Others

ఆమె నవ్వింది (గోరాశాస్ర్తి గారి రేడియో నాటిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తండ్రి: అమ్మాయ్! వాసంతి ఇంకా కొంప చేరుకోలేదూ?
వై: లేదు నాన్నా! నేనూ అదే చూస్తున్నాను.
తండ్రి: టైము ఎనిమిది దాటిందే! ఎక్కడికి వెళ్ళింది?
వై: ఎవరో స్నేహితురాలి ఇంటికి వెళ్లొస్తానని వెళ్లింది.
తండ్రి: ఊ, ఈ వరసేం బాగులేదు. నాకేం నచ్చలేదు సుమా! ఈడొచ్చిన పిల్ల అర్ధరాత్రి దాకా రుూ షికార్లేమిటి?
వై: వచ్చేస్తుంది నాన్నా! ఈలోపుగా పోనీ మనం భోజనాలు చేస్తూ ఉందాం.
(అక్కయ్యా అక్కయ్యా అని.. వాసంతి)
అదిగో వచ్చేసింది...
వా: (ప్రవేశిస్తూ) అక్కయ్యోయ్! మంచి గమ్మత్తు జరిగిందే, చెప్పనా?
తండ్రి: ఏడిశావ్, ఇంత రాత్రిదాకా ఎక్కడ తిరుగుతున్నావ్?
వా: లలితగారింటికెళ్లాను నాన్నా!
తండ్రి: అక్కడినుంచి రుూ రాత్రిపూట ఒక్కర్తెవే వచ్చావా- తోడు లేకుండా?
వై: కాస్త త్వరగా వచ్చెయ్యవలసింది వాసంతీ! ఈ రోజుల్లో రాత్రిపూట ఒంటరిగా తిరగడం మంచిదికాదు. అన్ని వేళలా సాహసం పనికిరాదు చూడు!
వా: అబ్బ! వినిపించుకోరేమిటే- గొడవ. ఒక్కర్తినే రాలేదు నాన్న! ఒక పెద్దమనిషి నన్ను దిగబెట్టాడు.
తండ్రి: ఎవరా పెద్దమనిషి?
వా: అంటే అంత పెద్దవాడు కాదులే, కుర్రాడే.
తండ్రి: ఎవడు వాడసలు?
వాసంతి: (చిరాగ్గా) ఎవడంటే ఏం చెప్పను నాన్నా! ఎవడో కుర్రాడు, బస్సు స్టాండు దగ్గిర కనబడ్డాడు. నువ్వు ఫలానా వారి అమ్మాయివి కాదా అన్నాడు. అవునన్నాను. నువ్వు తెలుసట నాన్నా అతనికి! ఇంటిదాకా వచ్చి దిగబెడతానని కూడా వచ్చాడు
తండ్రి: పేరు?
వా: ఎవరో సూర్యారావుట!
తండ్రి: నాకు తెలిసినవాళ్ళలో సూర్యారావు అనే పేరు ఎవ్వడికీ లేదు వీడెవడో దొంగ, తుంటరి వెధవ.
వై: అంత ముక్కూ మొహం ఎరుగని పరాయి మొగాడిని వెంటపడనివ్వడం ఏం బాగాలేదు వాసంతీ!
వా: ఆ మాటకొస్తే నాకందరూ మొగాళ్లూ పరాయివాళ్లే కదా! బాగుంది మీ వరస! ముందేమో ఒంటరిగా వచ్చానని కోప్పడ్డారు, ఇప్పుడేమో ఎవర్నో తోడు తీసుకొచ్చానని కోప్పడుతున్నారు. ఈ పెద్దవాళ్ల లాజిక్కేమిటో నాకర్థం కాదు.
తండ్రి: ఏడిశావ్- నువ్వు నీ లాజిక్కూను. ఇంకెప్పుడూ ఇలాంటి వేషాలెయ్యకు. లెంపకాయలు తినిపోగలవు.
వై: కాస్త ముందూ వెనకా చూసుకుని మరీ ప్రవర్తించాలి వాసంతీ! సరేలే! ముందు భోజనానికి పద. తరువాత మాటాడదాం
***
సూర్యారావు: (లలరీ - లలరీ.. అనే పాట పాడుకుంటూ రుూల వేసుకుంటూ) క్షమించండి మేడమ్! మీరు ఏ బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు?
వై: ఎవరు మీరు? మీరెవరో నాకు తెలీదు. నేనెక్కడికెళితే మీకేం?
సూర్య: అఫ్‌కోర్స్, అఫ్‌కోర్స్, శుద్ధ అనవసరం అనుకోండి. అయినా అడిగాను ఊరికేనే. నేను మీకు తెలియకపోయినా మీరు నాకు తెలుసు. మీ ఫాదర్ నాకు బాగా తెలుసు. పురుషోత్తమరావుగారు. మీ పేరు వైదేహి కదూ?
వై: మర్యాదగా మీ పని మీరు చూసుకోండి.
సూర్య: అహఁ! ఎంత మాట, నా పనుల్లో యిదొకటిలెండి మాటాడరేం వైదేహిగారూ! అరె! బస్సు ఎక్కేయండి పోనీ! రోజూ యిక్కడేగా మీరు బస్సు ఎక్కుతారు! (ఈల వేసుకుంటూ వెళ్లిపోతాడు)
***
సూర్య: గుడ్ ఈవినింగ్ మేడమ్! మళ్లీ యిక్కడే కలుసుకున్నందుకు సంతోషం!
వై: ఎవరూ!

- సశేషం
(ఆకాశవాణి సౌజన్యంతో...)