జాతీయ వార్తలు

వీర జవానుకు వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: సియాచిన్ వీర జవాను హనుమంతప్పకు వేలాది మంది అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. సియాచిన్ మంచు చరియల్లో కూరుకుపోయి ఆరు రోజుల తరువాత ప్రాణాలతో బయటపడిన లాన్స్‌నాయక్ హనుమంతప్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. లాన్న్ నాయక్‌కు కర్నాటకలోని ధార్వాడ్ జిల్లా బెతాదూర్ గ్రామంలో శుక్రవారం అంత్యక్రియలు జరిగాయి. హనుమంతప్ప పనిచేస్తున్న మద్రాస్ రెజిమెంట్ సైనికులు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, బంధువులు పెద్ద ఎత్తున అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తొలుత దివంగత జవాను బౌధికకాయాన్ని హుబ్లీలోని నెహ్రూ స్టేడియంలో ప్రజల సందర్శనార్ధం ఉంచారు. హనుమంతప్ప మృతదేహంపై త్రివర్ణ పతకాన్ని కప్పి అధికార లాంఛనాలతో అంతిమవీడ్కోలు పలికారు.