రాష్ట్రీయం

విలీనానికి రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: తెలుగుదేశం శాసన సభాపక్షానికి చెందిన తమను తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభాపక్షంలో విలీనం చేయాలని కోరుతూ పదిమంది తెదేపా ఎమ్మెల్యేలు సంతకాలతో కూడిన లేఖను శుక్రవారం స్పీకర్‌కు పంపించారు. తెలుగుదేశం నుంచి 15మంది శాసన సభ్యులం గెలిచామని, తెలుగుదేశం శాసన సభాపక్షంగా వ్యవహరిస్తున్నట్టు స్పీకర్‌కు రాసిన లేఖలో తెలిపారు. ఈనెల 11 టిడిపి శాసన సభాపక్షం కార్యాలయంలో సమావేశమై తెదేపా శాసన సభాపక్షాన్ని తెరాస శాసన సభాపక్షంలో వీలీనం చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. తెరాసలో విలీనానికి పదిమంది ఎమ్మెల్యేలు అంగీకరించారంటూ, తెరాసలో చేరిన పదిమంది ఎమ్మెల్యేల పేర్లను లేఖలో పేర్కొన్నారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జి సాయన్న, టి ప్రకాశ్‌గౌడ్, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, కెపి వివేకానంద, చల్లా ధర్మారెడ్డి, ఎస్ రాజేందర్‌రెడ్డిలు తెరాస శాసన సభాపక్షంలో చేరాలని నిర్ణయించినట్టు లేఖలో పేర్కొన్నారు. తెలుగుదేశం శాసన సభాపక్షానికి చెందిన పదిమంది శాసన సభ్యులను ఇకపై తెరాస శాసన సభాపక్షం సభ్యులుగా గుర్తించాలని కోరారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ నాల్గవ పేరాలో పేర్కొన్న విధంగా తాము తెరాసలో విలీనమైనట్టు లేఖలో చెప్పారు. శాసన సభలో తెరాస శాసన సభాపక్షం సభ్యుల జాబితాలో తమను తక్షణం చేర్చాలని, తెరాస సభ్యులుగానే చూపించాలని స్పీకర్‌ను కోరారు. జాబితాలోని పదిమంది ఎమెల్యేలు కూడా స్పీకర్‌కు అందజేసిన లేఖపై సంతకాలు చేశారు.