావులు ఈ విషయంలో వైదిక సంస్కృతిపై దుమ్మెత్తి పోస్తుంటారు. అసలు వేదాలు స్ర్తిల గురించి ఏమన్నాయో కొన్ని విషయాలు చూద్దాము.
స్ర్తిలు ధైర్యవంతులుగా ఉండాలని యజుర్వేదం, స్ర్తిలు మంచి కీర్తిని గడించాలని అధర్వణవేదం, స్ర్తిలు పండితులవ్వాలని.. స్ర్తిలు కూడా విద్యాబోధన చేయాలని, స్ర్తిలు అందరినీ జ్ఞానవంతుల్ని చేయాలని, స్ర్తి ఎప్పుడూ సంపదలతో సుఖంగా వుండాలని, స్ర్తిలు ఎపుడూ జ్ఞానవంతులై, తెలివిగలవారై వుండాలి. పరిపాలనకు సంబంధించిన సభలు, సమావేశాల్లో స్ర్తిలు కూడా పాల్గొనాలి. అదే అధర్వణ వేదంలో స్పష్టంగా చెప్పబడింది. ఋగ్వేదంలో స్ర్తిలు దేశ పరిపాలన, సామాజిక సంస్కరణలు, ప్రభుత్వ కార్యకలాపాలు ముందుండి నడిపించాలని చెప్పడం జరిగింది. ఈ రోజు క్కూడా ప్రపంచంలో స్ర్తిలు పైకి రాకుండా అణచివేస్తున్నారన్నది అక్షర సత్యం. కాని వేదం ఎంతో స్పష్టంగా స్ర్తిల నాయకత్వం గురించి వివరించింది.
ఋగ్వేదంలో స్ర్తిలకు తండ్రి కూడబెట్టిన ఆస్తిలో కుమారులతోపాటు కుమార్తెలకు కూడా సమానమైన హక్కు ఉందని చెప్పబడింది. అధ్వరణ వేదంలో కుటుంబానికి, సమాజానికి స్ర్తి రక్షకురాలిగా వ్యవహరించాలి. స్ర్తి సంపదను, ఆహారాన్ని అందించాలి. శ్రేయస్సును కల్గించేదై వుండాలి. స్ర్తికి సంపాదన వున్నపుడే కదా ఆమె కుటుంబానికి సంపద చేకూర్చగల్గుతుంది. భర్తకు సంపాదించే మార్గాలు చూపించాలని స్పష్టంగా చెప్పబడింది.
యజుర్వేదంలో స్ర్తిలు యుద్ధంలో పాల్గొనాలని చెప్పబడింది. ఈ విషయంలో దుర్గాదేవి స్ర్తిలకు ఆదర్శం. స్ర్తిలు బయటకు రాకూడదని వైదిక ధర్మం చెప్పిందంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కాని వేదం స్ర్తిలను యుద్ధంలో కూడా పాల్గొనవలసిందగా చెప్పబడింది. కైకేయి దీనికి ఉదాహరణ కదా! శ్రీరామాయణంలో కైకేయి అడిగిన వరంవల్లనే శ్రీరాముడు వనవాసానికి వెళతాడు. దశరథుడితో కలిసి శత్రువులపై యద్ధం చేసిన సమయంలో, ఆమె పరాక్రమం చూసి ఆమెను వరం కోరుకోమనగా, సమయం వచ్చినపుడు అడుగుతానంటుంది. ఇతిహాసంలో అదే పెద్ద ఉదాహరణ.
