సబ్ ఫీచర్

కొబ్బరిచెట్లతో ముద్దూ ఋచ్చట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏటా ఫిబ్రవరి 14న ‘వాలెంటైన్స్ డే’ వస్తోందంటే చాలు.. వారం రోజుల ముందుగానే ప్రేమికులు పార్కులు, పబ్‌లు మొదలైన సంకేత స్థలాల వేటలో, బహుమతుల ఎంపికలో నానా హడావుడి పడుతుంటారు. ఈసారి ఆదివారం వచ్చింది ‘ప్రేమికుల రోజు’. చాలాచోట్ల అమ్మాయిలూ, అబ్బాయిలూ- ఇల్లు వదిలి ఎక్కడికోపోడానికి సాకులు వెతుక్కుంటూ వుంటే- గోవాలో మాత్రం ప్రేమికులు కొబ్బరిచెట్లు వెతుక్కుంటున్నారు. ఈసారి ‘వాలెంటైన్’గా నారికేళ (కొబ్బరి) వృక్షానె్నంచుకుని- దానితో దోబూచులాటలు, ఆలింగన చుంబనాది కేళీ వినోదాలను ఒక ఉద్యమంగా చేయమని ఒకానొక స్వచ్ఛంద సంస్థ ప్రేమికులకు పిలుపునిచ్చింది. ‘గోవా ప్రదాతల ట్రస్టు’ అనే ఆ సంస్థ నాయకుడు ఆర్నెండోగాన్ సాల్వెజ్- యువతీ యువకులు, దంపతులూ మాత్రమే కాదు, ప్రేమానే్వషణలో వున్న టీనేజీ కుర్రకారునీ గట్టిగా ప్రేరేపిస్తున్నాడు. కల్పవృక్షంగా వాసికెక్కి, ‘గోవా డామన్ డయ్యూల’ సంస్కృతికీ, సాంప్రదాయానికీ మకుటాయమానమైన నారికేళ వృక్షాన్ని కాపాడుకోవాలంటూ భారీఎత్తున వాలెంటైన్ మేళాకూడా ఆయన ప్రారంభిస్తున్నాడు.
ఆకర్షణీయమైన బహుమతులతో ఓ ఫొటోల పోటీని కూడా ఆ సంస్థ నిర్వహిస్తోంది. కొబ్బరి చెట్లను కౌగలించుకొని, దానికి ముద్దు మురిపాలు చెల్లిస్తూ ప్రేమికులు ఫొటోలు దిగాలి. పెళ్లికాని ప్రేమికులకో కేటగిరీ, దంపతులకు మరో కేటగిరి, వాలెంటైన్ల వేటలో వున్న అబ్బాయిలూ, అమ్మాయిలూ కూడా ఓ కొబ్బరి చెట్టును ఎంచుకుని- ‘ప్రేమించాం’ అంటూ ఫొటో దిగి ఆ పోటీలో పాల్గొనాలి. నారికేళ వృక్షాన్ని రక్షించుకోవాలి. అందుకే ఈ పోటీ పెడుతున్నారట!
ఈ ఉత్సవాలలో భాగంగానే ఈనెల 14న గోవా నేషనల్ హైవే నెంబర్ 17పై ఉన్న రెండు డజన్ల కొబ్బరి చెట్లను ఆ స్వచ్ఛంద సంస్థ వారు ఎంచుకున్నారు. ‘రహదారి పక్కన కొబ్బరి చెట్లను తొలగించాలనుకుంటున్న అధికారుల కళ్లు తెరిపించాలి’- అంటూ చెట్ల నీడన సంగీత, నృత్య, వినోద, విందు కార్యక్రమాల్ని ఆందోళనకారులు భారీ ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. దీనికంతటికీ కారణం ఏమిటీ అంటే గతనెలలో గోవా ప్రభుత్వం 1984నాటి వృక్ష సంరక్షణ చట్టాన్ని సవరించింది. ‘తాళ వృక్ష జాతులు- కొబ్బరి, తాడి, ఈత, పోక చెట్లు- మానులు కాదు ‘మొక్క’లే కనుక వాటిని పడగొట్టాలంటే చట్టం అనుమతి అక్కరలేదు’ అంటూ చట్టానికి సవరణ చేసింది. దీంతో ప్రతిపక్షాలే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా ఉద్యమం లేవదీశారు.
