అంతర్జాతీయం

వాయువ్య చైనాలో తీవ్ర భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జనవరి 21: వాయువ్య చైనా ప్రాంతంలో తీవ్ర భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టార్ స్కేలుపై 6.4గా నమోదైంది. ప్రకంపనల తీవ్రతకు చాలా ప్రాంతాల్లో డజన్లకొద్దీ భవనాలు బీటలు వారాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగినట్లు సమాచారం అందలేదు. చైనా ప్రభుత్వ అధికార వార్తాసంస్థ జిన్‌హువా కథనం ప్రకారం గురువారం తెల్లవారుజామున 1.13కు భూమి కంపించింది. ఖ్విన్‌ఘై ప్రొవిన్స్‌లోని మెన్యూన్ కేంద్రంగా 33 కిలోమీటర్ల మేర ప్రకంపనలు సంభవించాయి. పెద్దగా జనసమర్ధత లేని ప్రాంతంలో ఇది చోటుచేసుకోవడం వల్ల ప్రాణ నష్టం జరిగిన దాఖలాలు లేవు. టిబెట్ ప్రాంతంలోని ప్లటెయూ పశ్చిమాన ఆనుకుని రెక్టార్ స్కేల్‌పై 5.9 తీవ్రంతో భూకంపం సంభవించిందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ప్రకంపనలకు 20 ఇళ్లు దెబ్బతిన్నాయని జిన్‌హూవా వార్తా సంస్థ పేర్కొంది. ఒకటి రెండు నిముషాలపాటు ప్రకంపనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.