కృష్ణ

మహనీయుల విగ్రహాలు కూల్చటం హేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, మార్చి 10: దేశం కోసం అహర్నిశలూ శ్రమించిన మహనీయుల విగ్రహాలను కూల్చటం హేయమైన చర్య అని పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల నేతలు పేర్కొన్నారు. దీనికి నిరసనగా ఆయా సంస్థల ప్రతినిధులు శనివారం స్థానిక అంబేద్కర్, జగజ్జీవన్‌రామ్ విగ్రహాల ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం మైలవరం వీధులలో నిరసన ప్రదర్శన నిర్వహించి స్థానిక బోసుబొమ్మ సెంటరులో ధర్నా చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఉత్తరప్రదేశ్‌లో బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని, తమిళనాడులో పెరియార్ రామస్వామి విగ్రహాన్ని, మధ్యప్రదేశ్‌లో శుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని, త్రిపురలో లెనిన్ విగ్రహాన్ని, శ్యామ్ ముఖర్జీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయటం, చిందరవందర చేయటం విచారించదగిన విషయమన్నారు. మహనీయుల విగ్రహాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. మహనీయుల విగ్రహాలను కూల్చిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. విగ్రహాల కూల్చిన ప్రాంతంలోనే ఆయా విగ్రహాలను తిరిగి నిర్మించాలని సూచించారు. అదేవిధంగా నూతనంగా నిర్మించే విగ్రహాలకు ప్రభుత్వం నుండి అనుమతి మంజూరు చేయాలన్నారు. అనంతరం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో అభయ, యువ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అన్నపరెడ్డి జమలయ్య, బిఆర్ అంబేద్కర్ యువజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు బుర్రి ప్రతాప్, రత్నం చారిటబుల్ ట్రస్ట్ జాతీయ అధ్యక్షుడు బి దాసు, లంబాడి హక్కుల పోరాట సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి హంసావత్ భోజ్యానాయక్, జై భీమ్ యువజన సంక్షేమ సంఘం అధ్యక్షులు బల్లి డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు.

రేపటి నుంచి ఒంటిపూట బడులు
నాగాయలంక, మార్చి 10: మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఈ నెల 12వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నామని ఎంఇఓ పివిఎం రామదాసు శనివారం తెలిపారు. ఉదయం 8 గంటలు నుంచి మధ్యాహ్నం 12.30 వరకు బడులు నిర్వహిస్తారని చెప్పారు. ఉపాధ్యాయులు బడిఈడు గల పిల్లల సర్వేతో పాటు ఆయా ప్రాంతాలలోని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, దాతలు, గ్రామ పెద్దల సహకారం తీసుకోవాలని ఎంఇఓ కోరారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సర్వశిక్ష అభియాన్ నిధులను సద్వినియోగం చేసి వినియోగ పత్రాలను అందించాలని ఆయన ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను కోరారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విధిగా వార్షికోత్సవాలు నిర్వహించాలన్నారు.