విశాఖపట్నం

మహిళా డ్రైవింగ్ లైసెన్స్‌లకు అనూహ్య స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో మహిళల కోసం గురువారం ప్రత్యేంగా నిర్వహించిన డ్రైవింగ్ లైసెన్స్ మేళాకు అనూహ్య స్పందన లభించింది. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని అన్నారు. దేశంలోనే ప్రథమంగా రవాణా శాఖ ట్రాక్‌లో కాకుండా ఇతర ప్రాంతాల్లో యువతుల కోసం లైసెన్స్ మేళా నిర్వహించామని ఆయన తెలియచేశారు. మహిళలు వాహనాలను జాగ్రత్తగా నడపాలని సూచించారు. డీటీసీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య ద్విచక్రవాహనాల్లోనే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. లైసెన్స్ పరీక్షకు హాజరైన విద్యార్థులకు ఆర్టీఓ ఖాన్ ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్శిటీ వైస్ ఛాన్స్‌లర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.