విజయవాడ

చట్టాలపై మరింత అవగాహన పెంచుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మార్చి 10: మారుతున్న కాలానుగుణంగా చట్టాల్లో వస్తున్న మార్పుల పట్ల మరింత అవగాహన పెంచుకోవాల్సిన అవసరముందని నగర పోలీస్ కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ అన్నారు. పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయంతో న్యాయసంప్రదింపులు చేసుకుని కోర్టులో కేసులు వీగిపోకుండా చూడాలని సూచించారు. బందరురోడ్డులోని కమాండ్ కంట్రల్ సెంటర్‌లో శనివారం జరిగిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ‘ఎమర్జింగ్ లీగల్ ట్రెండ్స్’ వర్క్‌షాపు ముగింపు కార్యక్రమానికి సీపీ హాజరయ్యారు. 13 జిల్లాల నుంచి సుమారు 170 మందికి పైగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు హాజరుకాగా నిర్వహించిన ఒకరోజు శిక్షణలో ఫుడ్ సేఫ్టీ స్టాండెడ్ యాక్టు 2006, ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ, సైబర్ నేరాలు, డిజిటల్ ఎవిడెన్సీ తదితర చట్టాల గూర్చి పీపీలకు తరగతులు నిర్వహించారు. ముగింపు సభలో వారినుద్దేశించి సీపీ మాట్లాడుతూ వృతి నైపుణ్యత మెరుగుపరుచుకుంటూ పోలీసులు, ప్రాసిక్యూటర్లు పటిష్ఠ వాదనలు వినిపించడం ద్వారా తప్పు చేసిన వారికి కోర్టులో శిక్షలు పడటమే లక్ష్యంగా పని చేయాలని, తద్వారా నేరగాళ్లను న్యాయస్థానం ద్వారా శిక్షించడం వల్ల సమాజంలో నేరాలు నియంత్రించవచ్చన్నారు. అనంతరం సైబర్ క్రైం అండ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనే పుస్తకాన్ని సీపీ ఆవిష్కరించారు. శిక్షణ పొందిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ఆయన సర్ట్ఫికెట్లు అందచేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ కాంతి రానా తాతా, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ వీ రఘురాం, అదనపు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బైరా రామకోటేశ్వరరావు, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఎన్ పూర్ణచంద్రరావు, ఇఎస్‌ఎఫ్ ల్యాబ్స్ లిమిటెడ్ ప్రతినిధులు అనిల్, ఏ శివరాం, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ పి మధుసూదనరావు పాల్గొన్నారు.