ఋగ్వేదంలో కమాండర్ తరహాలో స్ర్తి సభలను ఉద్దేశించి ప్రసంగించాలని చెప్పబడింది. ఓ స్ర్తిలారా! పురుషులతో సమానంగానే మీకు ఈ మంత్రాలు ఇవ్వబడ్డాయి. మీ భావాల్లో సామరస్యం వుండుగాక, మీరు ఎటువంటి వివక్ష చూపక, అందరికీ జ్ఞానాన్ని పంచుదురుగాక! మీ మనసు, చైతన్యం సమన్వయంతో పనిచేయాలి. నేను ఋషిపురుషులతో సమానంగా మీకు ఈ మంత్రాలను ఇవ్వడమేగాక, వీటిని అర్థం చేసుకునే శక్తిని మీకు ప్రసాదిస్తున్నాను. వేదాల్లోనే మైత్రేయి, గార్గి, లోపాముద్ర వంటి దాదాపు ముప్పదికి పైగా మంత్రద్రష్టలైన స్ర్తి ఋషుల గురించి చెప్పబడింది. ఒక్క హిందూ ధర్మంలో తప్ప మరే ఇతర మతంలోనూ స్ర్తి దేవతలు వుండరు. అన్యమతాల్లో ఎక్కడా కూడా స్ర్తిలకు భగవంతుడు తన దివ్య సందేశమిచ్చినట్లు లేదు. అధ్వర్యణ వేదంలో ముందు విద్యను పొందండి, ఆ తర్వాతే వివాహం చేసుకోండని స్ర్తిలకు భగవంతుడు నిర్దేశించాడు. ‘‘ఓ వధువా! వైదిక జ్ఞానం నీకు అన్ని దిశల నుండి కలగాలి. వేదాల్లో ఉన్న జ్ఞానం పొందిన తర్వాతే నీవు జీవితానికి సంబంధించిన విషయాలమీద నిర్ణయం తీసుకో. నీవు మంచి కీర్తిని గడించి, నీకు భర్తకు శుభాలను కల్గుజేసేదానివిగా ఉండు. నీ అత్తారింట్లో గౌరవమైన జీవితం గడుపు. నీ జ్ఞానంతో వారింటిని వృద్ధిపరచు అని ఆ భగవంతుడు మన వేదాల్లో స్ర్తిల గురించి స్పష్టంగా చెప్పాడు.
వేదాలు ఆ భగవంతుడు మనకు ఇచ్చిన గొప్ప వరాలు. ఆ వేదాలను చదివి, వ్రాసి మనకందించిన మన మహాత్ములు మనకు దైవాలతో సమానం. మన హిందూ ధర్మ సాంప్రదాయాలలు అమూల్యం. వాటిని కాపాడుకోవడం మన ధర్మం. పాశ్చాత్య దేశాలు సైతం మన సాంప్రదాయాలను, ఆచారాలను పాటిస్తున్నారంటే అదే మనం చేసుకొన్న అదృష్టం.
అద్భుతాలకు, అసమానమైన చరిత్రకు మన భారతావని ఆలవాలం. ఈ వేదభూమిలో అన్నీ అద్భుతాలే. ఈ కర్మభూమి ఎందరో మహాత్ములకు పుట్టిల్లు. నాడు ఆర్యభట్టు, వరాహమిహిరుడు, చరకుడు లాంటి మహాత్ములు మనకందించిన విజ్ఞానం ఎంతని చెప్పగలము. వెలకట్టలేము. ఎలాంటి సాంకేతికత లేని వేళలోనే అద్భుతమైన విద్యా విజ్ఞానాన్ని మనకందించారు. అలాగే మన మహర్షులు అందించిన ‘యోగ’ ఈ నేలపై ఆవిర్భవించింది...
నేడు యావత్ ప్రపంచం మన మహర్షులు చూపిన దారిలో నడుస్తున్నారన్నది.. జగమెరిన సత్యమే కదా! ఈ జన్మ సార్థకత నెరవేరాలంటే.. మన మహాత్ములు చూపిన మంచి మార్గానే పయనించాలి. ప్రతి జీవిలో ఆ పరమాత్ముని చూసే తత్వం మనది. పాప పుణ్యాలు, కర్మఫలాలు అన్నీ ఆ భగవంతుని కనుసన్నల్లో జరుగుతూనే వుంటాయి. ‘పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లు’ పాపాత్ములు పాపాలు చేస్తుంటారు. కాని వారి పాపం పండిన రోజు వారి మరణం మానవ మాత్రులం మనకర్థం కాదు. ఆ భగవంతుడు తప్పక శిక్ష విధిస్తాడు తప్పదు. అందుకే ఈ జన్మనిచ్చిన ఆ దేవదేవవునికి సదా హృదయ పూర్వక నమస్సులు అందజేద్దాం. ఈ జన్మకు ఓ అర్థం పరమార్థం చేకూర్చుకొందాం.
..................................................

మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

-కురువ శ్రీనివాసులు