గోవా రాష్ట్రంలో నలభై ఎనిమిది లక్షల నారికేళ వృక్షాలున్నాయ్. ఇరవై అయిదువేల హెక్టార్లలో కొబ్బరి సాగుబడి వుంది. కోట్లాది కొబ్బరికాయలు- అమృతధారలు మనిషికీ, దేవుళ్లకీ కూడా అందిస్తున్నాయి. ‘చిప్‌కో’ ఆధ్వర్యంలో ఇటీవలే ఒక ఉద్యమం సాగింది. అదే మాదిరిగా ప్రేమికుల సాయంతో ఇప్పుడు ఉద్యమం చేపట్టారు. వృక్షం అంటే మాను. దానికి పెద్ద పెద్ద కొమ్మలు వుండాలి. కానీ తాళవృక్ష జాతికి- ‘టెక్నికల్‌గా’ కొమ్మలు లేవు- అని వాదిస్తున్నది గవర్నమెంటు. కొబ్బరి చెట్లను నరికి ఆ జాగాలో ఆకాశ హర్మ్యాలు నిర్మించాలన్న ‘బిల్డర్స్’ ప్లాను ఇది అంటున్నారు ఉద్యమకారులు. ఇదిలావుండగా, కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ వేసిన పార్లమెంటరీ సభ్యుల స్థారుూ సంఘం ఒకటి - ‘కొబ్బరిచెట్టు వృక్షమే’ అంటూ ఒక ప్రకటన పడేసింది. ఈసారి గోవాలో వాలెంటైన్స్‌డే - ‘కోకోనట్ ఆలింగన కేళి’ అవుతోందన్నమాట. మన తెలుగు రాష్ట్రాల యువత కూడా ఓ చెట్టును ప్రేమించి- ‘ప్రేమికుల రోజు’ చేసుకుంటే ఎలా వుంటుంది? బై ది బై.. మన చెట్టు వేప చెట్టు.
వేళాపాళా లేని గానా బజానా..!
గత నెల నాలుగున జోధ్‌పూర్ నుంచి ముంబయికి ‘గగన యానం’ చేస్తున్న జెట్ ఎయిర్‌వేస్ విమానంలో పాప్‌సింగర్ సోనూ నిగమ్ తన తాజా చిత్రం- ‘వీర్ జారా’లోని రెండు పాటలు- ‘గగన సీమలో హాయిగా ఎగురుదామా..’ అన్నట్లు వీనులవిందుగా పాడారు. విమానంలో ‘వార్నింగ్స్’కి ఉపయోగించే ‘మైక్రోఫోన్’లోంచి తన గానం వినిపించి- అందర్నీ కేరింతలు కొట్టించాడు. ఎయిర్ హోస్టెస్‌లు, పైలట్, కోపైలట్ - అంతా గానామృత పానమత్తులై తరించారు. ఎక్కడికి వెళ్లినా అందరి చేతుల్లో మొబైల్ ఫోన్, వీడియో కెమెరాలేగా ఇపుడు.. అందుకే వెంటనే యుట్యూబ్‌లోకి ఎక్కింది ఈ ‘గగన గానకచేరీ’. పాట పాడుతున్నా ఆపనందుకు పాపం..! ఆ అయిదుగురు విమాన సంస్థ ఉద్యోగులూ సస్పెండ్ అయిపోయారు. సోనూ నిగమ్ తన సినిమాకి వచ్చిన హైప్‌ని మర్చిపోయి ఎక్కిళ్లురాగా- విమాన సంస్థల అధికారుల్ని ‘ఇన్ టాలరెంట్ పీపుల్’అని కొత్తగా ప్రాచుర్యంలోకి వచ్చిన తిట్టుతిట్టాడు. సోనూ భాయ్! హాయ్ హాయ్!!
తొలి ‘ఖాజీ’ మహిళ!
మసీదుకీ, దర్గాకీ వెళ్లే హక్కుల కోసం ముస్లిం మహిళా సంఘాలు ఉద్యమిస్తున్న తరుణంలో- రాజస్థాన్‌లో జహాఆరా అనే వనిత రెండు సంవత్సరాల దారుల్- ఉలూమ్- ఎనిసావా’ (మత గురువు కోర్సు) పూర్తిచేసి ‘ఖాజీ అమ్మ’గా అవతరించింది. ఆమె స్వస్థలం జైపూర్. ఇస్లాం మతం స్ర్తిలకు ఇచ్చిన హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం సాగిస్తానని ప్రకటించిందామె. ‘నేషనల్ ఉమెన్ వెల్‌ఫేర్’ సంస్థకు అనుబంధంగా ఉద్యమం సాగిస్తానన్నది ఖాజీ జహాఆరా! ‘షీ రుూజ్ ద ఫస్ట్ అండ్ ఫోర్‌మోస్ట్’ అన్నారంతా అభినందనలతో ముంచెత్తుతూ.

-వీరాజీ