నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క . దితి యనుదానికి సప్రతి
హతబలుఁడు హిరణ్య కశిపుఁడన బుట్టె సుతుం
దతనికి నేవురు పుట్టిరి
ప్రతాపగుణయుతులు సుతులు ప్రహ్లాదాదుల్
భావం: దక్షుడు కశ్యపుడి కిచ్చిన తన కూతుళ్లతో దితి అనే ఆమెకు హిరణ్యకశిపుడనే అవక్రమపరాక్రముడు జన్మించాడు. అతడికి బలపరాక్రమ గుణసంపన్నులైన ప్రహ్లాదుడు మొదలుగా గల అయిదుగురు కుమారులు పుట్టారు.

ఆ. అజితశక్తియుతల నాయున యనుదాని
కజరు లభిక వీరు లతుల భూరి
భుజులు శక్రరిపులు పలువురు
విక్షర బలవీర వృత్రులనఁగ

భావం: ఆ వాయువు అనే ఆమెకు మహాపరాక్రమంతులైన విక్షర బలవీర వృత్రులనే పేర్లు కల నలుగురు కుమారులు ఇంద్రుడికి శత్రువులై జన్మించారు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము