క్రీడాభూమి

‘వృద్ధాప్యంలో ప్రవేశిస్తున్నానా?’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 22: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రష్యా అందాల భామ మరియా షరపోవా నాలుగో రౌండ్‌కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో ఐదో సీడ్ క్రీడాకారిణిగా బరిలోకి దిగిన ఆమె శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్ పోరులో 6-1, 6-7, 6-0 సెట్ల తేడాతో 22 ఏళ్ల అన్‌సీడెడ్ క్రీడాకారిణి లారెన్ డేవిస్‌ను ఓడించి కెరీర్‌లో 600వ విజయాన్ని అందుకుంది. ఈ విజయం తనకు ఎంతో ప్రత్యేకమైనదని, టెన్నిస్‌లో తాను చాలా కాలం నుంచి కొనసాగుతున్నప్పటికీ 600 విజయాలను సాధించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని, అయినా ఈ మైలురాయిని చేరుకోవడం తనకు ఎంతో గర్వకారణమని పేర్కొంది. లారెన్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం ఒక విలేఖరి షరపోవాను అభినందించి ఆమెను ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా షరపోవా 600 విజయాల మైలురాయిని చేరుకున్న విషయాన్ని ఆ పాత్రికేయుడు గుర్తు చేయగా, ‘నేను 600 మ్యాచ్‌లలో విజయాలు సాధించానంటే ఎంతో ఆనందంతో పాటు ఆశ్చర్యం వేస్తోంది. అయినా వృద్ధాప్యం మీదపడుతోందని మీరు సరదాగా గుర్తు చేస్తున్నారా? అంటూ చిరునవ్వులు చిందించింది. 28వ పడిలో కొనసాగుతున్న తాను ప్రస్తుతం పవర్‌ఫుల్ షాట్లతో దూసుకొస్తున్న యువ క్రీడాకారిణులపై ఎలా నెగ్గుకు రాగలనో, ఆటకు తన శరీరం ఇంకెంత కాలం సహకరిస్తుందో చెప్పలేనని షరపోవా స్పష్టం చేసింది. నాలుగో రౌండ్‌లో ఆమె స్విట్జర్లాండ్‌కు చెందిన యువ క్రీడాకారిణి బెలిండా బెన్సిక్‌తో తలపడనుంది. కెరీర్‌లో తొలిసారి గత ఏడాది రెండు డబ్ల్యుటిఎ టైటిళ్లు సాధించిన బెన్సిక్ టొరంటోలో ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌తో పాటు ఫైనల్‌లో రెండో ర్యాంకు క్రీడాకారిణి సిమోనా హాలెప్‌పై సంచలన విజయాలు సాధించి ‘జెయింట్ కిల్లర్’గా పేరు తెచ్చుకుంది.
సెరెనా ముందంజ
కాగా, ఆస్ట్రేలియా ఓపెన్‌లో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ ఇతర మ్యాచ్‌లలో అమెరికా ‘నల్ల కలువ’ సెరెనా విలియమ్స్, నాలుగో సీడ్ క్రీడాకారిణి అగ్నేస్కా రద్వాన్‌స్కా కూడా తమతమ ప్రత్యర్థులను ఓడించి నాలుగో రౌండ్‌లో ప్రవేశించారు. టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన సెరెనా విలియమ్స్ మూడో రౌండ్‌లో 6-1, 6-1 తేడాతో అన్‌సీడెడ్ క్రీడాకారిణి దరియా కసాత్కినాపై, రద్వాన్‌స్కా 6-4, 6-0 తేడాతో మోనికా పయిగ్‌పై సునాయాసంగా విజయం సాధించారు. అయితే 10వ సీడ్ కార్లా సువారెజ్ నవర్రో, 28వ సీడ్ కిర్‌స్టినా మ్లదెనోవిచ్‌లకు మూడో రౌండ్‌లోనే నిష్క్రమించారు. అన్‌సీడెడ్ క్రీడాకారిణి ఎలిజవెతా కలిచ్కోవాతో జరిగిన మ్యాచ్ నుంచి సువారెజ్ నవర్రో ‘రిటైర్డ్ హర్ట్’గా వైదొలగ్గా, మరో అన్‌సీడెడ్ క్రీడాకారిణి దరియా గావ్రిలోవా 6-4, 4-6, 11-9 తేడాతో మ్లదెనోవిచ్‌కు చెక్ పెట్టింది.