నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. యమువంశమునఁ బుట్టె నధిపతి ధర్మజుం డనిలాంశమునఁబుట్టెననిల జుండు
శక్రాంశమున ధనంజయుఁ డుదయించె నా శ్వినుల యంశముల నూర్జితులు నకుల
సహదేవులన వద్యచరితులు పుట్టిరి శ్రీమూర్తి యై యాజ్ఞసేని పుట్టె
నగ్ని యంశమున జితారి ధృష్టద్యుమ్ను ఁడన బుట్టె ద్రుపద రాజాస్వయనమున
ఆ. ననఘ యిది సురాసురాంశానతారకీ
ర్తనము దీని వినిన దవిలి భక్తిఁ
జదివినను సమస్త జనులకు నఖిలదే
వాసురాదు లిత్తు రభిమతములు
భావం: యముడి అంశతో ధర్మరాజు, వాయుదేవుడి అంశతో భీముడు, ఇంద్రుడి అంశతో అర్జునుడు జన్మించారు. అశ్వినులఅంశతో నకుల సహదేవులు పుట్టారు. లక్ష్మి అంశతో ద్రౌపది జన్మించింది. అగ్ని అంశతో దృష్టద్యుమ్నుడు ద్రుపద రాజవంశంలో జన్మించాడు. ఓ పుణ్యుడా! ఇది దేవాసురుల అంశలతో భూతలం పైన జన్మించినా వారి కీర్తనం, దీనిని భక్తితో విన్నవారికి చదివిన వారికి ఆ దేవాసురులు కోరికలను నెరవేరుస్తారు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము