విజయవాడ

ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మార్చి 8: నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. సీపీ సవాంగ్ ఆదేశాలతో కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉన్నతాధికారులు పాల్గొని కమిషనరేట్ సిబ్బంది, మహిళా పోలీసులను సత్కరించారు. మరోవైపు కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో వైభవంగా మహిళా దినోత్సవం జరుపుకున్నారు. ఆయా స్టేషన్ల హౌస్ ఆఫీసర్లయిన సీఐల నేతృత్వంలో స్టేషన్ పరిధిలోని పలువురు మహిళలు, పోలీసు సిబ్బందిని సన్మానించారు. దీంతోపాటు మహిళా అభివృద్ధికి సూచికగా సీపీ సవాంగ్ నేతృత్వంలో మహిళా ప్రతినిధులు రంగులతో అరచేతి ముద్రలు వేశారు. పోలీసు కమిషనర్ కార్యాలయంలో ‘ప్రొఫెసర్ ప్రోగ్రెస్ - టైమ్ ఈజ్‌నౌ’ (అభివృద్ధి చెందడానికి సమయం ఆసన్నమైంది) పేరుతో చర్చావేదిక నిర్వహించారు. చర్చ ముగింపు అనంతరం మహిళలు తమ రెండు అరచేతులకు రంగులతో ముద్రలను వేసి ‘మహిళా అభివృద్ధికి నాంది’ అని నినదించారు.
* సత్కారం
కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదర్శ మహిళలను సత్కరించారు. కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఎస్‌ఐ సులోచన, సిసిఆర్‌బి ఎస్‌ఐ పూర్ణకుమారి, డి పార్వతమ్మ, ఇ పుష్ప, వి రేణుకాబాయి, కె వివకుమారి, జి కమలమ్మ, ఎస్‌కె షకీలా, టి తిరుతమ్మ, డి రమాదేవి, డి రామలక్ష్మి, సిహెచ్ వెంకటలక్ష్మి, పి కళ్యాణిలను జాయింట్ సీపీ కాంతిరానా టాటా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిసిపి బ్రహ్మారెడ్డి, సిసిఆర్‌బి ఏసిపి రత్నం పాల్గొన్నారు.
* పోలీస్టేషన్లలో..
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని ప్రతి పోలీస్టేషన్ పరిధిలో మహిళలను సత్కరించారు. సమాజంలో ఆటుపోట్లు ఎదుర్కొని, కుటుంబ భారాన్ని తమపై వేసుకుని పిల్లలకు ఉన్నత చదువులు చదివించి ఉన్నత స్థానంలో నిలబెట్టిన పది మంది మహిళలను ఆయా స్టేషన్ల సీఐలు ఘనంగా సత్కరించి గౌరవించారు.