నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. చపలాక్షి చూపుల చాడ్పున కెడ మెచ్చు ఁజిక్కని చనుఁగవ జీఱఁగోరు
నన్నుకౌఁదీగ యందంబు మది నిల్పు జఘన చక్రంబుపై ఁ జలుపు దృష్టి
యభిలాష మేర్పడు నట్లుండఁగా బల్కు వేడ్కతో మఱుమాట వినఁగ దివురు
నతి ఘనలజ్జా వనత యగు యక్కన్య పై ఁ బడి లజ్జయు ఁ బాపఁ గడఁగు
ఆ. నెంత శాంతులయ్యు నెంత జితేంద్రియు
లయ్యు గడు వివక్తమయిన చోట
సతుల గోష్ఠిఁ జిత్త చలన మొందుచు రెండు ఁ
గాము శఖ్తి నోర్వఁ గలరె జనులు
భావం: పరాశరుడు మత్స్యగంధి నేత్ర సౌందర్యాన్ని చూచిమనసులో మెచ్చుకున్నాడు. ఆమె చనుదోయిని నఖక్షతం చేయగోరాడు. ఆమె సన్నటి నడుము సొగసును మనస్సులో నిలుపుకొన్నాడు. ఆమె జఘన ప్రదేశం మందే దృష్టి నిలుపుకున్నాడు. తన కోరిక వెల్లడి అయ్యేటట్లుగా మాటలాడాడు. ఆమె ప్రత్యుత్తరాన్ని వినేందుకు ఉవ్విళ్లూరాడు. మిక్కుటమైన సిగ్గుతో నున్న ఆ కన్య మీద పడి ఆమె లజ్జను బాపేందుకు ప్రయత్నించాడు. ఎంత శాంతులైనా ఎంత జితేంద్రియులైనా ఏకాంత స్థలంలో స్ర్తిల కూటమి తటస్థిస్తే చిత్త చాంచల్యానికి లోనవుతారు. మన్మథుని బలాన్ని ఓర్వగల జనులున్నారా?

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము