క్రీడాభూమి

విజృంభించిన ఆండర్సన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, జనవరి 22: పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల ట్వంటీ-20 క్రికెట్ సిరీస్‌లో భాగంగా శుక్రవారం వెల్లింగ్టన్‌లోని వెస్ట్‌పాక్ స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ ఆటగాడు కొరీ ఆండర్సన్ ఆల్‌రౌండ్ ప్రతిభతో అలరించాడు. బ్యాటింగ్‌లో అతను విజృంభించి అజేయంగా 82 పరుగుల కెరీర్ బెస్టు స్కోరు సాధించడంతో పాటు బౌలింగ్‌లోనూ చక్కగా రాణించి రెండు వికెట్లు కైవసం చేసుకున్నాడు. దీంతో న్యూజిలాండ్ 95 పరుగుల తేడాతో పాక్‌ను మట్టికరిపించి 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ ఫీల్డింగ్‌ను ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టుకు ఓపెనర్ మార్టిన్ గుప్టిల్, కెప్టెన్ కాన్ విలియమ్‌సన్ 57 పరుగుల భాగస్వామ్యంతో చక్కటి శుభారంభాన్ని అందించారు. దూకుడుగా ఆడిన గుప్టిల్ 19 బంతుల్లోనే 42 పరుగులు సాధించి షహీద్ అఫ్రిదీ బౌలింగ్‌లో ఉమర్ అక్మల్‌కు క్యాచ్ ఇవ్వగా, అతని స్థానంలో వచ్చిన కోలిన్ మన్రో 4 పరుగులకే రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ తరుణంలో ఆండర్సన్ క్రీజ్‌లో పాతుకుపోయి పాక్ బౌలర్ల భరతం పట్టాడు. మూడో వికెట్‌కు 32 పరుగులు జోడించిన తర్వాత విలియమ్‌సన్ (33) వహాబ్ రియాజ్ బౌలింగ్‌లో షోయబ్ మాలిక్‌కు దొరికిపోగా, అతని స్థానంలో వచ్చిన రాస్ టేలర్ 6 పరుగులు సాధించి ‘రిటైర్డ్ హర్ట్’గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి గ్రాంట్ ఇలియట్ (19), వికెట్ కీపర్ ల్యూక్ రోంచీ (1) త్వరత్వరగా నిష్క్రమించినప్పటికీ ఆండర్సన్ (42 బంతుల్లో 4 సిక్సర్లు, 6 ఫోర్లు సహా 82 పరుగులు), మిచెల్ సాంట్నర్ (2) అజేయంగా నిలువడంతో న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీస్కోరు సాధించింది. పాక్ బౌలర్లలో వహాబ్ రియాజ్ రెండు వికెట్లు, షహీద్ అఫ్రిదీ ఒక వికెట్ చొప్పున అందుకున్నారు.
అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్‌ను న్యూజిలాండ్ బౌలర్లు గడగడలాడించారు. ముఖ్యంగా గ్రాంట్ ఇలియట్ (3/7), ఆడమ్ మిల్నే (3/8), కొరీ ఆండర్సన్ (2/17) నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడటంతో పాక్ బ్యాట్స్‌మన్లు ఘోరంగా విఫలమయ్యారు. సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్ (14), వికెట్ కీపర్ సర్‌ఫ్రాజ్ అహ్మద్ (41) మినహా మిగిలిన వారెవరూ రెండంకెల స్కోర్లు రాబట్టకుండానే పెవిలియన్‌కు క్యూకట్టారు. దీంతో 16.1 ఓవర్లలో 101 పరుగులకే ఆలౌటైన పాకిస్తాన్ జట్టు 95 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో పాటు సిరీస్‌ను చేజార్చుకుంది. ఆల్‌రౌండ్ ప్రతిభతో రాణించి న్యూజిలాండ్ విజయంలో కీలకపాత్ర పోషించిన కొరీ ఆండర్సన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును కైవసం చేసుకున్నాడు.