బిజినెస్

వాణిజ్యంలో కొత్త పుంతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, జనవరి 24: భారత్-ఫ్రాన్స్‌లు వ్యాపార, వాణిజ్య రంగాల్లో సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాన్ పర్యటన తొలిరోజైన ఆదివారం జరిగిన వ్యాపార శిఖరాగ్ర సదస్సులో ఇరు దేశాలు పదహారు కీలక రంగాలకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. హెలికాప్టర్ల తయారీ, స్మార్ట్ సిటీల నిర్మాణం, పట్టణ రవాణా, అభివృద్ధి, జల, వ్యర్థాల నిర్వహణ, సౌర ఇంధనం తదితర రంగాలై పరస్పర సహకారానికి ఉద్దేశించిన ఈ ఎంవోయూలపై మోదీ, హోలాన్‌ల సమక్షంలో రెండు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ప్రధాని మోదీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మేక్ ఇన్ ఇండియాలో భాగంగానే హెలికాప్టర్ల తయారీ ఒప్పందాన్ని ఎయిర్ బస్-మహీంద్రా సంస్థలు కుదుర్చుకున్నాయి. స్మార్ట్ సిటీల నిర్మాణంలో భాగంగా చండీగఢ్, నాగ్‌పూర్,పాండిచ్ఛేరి పట్టణాల అభివృద్ధికి సంబంధించి ఫ్రెంచి అభివృద్ధి అధారిటీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందం కుదుర్చుకుంది. స్మార్ట్ సిటీల నిర్మాణంలో అవసరమైన సాంకేతిక సహకారాన్ని ఫ్రాన్స్ నిపుణులు అందిస్తారు. సౌర ఇంధనం, జల, వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కూడా ఈ నగరాలకు ఫ్రాన్స్ నిపుణులు చేయూతనిస్తారు. భారత్‌కు చెందిన సిటాక్ గ్రూపు ఫ్రాన్స్‌కు చెందిన ఇడిఎఫ్ ఎనర్జీ నావెలెస్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. పునర్వినియోగ ఇంధన వ్యాపారాన్ని సంయుక్త భాగస్వామ్యంతో ఈ రెండు సంస్థలు నిర్వహిస్తాయి. 155మిలియన్ యూరోల విలువ కలిగిన ఈ ఒప్పందం ద్వారా 142మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. రానున్న ఐదేళ్ల కాలంలో ఒక గిగావాట్ పవన ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలన్నది ఈ ఒప్పంద లక్ష్యంగా చెబుతున్నారు. భారత ఇంజనీరింగ్ ప్రాజెక్టుల సంస్థతో తొమ్మిది ఫ్రాన్స్ కంపెనీలు ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. స్మార్ట్ సిటీల నిర్మాణంలో ఈ కంపెనీలు భారత్‌కు అనేక రీతుల్లో సహకరిస్తాయి.