నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ. గత మదమత్సరుండు, త్రిజగద్వినుతుండు వసిష్ఠపౌత్రు ఁడు
న్నమతి, శక్తిపుత్రుఁ డఘనాశన ఘోర రతపోధనుండు సు
న్రతుఁ డయి తీర్థ యాత్ర చనువాఁడు , పరాశరుఁదన్ను నీంద్రుఁడ
య్యతివఁ దలో దరిం గనియె నయ్యమునానది యోడరేవునన్

భావం: మదమాత్సర్యాలు లేని సాధుశీలి, ముల్లోకాల చేత పొగడ్తల నందుకొన్నవాడు, విశాల హృదయుడు, పాలను నశింప చేసే మహాతపస్సంపన్నుడు, వ్రతనిష్ట గలవాడు, వసిష్ఠుడికి పౌత్రుడు , శక్తిమహామునికి పుత్రుడు అయిన పరాశురుడనే పేరుగల మునీంద్రుడు తీర్థయాత్రకు వెళుతూ యమునా నది ఓడరేవులో ఆ మత్స్యగంధిని చూచాడు. పరాశరుని కుమారుడే వ్యాసభగవానుడు. వసిష్ఠుని ముని మనుమడు, శక్తి మహాముని పౌత్రుడు, పరాశరుడి కుమారుడు శుకుడికి తండ్రియైన వాడు వ్యాసుడు. అంటే శక్తి పుత్రుడు పరాశరుడు. ఇంతటి మహోన్నతమైన వంశంలోని పరాశరుడు తీర్థయాత్రకు వెళుతూ నదీతీరంలో ప్రయాణికులను తీరం దాటించటానికి ఉన్న మత్స్యగంధిని చూచాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము